Numerology- సంఖ్యాశాస్రం

సంఖ్యా నెంబర్ -1 :  

భూమి మీద పుట్టిన స్రీ  అయిన పురుషుడు అయిన, ఎ నెలలోనైనా, ఎ సమ్వత్సరములొనైనా, ఏ దేశంలోనైనా, ఏ ఊరిలోనైనా, జన్మించిన స్రీలు అయినా, పురుషులైనా, 1, 10, 19, 28 తేదిలలో పుట్టిన వారందరూ కూడా రయ జాతకులే. వీరి సంఖ్యా = 1. అంటే వీరందరూ ఒకటవ సంఖ్యకు చెందినవారు.
EX:
తారీకు 1 = 1
తారీకు 10 = 1+0 = 1
తారీకు 19 = 1+9 = 10 = 1+0 = 1
తారీకు 28 = 2+8 = 10 = 1+0 = 1
నోట్: ఏక సంఖ్య వచ్చువరకు పుట్టిన తేడినీ కోదుకొవాలి. అలా కూడగా వచ్చిన సంఖ్యను = అతని సంఖ్య అన్తున్నము. 1వ సంఖ్యకు సూర్యుడు (సూర్యగ్రహము) అధిపతి. అందువల్లనే వీరిని సూర్య జాతకులు అని పిలుస్తున్నాము.
సూర్య జాతకులకు ఆతమాభిమానం, పట్టుదల కార్యదీక్ష చాల ఎక్కువ. వీరు వారి ఆత్మ విశ్వాసాన్ని, పనినే నమ్ముకుంటారు. వీరిది ప్రాక్టికల్ లైఫ్. అందువల్ల వీరు వీరి శ్రమనే నమ్ముకోవాలి. వీరు స్రమచేస్తే సూర్యనివలె వెలుగుతారు. నలుగురిలో ఆదర్శప్రాయంగా ఉన్తారు. మంచి పోజిషిన్ కు చెరుకుంటారు. వీరు ఎల్లప్పుడూ నెంబర్వన్ పోజిషన్నే కూరుకుంటారు. నెంబర్వన్ పోజిషిన్ కు ఎదుగుతారు. వీరు వీరి జీవితంలో రెండవ స్థానాన్ని ఇష్టపడరు. వీరు ఉన్నత స్థానంలోనే రాణించగలరు.
మీరు శ్రమ చేస్తే, భాగా చదువుకునే అవకాసం వుంది. చదువుకొంటారు. గోప్పవిద్యవంతులు అవుతారు. ఆఫిసర్లుగా పెద్ద పొజిషన్లో ఉంటారు. సమాజానికి మేలు చెస్తారు. వీరిలో గొప్ప గుణం క్రమ శిక్షణ, రుజుప్రవర్తన. వీరికి చదువు, క్రమసిక్షణయే పెట్టుబడి.
వీరు జీవితంలో గొప్ప గొప్ప ఆశయాలకొరకు బ్రతుకుతారు.
వీరు డబ్బుకన్న కీర్తిప్రతిష్టలకే ఎక్కువ విలువనిస్తారు. కశ్తపదుతారు. కీర్తిప్రతిష్టలు సంపాదిస్తారు. సమాజానికి సేవ చేస్తారు. వీరికి మంచి ప్రవర్తన, మంచి అలవాట్లు ఉంటాయి. అయితే వీరికి కొంచెం కోపం, టెన్షన్ ఏక్కువ.
సంఖ్యా నెంబర్ -2 :  
భూమి మీద పుట్టిన స్రీ  అయిన పురుషుడు అయిన, ఎ నెలలోనైనా, ఎ సమ్వత్సరములొనైనా, ఏ దేశంలోనైనా, ఏ ఊరిలోనైనా, జన్మించిన స్రీలు అయినా, పురుషులైనా, 2, 11, 20, 29 తేదిలలో పుట్టిన వారందరూ కూడా రయ జాతకులే. వీరి సంఖ్యా = 2. అంటే వీరందరూ ఒకటవ సంఖ్యకు చెందినవారు.
EX:
తారీకు 2 = 2
తారీకు 11 = 1+1 = 2
తారీకు 20 = 2+0 = 2
తారీకు 29 = 2+9 = 11 = 1+1= 2
నోట్: ఏక సంఖ్య వచ్చువరకు పుట్టిన తేడినీ కోదుకొవాలి. అలా కూడగా వచ్చిన సంఖ్యను = అతని సంఖ్య అన్తున్నము. 2వ సంఖ్యకు చంద్రుడు (చంద్రగ్రహము) అధిపతి. అందువల్లనే వీరిని చంద్ర జాతకులు అని పిలుస్తున్నాము.

ఈ చంద్ర జాతకులకు మంచి మనసు, మంచి ఆలోచనలు,లోతైన ఆలోచనలు, సున్నితమైన మనస్సు, సున్నితమైన స్వబావం, పిరికితనం, ఎక్కువగా ఉంటాయి . వీరు ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా లోతుగా,అనవసరంగా అలోచించి మనస్సు పాడు చేసుకుంటారు. వీరు ఎలాంటి సుఖం, కష్టం వచ్చినా తట్టుకోలేరు, ఎందుకంటే వీరిది సున్నితమైన స్వభావం కాబట్టి .

వీరి ప్రతి విషియాన్ని బాగా ఆలోచించి, ఆలోచించి ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటారు.ఒక విధంగా తొందరగా నిర్ణయాలు తీసుకోలేరు. ఇతరులు దైర్యం చెబితే కాని ఒక నిర్ధారణకు రాలెరు. వీరికి దైర్యంచెప్పేవాలు చాలా అవసరం. వీరు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరికి అందివచ్చిన మంచి అవకాశాలు పోగొట్టుకుంటారు.. వీరికి అదృష్టం వెతుకుంటూ వస్తుంది. కాని వీరి కాలయాపన వల్ల అందివచ్చిన్న అవకాసలన్నిటిని వీరు ఉపయొగించుకోలెక తర్వాత భాదపడతారు. వీరికి మంచి ఆలోచనా శక్తి, మంచి గ్రహణ శక్తి, మంచి తెలివితేటలు, మంచి ఊహాశక్తి ఉంటాయి. కాని అతి ఆలోచన కొంచెం పిరికితనం వీరి దురదృష్టానికి కారణం కావచ్చును. వీరికి అరచేతిలో చంద్ర స్తానం బాగుంటే చాలామంచిది.

సంఖ్యా నెంబర్ -3 :
భూమి మీద పుట్టిన స్రీ  అయిన పురుషుడు అయిన, ఎ నెలలోనైనా, ఎ సమ్వత్సరములొనైనా, ఏ దేశంలోనైనా, ఏ ఊరిలోనైనా, జన్మించిన స్రీలు అయినా, పురుషులైనా, 3, 12, 21, 30 తేదిలలో పుట్టిన వారందరూ కూడా రయ జాతకులే. వీరి సంఖ్యా = 3. అంటే వీరందరూ ఒకటవ సంఖ్యకు చెందినవారు.
EX:
తారీకు 3 = 3
తారీకు 12 = 1+2 = 3
తారీకు 21 = 2+1 = 3
తారీకు 30 = 3+0 = 3
నోట్: ఏక సంఖ్య వచ్చువరకు పుట్టిన తేడినీ కోదుకొవాలి. అలా కూడగా వచ్చిన సంఖ్యను = అతని సంఖ్య అన్తున్నము. 3వ సంఖ్యకు గురువు (గురు గ్రహము) అధిపతి. అందువల్లనే వీరిని గురు జాతకులు అని పిలుస్తున్నాము.

ఈ గురు జాతకులు ఓటమిని అంగీకరించరు. రాజీపడరు. రాజిపడలేరు. అనుకున్నది సాదించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తారు. వీరికి వీరి పనులు సకాలంలో జరగకపోతే వీరికి టెన్షన్ వస్తుంది.

ఈ గురు జాతకులు బాగా  చదువుకొనే అవకాసం ఉంది. మంచి మంచి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది. వీరిలో ఉద్యోగస్తులు, రాజకీయనాయకులు, అధికారులు, ఉన్నతస్తానంలో ఉన్నవారే ఎక్కువ . వీరు వీరి వృత్తిలో రానిచాలంటే అరచేయిలో గురుబలం బాగుండాలి. సామాన్యంగా ఏ వ్యక్తీ అయినా, ఏ వ్రుత్తిలొనైన రాణించాలంటే ఆ వ్యక్తికీ గురుబలం ఉండాల్సిందే.

గురు జాతకులు ఎప్పుడు మొదటి స్తానన్నే కోరుకుంటారు. కస్టపడి 1వ స్తానం పొందుతారు. వీరు ఎప్పుడు గెలుపునే కోరుకుంటారు. పెత్తనం కోరుకుంటారు. పెత్తనం చెలాయిస్తారు.

వీరు క్రమశిక్షణ, మంచి మార్గాలను ఇష్టపడతారు. మంచి మార్గాలలోనే ప్రయానిస్తారు. ఓటమిని అంగీకరించరు. వీరు  నిర్ణయాలే తీసుకుంటారు. ఇతరుల సలహాలు పాటించారు.

గురు జాతకులు ఉద్యోగాలు చేస్తారు. అయినా వీరు రాజకీయాలలో  పేరుప్రఖ్యాతలు సంపాదిస్తారు. వ్యాపారాలు చేస్తే వ్యాపారాలలో కూడా రానిచగలరు. సంపాదించగలరు.

