Gemology-రత్నశాస్త్రం

నవగ్రహాలకు సంబంధించి వివిధ రకాల రత్నాల యొక్క మంచి మరియు చెడు ప్రభావాల గురించి వివరించే రత్నశాస్త్రం (Gemmology )జ్యోతిష్య శాస్త్రం లో ని అంతర్భాగమే అని గుర్తించాలి . ఒక జాతకుడు తన జాతకానికి సంబంధించి తగిన నిజమైన జాతి రత్నాన్ని ధరించినట్లైతే అతడు తప్పకుండా ఉన్నత దశకు చేరుకుంటాడు . అయితే ఎంతటి అనుభవం ఉన్న జ్యోతిష్కుడు కూడా ఒక జాతకుడికి ఏ రత్నం అదృష్టాన్ని తెచ్చి పెడుతుందో సరిగ్గా నిర్ణయించలేకపోవటం ప్రస్తుతం జరుగుతుంది . దాని కారణంగా ఒక వ్యక్తి అనేక రకాల రత్నాలను ఒక దాని తరువాత ఒకటి ధరించి ఆశించిన ఫలితాలు రాక రత్న ధారణ అనే విషయాన్నీ మర్చిపోవటం జరుగుతుంది .జ్యోతిష్య శాస్త్రం మీద ఎంతో అనుభం , పరిజ్ఞ్యనం ఉన్న జ్యోతిషులను సంప్రదించగలరని నా మనవి .. మాకు తెలిసిన అనేక మంది చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు మా సలహాతో తమకు యోగాన్ని కలిగించే రత్నాన్ని తెలుసుకుని ఆ పై ఆ రత్నాన్ని ధరించి కొన్ని నెలలలోనే మంచి స్థితికి వెళ్ళటం జరిగింది ..
గమనిక – సంపూర్ణ జాతకం చూసిన తరువాత మాత్రమే సలహా అనేది తీసుకోవాలి .

 

నవరత్నములు ధరించడం వల్ల అనేక శుభయోగములు కల్గును.

రవి – కెంపు

చంద్రుడు – ముత్యం

కుజుడు – పగడం

బుధుడు – పచ్చ

గురుడు – పుష్య రాగం

శుక్రుడు – వజ్రం

శని – నీలం

రాహువు – గోమేధికం

కేతువు – వైఢూర్యం