గురుజాతకులకు అత్మాబిమానం, కోపం,పట్టుదల, గర్వం,ప్రేమాబిమానాలు కూడా ఉంటాయి. వీరు తాము అనుకున్న పనిని చేసి తీరుతారు. ఎవరి మాట వినరు. ఎవరిని లెక్కచేయరు. వీరికి తోచిన పనినే చేస్తారు. వీరు  మంచికి,చెడుకి, రెండింటికి సమర్దులే.

భూమి మీద పుట్టిన స్రీ  అయిన పురుషుడు అయిన, ఎ నెలలోనైనా, ఎ సమ్వత్సరములొనైనా, ఏ దేశంలోనైనా, ఏ ఊరిలోనైనా, జన్మించిన స్రీలు అయినా, పురుషులైనా, 4, 13, 22, 31 తేదిలలో పుట్టిన వారందరూ కూడా రయ జాతకులే. వీరి సంఖ్యా = 4. అంటే వీరందరూ 4 వ సంఖ్యకు చెందినవారు.
EX:
తారీకు 4= 4
తారీకు 13 = 1+3 = 4
తారీకు 22 = 2+4 = 4
తారీకు 31 = 3+1 = 4
నోట్: ఏక సంఖ్య వచ్చువరకు పుట్టిన తేడినీ కోదుకొవాలి. అలా కూడగా వచ్చిన సంఖ్యను = అతని సంఖ్య అన్తున్నము. 4వ సంఖ్యకు రాహువు (రాహు గ్రహము) అధిపతి. అందువల్లనే వీరిని రాహు జాతకులు అని పిలుస్తున్నాము.

జ్యోతిష్య శాస్రం ప్రకారం ఉన్న తొమ్మిది గ్రహాలలో అన్నింటికన్నా బలమైన గ్రహం రాహువే, అందుకే సూర్యున్ని రాహువు మింగడం వల్ల సూర్యగ్రహణం వస్తుందని పెద్దలు చెబుతారు. సూర్య జాతకులకు రాహు జాతకులకు దగ్గర పొలికలున్నయి. అందుకే ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారు వీరు. ఇద్దరికీ దగ్గర పోలికలుంటాయి అయినా ఇవి వేరు వేరు గ్రహాలు.

రాహు జాతకులకు ఒక రకమైన ప్రత్యేకమైన మనస్తత్వం, పోకడలు, అబిరుచులుంటాయి. వీరు  కలవలేరు. వీరు  విరుద్దంగా ఉంటారు. వాదనలో కూడా వీరు ఇతరులకు విరుద్దంగా మాట్లాడతారు. వీరు  చీటికి మాటికిగొడవలు పడతారు. వారిదే పై చేయి కావాలనుకుంటారు. వారి గొడవలకు అర్దం కూడా ఉండకపోవచ్చు.

వీరికి ఇతరులతో శత్రుత్వం ఎక్కువ. అందరి దారి ఒకటైతే వీరి దారి మరొకవైపు ఉంటుంది. వీరు నలుగురిలో కలవలేరు ఇతరులతో ఏకీబవించలెరు. వారికి నమ్మకం కలిగితే తప్ప, ఋజువులు ఉంటె తప్ప తొందరగా ఏ విశియాన్ని నమ్మరు. వీరు దేవుడిని కూడా నమ్మరు. దేవుడు లేదు అంతా మన ప్రయత్న బలమే మన స్వంత శక్తే అంటారు. రాహు జాతకులలో ఎక్కువ మంది దేవుణ్ణి నమ్మరు. వారు కేవలం వీరి స్వయం కృషినే, వారి స్వంత తెలివితేటల నే నమ్ముకుంటారు. వీరికి కోపం తొందరపాటు ఎక్కువ, ఓర్పు తక్కువ.

రాహు జాతకుల ఆలోచనలు ఇతరులకు విరుద్ధంగానే ఉంటాయి. వీరి నిర్ణయాలు కూడా విరుద్దమే, వీరికి ఓర్పు క్రమ శిక్షణ ప్లాన్ ఉండదు. అందువల్ల వీరి జీవితం క్రమబద్దంగా ఉండటం కష్టం. వీరు నీతి నియమాలను, క్రమ శిక్షణను పాటించలేరు. వీరు చట్ట ప్రకారం నడుచు కాలేరు. చట్ట విరుద్దమైన పనులు చేస్తారు. వీరి అరచేతిలో రాహు స్తానం బాగా లేనిచో వీరు చెడు పనులు చేసి కష్టాలు ఎదురుకుంటారు.

telugu-number5
5 వ సంక్యవారి పలితాలు
 అంకె 5 – బుధుడు
 కళలకు అధిపతి[ సృష్టి కర్త ]
   5,14,23తేదిలలో జన్మించిన వారు తేది , నెల , సంవత్సరము కలిపినా మొత్తం 5 వచ్చిన వారు బుధ ఆదిక్యత లో పుతిన వారు .
 స్వభావాలు – లక్షణాలు
         ఈ అంకె పాలనా దక్షత కలది . అన్నిటిలోనూ రాణించ గల శక్తీ కలిగిన ది . పంచ బూతాలు నీరు , నిప్పు , గాలి , మన్ను , మిన్ను , పంచేంద్రియాలు కళ్ళు , చెవి , ముక్కు , నాలుక, చర్మం పాండవులు ఐదు గురు , ఆయుర్వేదంలో ఉత్తమ ఔషదాలు ఐదు ,జ్యోతిష్య శాస్త్రంలో ఐదు అంగాలను విశదీకరించే గ్రంధం పంచాంగం .
        తొమ్మిది గ్రహాలలో 5 అయిన బుడుడు మధ్యముడు . అన్నిటిలోనూ సాటి లేని భలం చూప గలిగినది . ప్రజలను ఆకర్షించే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది . [ప్రజాశక్తి ]అన్ని విషయాలలోనూ ప్రవేశం ఉంటుంది .
         ప్రసిద్ది గాంచిన వ్యక్తులుగా ఉంటారు . దేశ ప్రజలను ఆకర్షించే  శక్తీ వీరికి ఉంటుంది . ప్రజాకర్షణ కల అంకె . ప్రజాబలం , ధన భలం , రెండు వీరికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి .
         ఇతరులు చేయలేని పనులను చేయగలరు . ప్రజా సంబంధం గల వృత్తులను ఆచరించి రాణిస్తారు . ఇంద్రియాలను అదుపులో ఉంచగల శక్తీ ఉంటుంది . ఆత్మవిశ్వాసము సడలని సిద్దాంతము కల వారు . కళలను ఆకర్షించే ముఖము కల వారు . దీర్గాలోచన కల వారు . ఆచరించే పనులలో విజయం సాదిస్తారు .
       చురుకైన వారు . అన్నిటిలో వేగం ఉంటుంది . మెదడు మెరుపు వేగం తో పని చేస్తుంది . అన్నిటిలోనూ చురుగ్గా వ్యవహరించి ఆగ్నాపించగల స్తాయిలో ఉంటారు . గాంబీర్య లక్షణం కలవారు . నిత్యోత్సాహులు , కళలలో అభినివేశం ఉన్నవారు .
       బుడ్డి సూక్ష్మత కల వారు . నూతన అభిప్రాయాలు మనస్సులో పొడ చూపుతుంటాయి .ఇతరుల సమస్యను తమ మెరుపు వేగ ఆలోచనలతో పరిష్కరిస్తారు . ఇతరులకు హితం చెప్పడంలో సిద్ద హస్తులు . ఇతరులు ఎన్నో రోజులు ఆలోచించే చేయ గల పనులను వీరు వెంటనే చేసి విజయం సాదిస్తారు .
          తమ ప్రతిభను ఎవరు గుర్తించడం లేదని కొన్ని సమయాలలో బాద పడతారు . తమ ఎదుగుదల తమకు సంబందించిన వారి మంద బుద్ది కారణంగా నిలిచి పోతున్నదని చెప్పుకుంటారు . వినూత్న అభిప్రాయాలను వ్యక్తికరిస్తుంటారు .  వీరి అభిప్రాయాలు నిలకడ అయినవిగా ఉంటాయి . వీరు దివంగతులైనా దేశ ప్రజలకు మార్గ దర్సకులవుతారు .
      ప్రపంచం మందంగా సాగుతుందని భావిస్తారు . విషయమేదైనా  వెంటనే గ్రహిస్తారు . సమస్యాత్మకమైన వాటికి వీరు పరిష్కారం చూపగలరు . వీరి మనస్సు , శరీరం అంతటా అతీత శక్తీ వ్యాపించి ఉంటుంది . ఇటువంటి శక్తిని వారు గ్రహించగలరు . ఇతరులకు వీరు తొందర మనుషులుగా అన్పిస్తారు .  యంత్రం లా పరిబ్రమిసుంటారు .
         బయటి ప్రదేశాలకు వెళ్లి రావడంలో ఎక్కువ ఇష్టం ఉంటుంది . త్వరగా అభివృద్ధి చెందడం లో ఆసక్తి కనపరుస్తారు . ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు . హాస్యం కలిగిన మాటలు , పసి బిడ్డ వంటి చేష్టలు ఉంటాయి .. ఎవరితోనైనా త్వరగా కలసి పోతారు . వారి అంతర్గత వ్యవహారాలను గ్రహిస్తారు .
           వాస్తవ దృక్పదం కలవారు . మనస్పూర్తిగా మాట్లాడతారు . మనస్సులో అభిప్రాయాలను వెంటనే బయట బేడతారు . కల్మష రహితులు . దాపరికం లేని వారు . వీరి చుట్టూ ఉన్నవారికి వీరి అంతరంగిక విషయాలన్నీ తెలిసి ఉంటాయి . దైవానుగ్రహం పొందిన వారు
           మాటిమాటికి పధకాలను మార్చుకుంటారు . ప్రాచిన మైన వాటిని ఇష్ట పదారు . కొత్తదనం, విప్లవ దృక్పదం ఉన్నవారు . పరిశోదనా పరులు . కొత్త నాగరికతను వెంటనే ఆహ్వానిస్తారు .
        ఇతరుల వలె పుట్టి , పెరిగి , ఎదోవిదంగా బ్రతకడం అన్న దృక్పదం కాక మానవ హితాన్ని ఆశించి జీవిన్చాలనుకుంటారు . ప్రపంచ జనుల పరివర్తనకై కొత్త సిద్దాంతాలను ప్రచారం చేస్తారు .
        గొప్ప పనులనైనా సునాయాసంగా ముగించ గలము అన్న విశ్వాసము కల వారు . ఎపనిలోనైనా జంకు కాని , భయం కాని లేకుండా సాహసోపేతంగా ప్రవర్తిస్తారు .
    జూదం, రేసులు వంటి వాటిలో విజయం తప్పని సరిగా లబిస్తుందని పాల్గొంటారు . కొందరు అడ్డ దారిలో త్వరగా ప్రగతి సాదించ వచ్చని విశ్వసిస్తారు .
        మనం ఇలా ప్రవర్తించి ఉండకపోతే అభివృద్ధి చెంది ఉండలేమని అభిప్రాయ పడతారు . ఇతరులకంటే భిన్నమైన అభిప్రాయాలూ కలిగి ఉంటారు . సదా ఆశయం కల వారు .
       ఓటమికి వెనుక అంజ వేయరు . దానిని జయించే మార్గాన్ని అన్వేషిస్తారు . ఆత్మస్తైర్యం ఉన్నవారు . ఆత్మ విశ్వాసంతో  దేనినైనా ఎదుర్కోగలరు . ఓటమి, దుఃఖం లేని జీవితం , వీరికి కలిగి ఓటములు సైతం వారి మంచి కోసమే నని పరిసీలించినానంతరం తెలుస్తుంది .
       వీరి బుద్ది ఆత్మ శక్తి వలన ప్రేరణ పొందుతుంది . మనసులో జనించే ఉత్తమాభిప్రాయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తే సంపూర్ణ విజయం లభిస్తుంది . తమ ఇష్ట ప్రకారం పనులను  ఆచరించి విజయం పొందుతారు .
         శారీరక బలం కంటే బుద్ది బలం  ఎక్కువ కల వారు . వీరి బుద్ది హెచ్చరించడం ద్వారా అపాయాల బారి నుంచి తప్పించు కుంటారు . మనస్సులో ఒక రకమైన ఆకర్షణ శక్తీ , మాయా శక్తీ , మిళితమై ఉంటుంది . ఆ శక్తీ కారణంగా సమస్యలను ముందుగానే తొలగించు కుంటారు .
         సమాజ జీవితం , రాజకీయం , కళల పట్ల మంచి అవగాహన ఉంటుంది . కొందరు వీరిని తమాషా వ్యక్తీ అని , ఆటలాడే పసి మనస్కులని భావిస్తారు . తమ హాస్య ధోరణిలో ఇతరులతో కలసి పోతారు . ఇతరులకు నవ్వించడమే కే ఆలోచింప చేస్తారు . మనస్సు లోని భావాలను ఆచరణలో చూపిస్తారు . డబ్బు సంపాదించడం లో ఆసక్తి , ప్రతిభ కల వారు .తప్పు చేసిన వారిని దండించడం  కంటే క్షమించడం మంచిదన్న అభిప్రాయం కల వారు . ఇందువలన ఇతరులు వీరిని అభి నందిస్తారు .
         వీరు అక్రమ మార్గాలలో , జుదాది వ్యవహారాల ద్వారా సంపాదించాలా అనుకోవడం భావ్యం కాదు . అలా ప్రవర్తిస్తే తొలుత విజయం కలిగి తరువాత  అదః పాతాళం  లోకి పద వేస్తుంది
  వీరు ప్రతి పనిలోనూ నూతనత్వాన్ని ఇష్ట పడతారు . ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని ప్రముక్యతను ఇస్తారు . చిరు ప్రాయంలో సైతం ఒక రోజు నచ్చ్చిన ఆట సామానులు , తిను బండారాలు బట్టలు మరుసటి రోజు ఇష్టపడని నైజం కల వారు .
        పారిశ్రామిక రంగం , ఉద్యోగం , మిత్రులు , అలవాట్లు మొదలైన ప్రతి విషయాలలోనూ  మార్పులు కోరుకుంటారు . వృత్తిలోను నూతనత్వాన్ని ఇష్టపడతారు . ఉద్యోగస్తులు చోటును , పరిసరాలను తరచుగా మార్చుకుంటారు .
        ఒకే వృత్తిని జీవితాంతం చేయడం వీరికి అలవాటు లేదు . మంచి ఆదాయము ఉన్న వ్రుత్తినైనా మార్చుకుంటారు . కొందరు ఆద్యాత్మిక సంబందమైన వృత్తులను చేపట్టి యౌవనం లోనే కీర్తిని సంపాదించుకుంటారు . ప్రయాణం చేయడం అంటే ఆసక్తి ఉంటుంది . తరచుగా వినోద యాత్రలు చేస్తారు . ప్రకృతి దృశ్యాలను చూడడం చారిత్రిక ప్రసిద్ది గాంచిన స్తలాలను దర్శించడం వీరికి అభిమాన విషయాలు .
         పుణ్య స్తల దర్సనం వీరి అభిరుచి . దైవ ప్రార్దన ప్రత్యేకంగా ఇష్ట పడతారు . వీరి ప్రార్ధనా ధోరణి ఇతరులను ఆశ్చర్య పరుస్తుంది . విదేశి యానం చేస్తారు . కొత్త చోట్లను సందర్శిస్తారు .
         రేపటి ప్రపంచం మనదేనన్న దీమా కల వారు . మరుక్షణం చేయ బోతున్న పని ఏమిటన్నది వీరెరుగరు . వీరిలో నిగూదంగా  ఉన్న ఆద్యాత్మిక శక్తీ కారణంగా వీరికి కలుగుతుందనుకున్న అపాయాలని ఆశ్చర్యంగా తప్పించుకుంటారు .
        వీరి అంతర్గత అనుబూతులకు ప్రాముక్యత నిచ్చి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే గొప్ప కార్య దక్షులు కావడం అక్షర సత్యం . శారీరక శ్రమ కంటే భావ [ బుద్ది ] పరిశ్రమను ఇష్ట పడతారు .
         శారీరక శ్రమ లేకుండా బుద్ది సూక్ష్మత ద్వారా సంపదను పెమ్పొంచించ వచ్చని వీరి దృడ విశ్వాసం . డబ్బు గడించడంలో సమర్ధులు . డబ్బు సంపాదించడానికి తగిన పదకాలు వీరి మనస్సులో పుడుతూ ఉంటాయి . పెద్ద పెద్ద పధకాలను .  రూపొందిస్తూ ఉంటారు .
     మనస్సులో మార్పు త్వరగా సంబవిస్తుంది , ప్రేమ వ్యవహారాలలో ఆసక్తి మిక్కటం . ఒకరిపై ప్రేమాభిమానాలు ఎక్కువ కాలం ఉండవు . నిన్న ఇష్ట పడిన వారిని ఈ రోజు ద్వేషిస్తారు . పువ్వు పూవుకు పరిబ్రమించే తుమ్మెద వంటి వారు .
      సమాజంలో మార్పు రావాలని ఎలుగెత్తి చాటుతారు . అత్యాడునిక వస్తువులను కొనుక్కుంటారు . ముందు రోజు వాడిన వస్తువు మరుసటి రోజు మరుసటి రోజుకు  పాతది అన్పిస్తుంది . కొత్తదనాని ఆహ్వానించే విప్లవ కారులు . ఎ గొడవలోను తగులు కోకుండా చేపలా జరుకుంటారు . ఇది వీరి ప్రత్యెక లక్షణం .
       5 అంకెకు చెందిన వారికి  గ్రహణ శక్తి ఉన్నందున చిరు ప్రాయంలో ఎవరితో స్నేహం చేస్తారో వారి అలవాట్లను గ్రహించి అలాగే ప్రవర్తిస్తారు . ఇతరులను ఆకర్షించ గలరు .
      చిన్న వయసులోనే మంచి అలవాట్లను నేర్చాలి . మంచి వారితో స్నేహం అలవారచాలి . దుష్ట సహవాసం చేసినట్టైతే పెరిగిన తరువాత దుర్మార్గుల గానే ప్రవర్తిస్తారు . తల్లి దండ్రుల సద్వర్తనులు అయినా , పిల్లలలో మార్పు ఉండదు .
       శ్రద్దగా పెంచడం ద్వారా సద్వార్తనులను చేయ వచ్చును వీరికి కామం ఎక్కువ . సామాజిక నిబందనలను అధిగమించి అక్రమ కామ కలాపాలకు పూనుకుంటారు . తొందరపాటు ప్రేమ వివాహం చేసుకొని ఆపదలో  చిక్కుకున్న వారున్నారు . వీరు వివాహ విషయాలలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి . లేనట్లయితే జీవితం కష్టాల మయం అవుతుంది . శత్రువులతో నిండిన కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది .
        వివాహ సందర్భంగా నిర్ణయం సుదీర్గ ఆలోచనకు పిదప తీసుకోవాలి . పురుషులు స్త్రీల గురించి , స్త్రీలు పురుషుల గురించి బాగా ఆలోచించాలి . ఈ అంకె వ్యక్తులకు చుసిన క్షణమే ప్రేమ పుడుతుంది . దీనిని అదుపులో ఉంచుకుంటే జీవితం చెక్కగా ఉంటుంది .
     వీరికి జీవిత బాగా స్వాములుగా పొందిన వారు వీరి స్వభావాలను చక్కగా గ్రహించి , వీరి మనస్సుకు తగినట్లు ప్రవర్తించి , చక్కని దుస్తులను దరించి , నిత్య నూతనంగా వ్యవహరిస్తే ఆకర్షించడం , అభిమానం పొందడం సులభం .
    పొగడ్తలను  ఇష్టపడతారు . ఇతరులు పొగడగానే తమ్ముతాము మరచి పోతారు . ఇతరులు వీరిని నమ్మదగని రీతిలో పొగడినా నిజమనుకుంటారు . ఇతరులకు సాయం చేసే గుణం ఉన్నవారు . వీరిని తగిన రీతిలో ఉపయోగించుకుంటే సులభంగా ఏపని నైనా నిర్వహించ వచ్చును .
         వీరి ప్రేమాభిమానాలు తరచుగా మార్పుకు లోనవుతారు . ధైర్యం ఉన్న వారు . ఓటమిని చూసి క్రుంగి పోరు . మనస్సులో కష్టం కలిగినా వెంటనే సర్దుకుంటారు . మనోవేగం మెరుపు వేగం తో సమానంగా ఉంటుంది . లోక జ్ఞానం అనుభవ జ్ఞానం కలిగినా వారు .
          వీరి ముఖంలో ప్రత్యెక ఆకర్షణ ఉంటుంది . అదృష్టం యొక్క ఆదరణ వీరికి ఎల్లప్పుడూ ఉంటుంది . స్తిరమైన ఆదర్సమంటూ  ఉండదు . అయినా అసాదారణమైన మనస్తైర్యం కలిగి ఉంటారు .  దనం ఏదో రూపం  లో  వస్తు ఉంటుంది . చేతిలో సంచిలో ఒక్క రూపాయ కూడా లేదనుకుంటున్న సమయం      లో ఏదో ఒక మార్గం లో డబ్బు సమకూరుతుంది . కళాత్మక హృదయం ఉన్నవారు . కనుక కావ్య నిర్మాణం చేయగలరు .
        తేది, నెల, సంవత్సరం  కలిపినా మొత్తం సంక్య 5 కలిగిన వారికి తేది అంకెకు అనుగుణంగా లభిస్తాయి .
        5,14,23 తేదిలలో జన్మించిన వారు  ఆరంబం యవ్వనం అంతా , పలుకుబడి , సంపద కలిగిన వారై ఉండి చివరి రోజులు మొత్తం సంక్య కు అనుగుణమైన ఫలితాలను పొందుతారు .
       వీరు  కళల  సంబందమైన వృత్తులలో రాణిస్తారు . ప్రజాదరణ కలిగిన వారైనందున రాజకీయాలలో ప్రవేశించి అనేక విప్లవాత్మకమైన మార్పులకు కారకులవుతారు . సినిమా రంగంలో నటన , దర్సకత్వం , శబ్ద గ్రహణ , కదారచన శాఖలలో ప్రసిద్ది పొందుతారు .
        పెట్టుబడి లేకుండా చేసే కమిషన్ , కాంట్రాక్ట్  వృత్తుల వలన లబ్ధి ఉంటుంది . నాగరిక వస్తువులను తయారు చేయడం , వస్తు మార్పిడి వర్తకం చేయడం ద్వారా డబ్బు గడిస్తారు . ఆదర్శ వంతంగా వ్రుత్తి నిర్వహించే దృక్పదం కల వారు .
కళలలో అభినివేశం , కావ్యం ,చిత్రలేఖనం ,  సంగీతం , గణితం , విజ్ఞాన శాస్త్రం , ఆద్యాత్మిక , జ్యోతిష్య రంగాలలో ఎక్కువ ఆసక్తి , పరిజ్ఞానం కలిగిన వారు . జీవితంలో ప్రగతి సాదించాలన్న పట్టుదల కల వారు . వైభవాలకు ఎక్కువ కర్చు పెడతారు . మాటల ద్వారా రచనల ద్వారా ఇతరులను ఐస్కాంతం లా ఆకర్షిస్తారు . హటాత్తుగా డబ్బు చేరుతుంది . తుచ్చ సుఖాలకు సుఖ జీవితానికి , అలవాటు పడతారు .
     కొన్ని సందర్బాలలో చెడు మార్గాలలో త్వరగా డబ్బు గడిస్తామని భావిస్తారు . కాని ఓటమి , దూర ద్రుష్టాలు వెన్నడుతాయి .
      ఉన్నత ఆదర్శాలతో చేపట్టిన సమస్త కార్యక్రమాలు విజయ వంటమవుతాయి .  నిజాయితీ మంచి అలవాట్లు ఉన్నట్లయితే సౌబాగ్య ప్రదమైన జీవితం లభిస్తుంది .
      వీరికి అసహనం, దుఃఖం అన్ని అనుభూతులు క్షనికమైనవి . వెంటనే సహజ స్తితికి చేరుకుంటారు . ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు . వీరి మనస్సుకు ఎక్కువ శ్రమ కలగడం వలన అసహనం కోపం కలుగుతుంది . చేపట్టిన అన్ని పనులు పూర్తి చేస్తారు .
      ఈ అంకెకు చెందిన వారు ఒక సంస్తలో ఉద్యోగం చేస్తూ ఉంటె వీరి అదృష్టం ఆసంస్తకు కూడా చెందుతుంది . ఈ అంకె వ్యక్తులను ఉపయోగించుకుంటే అభి వృద్ది ఉంటుంది . వీరున్న చోట జన సముదాయం ఉంటుంది . ప్రపంచంలోని సుఖాలను , ప్రేమ వ్యవహారాలను అనుభావిచడంలో ఎక్కువ సంతోషం పొందుతారు . తాము చేపట్టిన పనులను ముగించే అంట వరకు నిద్ర పోరు .
       మిక్కిలి సుక్ష్మ విషయాలను గ్రహించడానికి వీరి మనస్సు ఆసక్తి చూపుతుంది . ప్రతి దానిని తరచుగా మారుస్తుంటారు . తమ ప్రవర్తన , వస్త్ర ధారణ , అభిరుచులు , నివసించే ఇంటిలో కొత్త మార్పు , కార్యాలయాలలో మార్పు , చేస్తున్న వ్రుత్తి వ్యాపారం , స్నేహితులు , ప్రేమ వ్యవహారం ., వంటి అన్ని విషయాలలోనూ , కొత్త మార్పులను చేస్తుంటారు . అలా చేస్తేనే ప్రశాంతంగా ఉండ గలరు . శాస్త్రీయ కారణాలను , తార్కికంగా  విశ్లేషిస్తూ వాటిని మార్పు చేస్తూ ఉంటారు . ఆద్యాత్మిక ఉచ్చారణ , మంత్ర శక్తి వంటి అపూర్వ శక్తులు వీరి శరీరం అంతటా ప్రసరించి ఉంటుంది .
         వేగంగా ఆలోచించినా మంచి నిర్ణయం తీసుకుంటారు . అన్నిటి లోనూ పోరాటం లా ప్రారంబంయ్యే వీరి జీవితం క్రమంగా విజయ పదం వైపు సాగుతుంది . బందువుల కంటే మిత్రులు ఎక్కువగా ఉంటారు . ఇతరులను ఉపయోగించు కొని తమ పనులను చేసుకోవడంలో సమర్ధులు .
    ఇతరుల జోక్యాన్ని ఇష్ట పడక తమ పనులను స్వేచ్చగా నిర్వహించాలని భావిస్తారు . ఇతరులు వీరిని మర మనుషులుగా భావిస్తారు . ఖర్చు చేయడం ఎక్కువ . కలల పట్ల , తత్వ పరిశోధన పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది . రాజకీయాలలో కొత్తదనం , సమాజంలో పలు సంస్కరణలను చేపడతారు . ఉద్విగ్న మనస్కులు . శాశ్విత కీర్తి ఉంటుంది . తరంగాల వంటి ఆలోచనలు తుఫాన్ వంటి విజయాలు కలుగు తాయి.

6 వ సంక్యవారి పలితాలు :

telugu-number6

అంకె 6 – శుక్రుడు
                                                 సౌఖ్య ప్రదాత
    ప్రతి నెల 6,15,24 తేదిలలో జన్మించిన వారు తేది , నెల, సంవత్సరము కలిపిన 6 అయిన సుక్రదిక్యతలో జన్మించిన వారుగా పరిగణింప బడతారు .
 స్వభావాలు – లక్షణాలు
          ఆరు చలించని శక్తీ కలది . ఊ టలా వెలువడి , సెలయేరుగా పడి , నదిలా ప్రవహించి , సముద్రమై పరిణమిస్తుంది . ఈ అంకెకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి . షట్ శాస్త్రాలు , ఆరు ఋతువులు , షట్ ఖర్మలు , షట్ కోణాలు , – మొదలైన అనేక ఉదాహరణలున్నాయి .
        పుట్టిన తేది , నెల , సంవత్సరం కలిపినప్పుడు మొత్తం సంక్య 6 అయిన రోజులలో జన్మించిన వారికి కుడా జీవితం లోని రెండవ దాస ఈ అంకెకు అనుగుణంగా సాగుతుంది .
         వీరు సుఖ బోగాలు అనుభవిస్తారు . మంచివారు . ప్రజల మనస్సులను తమ వైపుకు ఆకర్షించ గలరు . సుఖమైన వ్రుత్తి ద్వారా డబ్బు గడిస్తారు . కళా ప్రియులు ఇతరుల మనస్సులోని మర్మాలను గ్రహించ గలరు . ఇతరులను సంతోష పరచి సంపదను పెంచుకుంటారు .
        కళల పట్ల ఆకర్సితులవుతారు . దైవ ప్రార్ధనలో విశిష్టత చూపగలరు . శుక్రుడు రాక్షస గురువు .
           తరగని సంపద తో తులతూగుతారు . ప్రజలను సంతోష పరచే వ్రుత్తి వలన పేరు గడిస్తారు . అందంపై , కళల మీద , వీరికి ఆసక్తి ఎక్కువ . ప్రపంచ బాగాలను అనుభవించడానికి జన్మనేట్టిన వారు .
         ఆకర్షినియ రూపం , అందమైన ముఖం కలిగి ఉంటారు . తీవ్ర కృషితో ఎపనినైనా నిర్వహించి  విజయం సాదించగలరు . కీర్తి గౌరవ సంపదలు ఎల్లప్పుడూ ఉంటాయి . అదృష్ట దేవత అనుగ్రహం నిరంతరం కోన సాగుతుంది .  కనిక వీరు అదృష్ట వంతులవుతారు .
           ధైర్య సాహసాలు కలిగిన వారు . కళ్ళలో ఆకర్షక కాంతి  ప్రసరిస్తూ ఉంటుంది. శుక్రుని సుఖానుభావం వీరి ప్రవర్తనలో ప్రతి విషయం లోను భాహిర్గతమవుతుంది . కధలు , కావ్యాలు , సంగీత సాహిత్య , చిత్రలేఖాన్ నాటకాదుల వంటి వాటిపై మనసు ఎల్లప్పుడూ లేనమై ఉంటుంది . అందమైన వస్తువులపై మమకారం కలిగి ఉంటారు .
        కళ్ళు , చెవులు , ముక్కు , నాలుక , చర్మం మొదలైన ఇంద్రియాలకు సుఖాన్నిచ్చే విషయాలపై మక్కువ ఎక్కువ . కామ బొగ అంశాలు వీరి మనస్సును ఆకర్షిస్తాయి . జీవితం అనుభవించటానికే నని వీరి అభిప్రాయం . ఈ ప్రపంచం స్వర్గమని పేర్కొంటారు .
        ఈ సంవత్సరములో ను విరక్తి అనిపించదు . మాయా శక్తులు వీరికుంటాయి . మంత్రాలు , అష్ట సిద్దుల కోసం , కార్యసిద్దికై ప్రార్ధన చేస్తారు . స్వకార్య సాఫల్యం కోసం దైవ పూజలు నిర్వహిస్తారు .  స్వలాభం కోసం స్వార్ధం తో ఆద్యాత్మిక రంగాన్ని ఆశ్రయిస్తారు .
         ఒక పనికి పూనుకునే ముందు అనేక పర్యాయాలు ఆలోచిస్తారు . చేపట్టిన ప్రయత్నం లో ఎల్లప్పుడూ వెనుకంజ వేయరు . ఓటమికి జంకని వారు . కార్యాచరణలో తీవ్రత కనిపిస్తుంది . ప్రపంచ జీవిత అనుభవాలను ఆశిస్తారు .
        వీరి సంక్యాదిక్యత రాక్షస గురువైన శుక్రునికి సంబంచిన దయినందున కొన్ని సందర్బాలలో రాక్షస స్వబావాన్ని ప్రదర్శిస్తారు . సమాజంలో కీర్తి లభిస్తుంది . పదవులు  నిర్వహిస్తారు . ఎల్లప్పుడూ నవ్వు ముఖం తో కన్పిస్తారు . కొన్ని సందర్భాలలో తమకు సాయపడిన వారిని విస్మరిస్తారు . కృతజ్ఞులుగా ప్రవర్తిస్తారు .
       కీర్తి కోసం, ఆత్మ గౌరవం కోసం , డబ్బు కర్చు పెడతారు . ఆత్మా స్తుతి ఉంటుంది . కీర్తి కోసం ఎపనినైనా చేస్తారు . కళలు . నాటకం , సినిమా వంటి వాటిలో సంతోషం పొందుతారు . ఆరంగాలలో రాణిస్తారు . పాటలు , కవితలు రాయడం , కదా రచన , వ్యాస రచన , నాట్యం , గానం , నటన , దర్శకత్వం మొదలైన అంశాలలో రాణిస్తారు .
        చారిత్ర ప్రసిద్ద గాంచిన స్తలాలు , నాగరిక చిహ్నాల దర్సనం , ప్రక్రుతి దృశ్యాలు , వినోద యాత్ర వంటి వాటికై చురుకుగా ప్రయాణాలు చేస్తుంటారు . ఇల్లు , వాహనం , పనిచేస్తున్న చోటు వంటి వాటిని కళాత్మకంగా ఉంచుకుంటారు . పువ్వులు, చెట్లు , నదులు , సెలయేర్లు , పక్షులు మొదలైన వాటిపై మక్కువ ఉంటుంది . ప్రకృతిని చూసి పరవసిస్తారు
   వీరి చుట్టూ ఎల్లప్పుడూ మనుష్యులు ఉంటారు . కళ్ళతో చూసే ఆకర్షణ వస్తువులను ఎక్కువగా ఇష్టపడతారు . బంగారు బంగారు ఆభరణాల పై , నవరత్నాలపై , వ్యామోహం ఎక్కువగా ఉంటుంది . తమకు నచ్చిన వారిపై మమతానురాగాలను ప్రదర్శిస్తారు . కొత్త వ్యక్తుల విషయం లో జాగ్రత్త వహిస్తారు . వీరి మాటలలో , చేతలలో , నటన ఉంటుంది , జీవితంలో కళకు సంబంచిన ఏదో ఒక వృత్తిని శాశ్వతంగా చేసుకొని ప్రగతి సాదిస్తారు .
        6 వ అంకెలో జన్మించిన వారు , ప్రక్యాతి గాంచిన కళాకారులుగా  రూ పొందుతారు .  వీరి మాటలకు , రూపానికి ప్రజలు వశీ క్రుతులవుతారు . ప్రజల ఆదరాభిమానాలు వీరికి ఎల్లప్పుడూ ఉంటాయి . ఆకర్షనీయ రూపం వలన చాల సులభంగా ఎవరితోనైనా కలసి పోయి స్నేహం పాటిస్తారు . కళాత్మక దృక్పదం ఉన్న పలువురు వీరికి ఎల్లప్పుడూ సాయం చేస్తూ ఉంటారు .
          శుక్రుడు భలమైన కామ కారకుడైనందున వీరికి ఇతర అంకెలకు చెందిన వ్యక్తుల కంటే పుత్రా భాగ్యం ఎక్కువగా ఉంటుంది . శుక్రుడు సెక్స్ సుఖాన్ని ఇవ్వడం , వీర్యాభివ్రుద్ది కి తోడ్పడడం వలన ఎల్లప్పుడూ ఆరోగ్యం గురించి వాపోతూ ఉంటారు . రోగం లేక పోయినా శరీర  పోషణ  కై , ఆరోగ్య రక్షణ కోసం మందులను వాడుతుంటారు .
        చూడం కంటే , చదివి గ్రహించడం కంటే, విని ఆనందించడం కంటే సర్వ సుఖాలను అనుభవించడంలో తృప్తి పొందుతారు . ఎక్కువ జీర్ణ శక్తి ఉంటుంది .
        ప్రేమ గల వారిలో పలువురి వద్ద మెలగినా , కొన్ని సందర్బాలలో క్రుతజ్ఞ్హులుగా ప్రవర్తిస్తారు. ఎల్లప్పుడూ ఆహారం , వస్త్రాలు , నిద్రాసుఖం మొదలైన వాటిలో లోపం ఉండదు . ఏదో ఒక విదంగా సాయం అందుతూ ఉంటుంది . వీరికి ప్రత్యెక ఆకర్షణ శక్తి ఉంటుంది . ఆద్యాత్మిక రంగములొను  రాణిస్తారు .
        జ్యోతిషం , వశీకరణ , వైద్యం వంటి వాటిలో ఉన్నత స్తాయిని అందుకుంటారు . మనస్సులో కల్పనాశక్తి వృద్ది చెందుతుంది .  కొత్త అభిప్రాయాలు రూపొందుతాయి . వాసన ద్రవ్యాలపై , రంగు రంగుల పుస్పాలపై ఆసక్తి ఉంటుంది . శారీరక శ్రమ ద్వారా కాక , బుద్ధిబలం తో వాక్చాతుర్యం తో సంపాదించ గలరు .
        వీరు శరీర పటుత్వం కలిగి ఉంటారు . ప్రాణ శక్తీ మిక్కటంగా ఉంటుంది . అన్నిటిలోనూ నెమ్మదిగా ప్రవర్తిస్తారు . కీర్తి గడిస్తారు . ప్రేమ , జ్ఞానం , ప్రతిభ కలిగిన వారు . శాంతిని ఆశించే వారు . ఇల్లు,  దేశం , ప్రపంచమంతా శాంతి యుతంగా ఉండాలని ప్రార్దిస్తారు . కృషి సలుపుతారు . ఇతరుల దుఃఖ ఉపశమనానికి తీవ్ర ప్రయత్నం చేస్తారు . శుక్ర ఆదిక్యత  బలంగా ఉంటె మహాత్మునిగా త్యాగ నిరతి కలిగి ఉంటారు . ఇతరుల మానాభిమానాలను కాపాడే ఆదర్శం కల వారు .
         శుక్ర దృష్టి ఉచ్చంగా కల వారు వైభవ జీవితాన్ని అనుభవించాలన్న ఆసక్తి కల వారు . సుఖాలను అనుభవిస్తారు . సంతోషంగా జీవిస్తారు . కీర్తిపై మమకారం కలిగి కర్చు పెడతారు . ధన సంపాధనకై నిరంతరం శ్రమిస్తారు . లక్ష్మి దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ పొంద గలుగుతారు . ఎలోపము లేక సుఖంగా జీవిస్తారు . తినడం , తిరగడం , నిద్రించడం అంటూ కలం గడుపుతారు .
          వీరు కళా రంగం లో  ఎక్కువగా రాణించ గలరు . రాజకియంలోను ప్రసిద్ది గడిస్తారు . క్రీడా రంగములో అభినందనలను పొందుతారు . ప్రక్యాత నటి నటులు ఈ అంకెకు చెందిన వారు . తమ మాటలను నేర వేర్చటానికి పని  వారిని  నియమించుకుంటారు . ప్రజల పలుకుబడితో మిక్కిలి ప్రక్యాత స్తితికి వస్తారు . చేతలు కళాత్మకంగా ఉంటాయి . మంచి వాక్చాతుర్యం , రచనా సామర్ద్యం కలిగిన వారు . వీరి జీవితం ప్రేమ మయమైనది . కామ విషయంలో అంతులేని సుఖాలను పొందుతారు . భార్యా భర్తల మద్య సెక్స్ సుఖం ప్రాదాన్యత సంతరించుకుంటుంది .
        వీరు అసాధ్యమైన కార్యాలను చేస్తారు . చరిత్రలో చరగని స్తానం పొందుతారు . వీరి జీవితంలో పలువురు ఆశ్చర్య పడే విదంగా అద్భుత సంగటనలు అరుగుతాయి . శరీరంలో ఆద్యాత్మిక శక్తి బయల్పడుతుంది . వాక్కులో ప్రశాంతత ఉంటుంది . జ్యోతిష్య , వైద్య , మంత్రం సంబందమైన అంశాలలో అభినివేశం పొందుతారు .
        స్త్రిలవలన పురుషులకు , పురుషుల వలన స్త్రీలకు కొన్ని అనుకూలాలు ఉంటాయి . ఈ అంకె ఆదిక్యతలో పుట్టిన వారు కళాశాల ఉపన్యాసకులు , మత ప్రవక్తలు , కవులు , నటి నటులు , రాజకీయ వేత్తలు , వక్తలు , గ్రంధ ప్రచురణ కర్తలు , పత్రిక సంపాదకులు , దూతలు , శాస్త్ర వేత్తలు , క్రీడాకారులు , వర్తకులు మొదలైన పలువురున్నారు .
   మంచి ఉద్యోగస్తులు ఉన్నారు . ఆకర్షనీయ వ్రుత్తి చేయడంలో సమర్ధత వీరికి పుట్టుకతో అబ్బిన విద్య . వస్త్ర ఆభరణాలను తయారు చేయడం , అందాల  కళా వస్తువులను తయారు చేయడం , రియల్ ఎస్టేట్ , బ్యుటి పార్లర్ , ఆభరణ నవరత్న వ్యాపారులు , మందులను విక్రయించడం వంటి  వృత్తులు వీరికి అనుకూలిస్తాయి .
      మోడల్ స్త్రీలు ఉన్నారు . సాహిత్య సంగీత సంబదిత వస్తువులను విక్రయించడం , సినిమా నిర్మాణం సువాసన ద్రవ్యాలను తయారి , తియ్యటి పానియాల తయారి ,బక్తి సంబందిత వస్తువులను విక్రయించడం , లాటరి , రేసు ,వ్యవహారాలు వీరికి అనుకూలిస్తాయి .
     స్త్రీలు వీరిని ప్రేమించడం కంటే , వారిపట్ల ఆకర్షితులు కావడమే ఎక్కువగా కన్పిస్తుంది . పురుషులు అందమైన స్త్రీలను , స్త్రీలు అందమైన పురుషులను వివాహం చేసుకుంటారు . అందమైన ఇల్లు , అందమైన వాహనం , ఉద్యాన వనం , వస్త్రాలు అంటూ అందానికి ప్రాదాన్యతను ఇస్తారు .
       వీరిని వంచించడం అసాద్యం . శత్రువులకు యమునిగా కన్పిస్తారు . ప్రతిజ్ఞ చేసి కార్యాలను నెరవేరుస్తారు . వీరికి శాశ్వతమైన శత్రువులు ఉండరు . రోజులు గడుస్తున్నకొద్దీ వీరి ఆకర్షనీయ గుణం వలన శత్రువు కూడా మిత్రులవుతారు .
         వీరికి భూమి , కాంతా కనకాలపై కోరిక ఎక్కువ . సుఖాలను అనుభవించడం వీరి ప్రధాన ఆశయం . జ్ఞాపక శక్తి , సుక్ష్మ బుద్ది కలవారు .కొన్ని సందర్బాలలో సందేహ బుద్ది  , కోతిలా చాంచల్యం దుఃఖ లక్షణం కలిగి ఉంటారు .
         అంతరిక్ష పరిసోధకలు , మానవాతీత శక్తులను గ్రహించాలని ఆసక్తి    ఉంటుంది . వీరు ఇతరుల కరుణ , సహాయాల వలన జీవితంలో ప్రగతి సాదిస్తారు . స్నేహం దాంపత్య జీవితం గొప్పగా ఉంటుంది . ఆడంబర , అలంకార ప్రియులు . దేనిని గురించి ఆందోళన చెందిన తమ చేతల  ద్వారా ఆకర్షణ ద్వారా కార్య  సాదకులవుతారు . ఆడంబరంగా ఖర్చు పెట్టె లక్షణం ఉన్న వీరికి డబ్బు అనుకూలంగా సమకూరుతుంది . మనసు కష్ట పడకుండా సంతోషంగా జీవించడమే వీరి ఆదర్శం . సంసార జీవితంలో ఏర్పడే సమస్యలను తమ ఆకర్షణ శక్తితో పరిస్కరించుకుంటారు .
     6 వ అంకెకు చెందిన పురుషులు సంపన్నమైన , గౌరవం కల స్త్రీని భార్యగా పొంద గలరు . భార్య అదృష్టం వలన సర్వ సౌబాగ్యాలు పొంది ధనవంతులుగా జీవిస్తారు .
       6 వ అంకెకు చెందిన స్త్రీలు సంపన్నులు . సంస్కార వంతులైన భర్తలను పొంది , తద్వారా కీర్తి గాంచి సుఖంగా జీవిస్తారు .
        ఈ అంకెకు చెందిన స్త్రీలు  సౌభాగ్య వంతులు భోగ భాగ్యాలను అనుభవిస్తారు . కనుక వీరికి వివాహం జరుపుతున్నప్పుడు కొంత గౌరవ సంపదలున్న వ్యక్తిని నిర్ణయించడం శ్రేయస్కరం .
       తమ అర్హతకు తక్కువైన మగాడితో వివాహం జరిపిస్తే తప్పుడు మార్గంలో ప్రవేశించి సంపదను ఆర్జించడానికి ఆశిస్తారు . వీరికి కామ దోషం ఉంటుంది . కామ క్రోద పసువులవుతారు .
       ఈ అంకెలో జన్మించిన స్త్రీ పురుషులు ఇరువురు తమకంటే ఉన్నత స్తితిలో ఉన్న వారిని వివాహం చేసుకుంటారు . గుణ సంక్య , శరీర సంక్య అనుకూలంగా ఉన్న వారికి అందం , తెలివి , గౌరవం గర్భ  కాలం లోనే సంప్రాప్తం అవుతాయి . వీరిని చూసి ఇతరులు దిగ్బ్రమకు లోనవుతారు .
        అందమైన వస్తువులను కొనుక్కుంటారు . తమ రూపు రేఖలను మేరగు పరచుకోవడానికి ప్రయత్నిస్తారు . సంగీత సాహిత్యాలలో పరిచయం ఎక్కువగా ఉంటుంది . వీటిలో ఎక్కువ పాండిత్యం గడించి ఉంటారు . అన్ని విషయాలలోనూ ఆడంబరాన్ని ప్రదర్శిస్తారు . వినోదాలు,బోగాల ప్రతి నిధి అయిన శుక్రుని ఆదిక్యంలో జన్మించిన వీరికి లైంగిక అనుబూతులు ఎక్కువగా ఉంటాయి . పోరాడి విజయం పొందడం కంటే బుద్ది సూక్ష్మతకు సంబందించిన విజయం వీరికి ఇష్టం .
       వీరు ప్రవేసించే ప్రతి సఖలోను విలక్షణత ప్రదర్శిస్తారు . ధైర్య గుణం కల వారు . వీరి మనస్సు కళల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది . వీరు ఒక నిర్ణయానికి వస్తే దానిని మార్చడం ఎవరికీ సాద్యం కాదు . పట్టుదల తోడుగా విజయం సాదిస్తారు . వీరికి పుట్టుకతో అలవడిన కోపం వస్తే ఎవరితోనైనా గొడవ పడగలరు .
      ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు . మంత్రం తంత్ర శక్తులలో ప్రవేశం ఉంటుంది . విజయ సాధనకై మూల మంత్రాలను ఉచ్చరిస్తారు . పురుషులు స్త్రీలు ఋ వర్గాలలోను మిత్రులుంటారు . ప్రజాసమూహాన్ని ఆకర్షించి దేశాన్ని పాలించే శక్తీ వీరికి ఉంటుంది . రాజ్యతంత్రజ్ఞులు .
        ప్రవేటు కంపెనీలలో ఉద్యోగం , ప్రభుత్వ ఉద్యోగం , సొంత వ్యాపారం , ఏదైనా కళాత్మక వ్రుత్తి వీరికి లబ్యమవుతుంది . వీరు అనుకూలమైన సంక్యా బలం ఉన్న జీవిత భాగ  స్వామిని ఎన్నుకుంటే మిక్కిలి అభివృద్ధి పొందుతారు . వీరి రూపం అందంగా ఉంటుంది . వయస్సు మీరిన పిదప కుడా అందంలో మార్పు లేకుండా కన్పిస్తారు . తరచుగా ప్రయాణాలు , విదేశా ప్రయాణాలు ఉంటాయి .
      గణితంలో ప్రతిభ , సాహిత్య పరిచయం కలిగి ఉంటారు . సంబాషణల ద్వారా ఏపని నైనా నిర్వహించ గలరు . వీరు సృసించిన ప్రతి అంశము రాణిస్తుంది . పూర్వికుల ఆస్తులు తోడ్పడతాయి . ఈప్రపంచ వినోదాల నిలయంగా భావిస్తారు .
      సినిమా రంగములో సాటి లేని విజయాలు పొందగలరు . వీరి సినిమా నిర్మాణాలకు ప్రజల మద్య మంచి ఆదరణ ఉంటుంది . సంపన్న జీవితం అనుభవిస్తారు .
      వ్రుత్తి ప్రగతి సాదిస్తారు . ఆలోచనా తత్పరులుగా ప్రసిద్ది గాంచుతారు .  శరీర అవయవాలు కాళ్ళ తోబాటు కదలిక పొంద గలవు .ప్రఖ్యాథి  గాంచిన రంగములో ప్రాముక్యత పొందుతారు . మానసిక శక్తుల ద్వారా ముందుగానే జరగా బోతున్న సంఘటనలను గ్రహిస్తారు . వాహన ప్రయాణ ప్రియులు . చురుకుగా మనస్సు మెచ్చే ప్రాంతాలను దర్శించి సంతసిస్తారు . ఆద్యాత్మికంగా ప్రత్యేకత కనపరుస్తారు .
      55 ఏళ్లకు తరువాత కొందరు యోగులుగా , జ్ఞానులుగా జీవితం గడుపుతారు . తెలివి తేటలు ఎక్కువగా ఉంటుంది . ఎందులోనూ చురుగ్గా వ్యవహరిస్తారు . పండ్లను ఇష్టపడి స్వీకరిస్తారు . యవ్వనం తగ్గని ముఖంతో కన్పిస్తారు . పెద్దల సాయం , సంపన్నుల  స్నేహం లభిస్తుంది . గొప్పగా జీవిస్తారు .
7 వ సంక్యవారి పలితాలు :
telugu-number7
అంకె 7 – కేతువు
త్రికాలజ్ఞుడు
      7,16,25 తేదిలలో జన్మించిన వారు తేది , నెల, సంవత్సరము కలుపగా7 అయిన కేతు ఆదిక్యతలో జన్మించిబ వారు .
లక్షణాలు – స్వభావాలు
         మానవ జీవితంలో ఏడుకు సంబంచిన అంశాలు  అసంక్యాకంగా ఉన్నాయి . జ్ఞాన చిహ్నమైన కేతువు అన్ని చిట్ల , అన్నిటా శాశ్వతంగా ఉన్నవాడు . వారానికి ఏడు రోజులు , సప్తర్షులు , సప్త మహా సముద్రాలు , సప్త కన్యలు  , సప్త స్వరాలూ , సప్త నాడులు , సప్త లోహాలని ఎన్నో అంశాలు ఎదుకు సంబందించినవి గా ఉన్నాయి .
        వీరి జీవితం ఆద్యాత్మికమై ఉంటుంది . పురాణ శాస్త్రాలపై అమిత విశ్వాసం , పరిశీలనా భావం ఉంటుంది . చక్షు గోచారం కాని శక్తులను పరిసోదిస్తారు .  మంత్రం, యోగ వ్యవహారాలను గ్రహిస్తారు . ధర్మగుణం , ఆత్మ పరిజ్ఞానం ఉన్నవారు . తీవ్ర కృషితో కార్య సాదకులవుతారు .
        మానవాతీత శక్తులను గ్రహిస్తారు . బుడ్డి బలం ఉన్నవారు . ప్రేమ , జ్ఞానం , ధర్మం  , దాన గుణాలు కల వారు . పెద్ద మనుష్యులుగా , సంస్కార వంతులుగా ఉంటారు . ముఖ  వర్చస్సు , సంత ద్రుక్పదము , దివ్యత్వం ఉన్నవారు .
     చేపట్టిన కార్యాన్ని ముగిస్తారు . ముందుకు అడుగిడిన తరువాత వెనుదిరిగే ప్రసక్తి ఉండదు . ఆదర్శ తీవ్రత ఉంటుంది . ముఖంలో స్పష్టత , వశీకరణ  శక్తీ  ఉంటుంది . పొడవైన ఆకారం , ఎల్లప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు . మాటలో సౌమ్యత ఉట్టిపడుతుంది . ఆత్మా విశ్వాసం, ధైర్య గుణాలు ఉంటాయి . మానసికోల్లసం ఉంటా గొప్ప వ్యక్తులవుతారు . ఉత్సాహం లేకపోతె మౌనంగా ఉంటారు .
        ఇతర అంకెలకు చెందిన వ్యక్తులకంటే వీరు బిన్నంగా కనిపిస్తారు . న్యాయం కోసం పోరాడుతారు . తమకంటూ లక్ష్యాన్ని ఏర్పరచుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు . మంచి మిత్రులు తక్కువగా ఉంటారు . నిజాయితీగా ఉండాలనుకునే వీరికి ఇతరులకు అభిప్రాయ భేదం ఉంటుంది .
       ఈ అంకెకు చెందినా వ్యక్తులకు శారీరక  భలము కంటే  మనోభాలం ఎక్కువ .లక్ష్య శుద్దితో ఎకార్యం లోనైనా విజయం సాదిస్తారు . కొన్ని సందర్బాలలో ఎక్కువ ఆందోళనకు గురి అవుతారు . వీరి ఆలోచనలు , పదకాలు భవిష్యత్తుకు గురించినవిగా ఉంటాయి . ప్రజల ఆదరణ ఉన్నట్లయితే సాహసం తో ప్రవర్తించి సంపూర్ణ విజయం పొంద గలరు .
           స్వతంత్ర బుడ్డి కల వారు . ఎవ్రుత్తిని చేపట్టినా ఇతరుల జోక్యం ఇష్ట పడక స్వయంగా కృషి సలుపుతారు . మనస్సులో కొత్త అభిప్రాయలు పుడుతూ  ఉంటాయి . ఇతరులను అనుసరించారు. వీరి మార్గాన్ని ఇతరులు అనుసరిస్తారు . ప్రజలకు మార్గ దర్శకులుగా ఉంటారు . ప్రతి విషయంలోనూ స్వేచ్చను కోరుకుంటారు . బుద్ధిబలం ఉన్నవారు . కల్పనా శక్తీ వృద్ది చెందుతుంది .
       వీరి మాటలలో , చేష్టలలో ప్రత్యేకత గోచరిస్తుంది . ప్రజల దుఃఖం పోగొట్టే వారుగా ఉంటారు .
       కొన్ని సందర్బాలలో మితి మీరిన కోపం తెచ్చుకుంటారు . కాని వెంటనే సర్దుకుంటారు . సమాజ హిత కార్యక్రమాలలో పాల్గిని కీర్తి గడిస్తారు . కళలకు సంబందించిన వస్తువులు వీరికి ఇష్టం కలిగిస్తుంది . చేస్తున్న పనులలో కొత్త ధనాన్ని ప్రవేశ పెడతారు . ఆనంద మయ పరిస్తితుల మద్య అనుకూల పలితాలను పొందగలరు .
      ఒంటరి తనాన్ని ఇష్ట పడతారు . ద్యాన , యోగ , మంత్ర శాస్త్రాలలో అభినివేశం ఉంటుంది . ఒంటరిగా ఉన్నప్పుడు కల్పనా శక్తి వృద్ది చెందుతుంది . మాట్లాడడం కంటే ద్యాన స్తితిని  ఇష్ట పడతారు . తమ సంతోషం గురించి , జయాపజయాల గురించి ఎవరితోనూ చెప్పరు . మనసులోనే దాచుకుంటారు .
            ఇంద్రియాలను అదుపులో ఉంచగలరు . చిరు ప్రాయం నుంచి కళలలో ఆరితేరి ఉంటారు . 7 వ అంకె ఆదిక్యతలో 1 వ తెగ వారు కళల పట్ల ఆసక్తి పుట్టినప్పుడే పుణికి పుచ్చుకుని కళలను  లక్ష్యంగా చేసుకొని విజయం సాదిస్తారు . వీరి వద్ద తీవ్రమైన కళా శక్తి , ఆద్యాత్మిక భలం  ఉంటుంది .  మిత్రులనేకులను పొంది క్షేమంగా జీవిస్తారు .
        7 వ అంకె ఆదిక్యతలోని 2 వ తెగ వారు కంప్యుటర్ , గణిత శాస్త్రము , రసాయన శాస్త్రాలలో ప్రవేశం ఉన్నవారు . వీరికి కళలంటే ద్వేషం ఉంటుంది . దేశ భక్తులు .
         సామాన్యంగా 7 వ అంకె వ్యక్తులు రచన , చిత్ర లేఖన , సంగీత , నాట్య , నటన, దర్సకత్వ రంగాలలో ప్రసిద్ది గడించ గలరు . రచనా , సామర్ధ్యం , వాక్చాతుర్యం కల వారు . ఆ కారణంగా డబ్బు గడించ గలరు . సినిమా రంగములో ప్రక్యాతి పొంద గలరు .
        చిరు ప్రాయం నుంచి తల్లి తండ్రుల మీద , దేశం మీద భక్తి కలిగి ఉంటారు . రాజకీయంలో విప్లవం సృస్టిస్తారు . దేశ క్షేమం  ఆశించి ఎత్యగానికైనా సిద్దపడతారు . రాజకీయ సూక్ష్మత , రాజకీయ లక్షణాలు ఉంటాయి . పెద్ద పార్థి  లో చేరక , దేశ అభివృద్దిని కాంక్షించి చిన్న పార్థిలొ చేరి తమ కృషి వలన తమ పార్టిని బలపరచ గలరు .
       ఎ విషయాన్నైనా వ్యతిరేకించి వాదించే సామర్ద్యం ఉన్నవారు . వ్యతి రేకత వీరికి  ఆసక్తి కలుగుతుంది . ఎందులోనైనా న్యాయమైన విజయం పొందాలనుకుంటారు . అతిది సత్కారంలో ప్రత్యేకత కనపరుస్తారు . వీరి మెదడు మెరుపు వేగం తో పదకాలు రూపొంచంచ గలరు . అనేక కోణాలలో ఆలోచించన పిదప మంచి నిర్ణయానికి వస్తారు .
        మిత్రుల వద్ద , బందువుల వద్ద విశ్వాసంతో ప్రవర్తిస్తారు . సాయం అడిగిన వారికి తమకు సాద్యమైనంతలో సాయపడగలరు . ఆదరణలో ప్రత్యేకత కన్పిస్తుంది . కష్టాలున్నప్పుడు తీవ్ర వాద దోరణిలో ఉంటుంది . వీరి విజయాలను చూసి ఇతరులు అసూయా పడతారు .
         రాజకీయ, సినిమా రంగాలలో మిక్కిలి రాణిస్తారు . క్రీడల కంటే రాజకీయ , సినిమా రంగాలలో నే  వినుతికేక్కుతారు .
       వీరిలో ప్రత్యెక ఆకర్షణ శక్తీ ఉన్నది . ఇందువలన భవిష్యత్తును చూడ గలరు . వీరి జీవితం ఇతరులకు ఉదాహరణ గా ఉంటుంది . వీరి చర్యలు అందరిని ఆకట్టుకుంటాయి .
      లాటరి , రేసుల ద్వారా సంపాదించాలని కోరిక ఉండదు . హటాత్తుగా వచ్చే సంపదపై మోజు లేని వారు . జన్మతః అపూర్వ శక్తులు కలిగిన వీరు కృషి ద్వారా విజయం సాదిస్తారు . బుద్ది సుక్ష్మత భోదనా సామర్ద్యం ఉంటుంది .
      కృషితో ఉన్నత మైన వారు . మేధావులు , జ్ఞానులు , తాజకియ నిపుణులు , వైద్యులు , రాజకీయ వేత్తలు , సినిమా నటులుగా రాణించిన వారందరూ పైకోవకు చెందినవారే .
        ఇతరులకు అనుగుణమైన ప్రవర్తన , ధారాళమైన మనస్సు కల వారు . పసి ప్రాయం నుండి సంగీత , సాహిత్య , నటనా రంగాలలో ప్రతిభ కనపరుస్తారు . పలువురిచే అభినందనలు , బిరుదులూ పొంద గలరు .
           ఆద్యాత్మిక నియమాలు ఎరిగిన వారు . అన్ని మతాలను గౌరవిస్తారు . వర్గ భేదాలు లేని వారు .. జ్ఞాన మార్గాసక్తులు .  వీరి కలలు ఫలిస్తాయి . ఆకర్షణ లక్షణం పుట్టుకతో వచ్చిన గుణం . వాకచాతుర్యం కల వారు . తరచుగా దివ్యానుభూతులతో నిండిన అపురూప దృశ్యాలు కలలో కనిపిస్తాయి . వాక్కు ఫలిస్తుంది .
          పేదల పై దయ కల వారు . మంత్రం సిద్ది , ఆకర్షణ సిద్దిస్తుంది . కుటుంబ జీవితం గడుపుతూనే జ్ఞానం గడించ గలరు . జీవితం అనుభవించడానికే అన్న సిద్దాంతం ఉంటుంది . మనస్సు ఎల్లప్పుడూ నిలకడ  లేకుండా చలిస్తూ ఉంటుంది . కొన్ని సందర్భాలలో చిన్న విషయాలకు సైతం దీర్గంగా ఆలోచిస్తుంటారు .
          మనస్సుకు నచ్చ్కాని పనులు చేయరు . ఎంత లాభ సాటి వ్యవహారమైనా మనస్సు మేచ్చితేనే పూనుకుంటారు . సర్వ శక్తులు ఆదర్శం వైపు కు మళ్ళించి ఉన్నత స్తాయిని అందుకుంటారు .
          సందర్బం , పరిస్తితులు , చక్కగా అనుకూలిస్తే అసాధ్యమైన పనులను ఆచరించి మహాత్ముడనీ కీర్తి గడిస్తారు . ఎల్లప్పుడూ చురుగ్గా ఏదో ఒక పనిని  చేస్తుంటారు . ఎంతటి పనినైనా సునాయాసంగా ముగించ గలరు .
 సమాజంలో అందరూ వీరిని అభినందిస్తారు . ప్రజల మద్య ప్రత్యెక గౌరవం ఉంటుంది . అనేక వృత్తుల ద్వారా సంపద చేరుతుంది . వయస్సు పెరుగుతున్న కొద్ది  వీరి జీవన స్తాయి పెరుగుతూ ఉంటుంది . ఎ పనిని చేపట్టినా తమ ప్రత్యక్షం లోనే జరగాలని భావిస్తారు .  వీరి విజయ రహస్యం ఇదే .
        శ్రమించడం ద్వారా ప్రగతి సాధ్యమని సంపూర్ణంగా విశ్వసిస్తారు . ఇతరుల మనస్తితిని గ్రహించి ప్రవర్తిస్తారు . వీరి మాటలలో , చేష్టలలో తాత్విక దృక్పదం బహిర్గతమౌతుంది . సంఘ సేవకై ఆసక్తి ఉంటుంది . ఇందుకై పెద్ద మొత్తంలో విరాళం ఇస్తారు .
        నదులు , సముద్రాలు , ప్రక్రుతి రమణీయ దృశ్యాలను చూసి వీరి మనసు పరవసిస్తుంది . ప్రయాణాలు , వాహనాలు నడపడం మొదలైనవి ఇష్ట పాడుతారు . ఈ అంకె వ్యక్తులు పలువురు విదేశాలకు వెళ్లి డబ్బు గడిస్తారు .
         సమస్యలను ఎదుర్కొని నూతనత్వాన్ని దర్శించగలరు . ఎదురీదడంలో సమర్ధులు . ఒకేరకమైన పని చేయడం వీరికి నచ్చదు . తరచుగా అందులో నూతనామ్సాలను  చొప్పిస్తారు . సూక్ష్మ బుడ్డి భవిష్యత్తును ముందుగా గ్రహించే దివ్య శక్తీ వీరికి జన్మతః అలవడుతుంది .
       చేపట్టిన కార్యాన్ని చెక్కగా నిర్వహిస్తారు. తమ్ము ఆశ్రయించిన వారిని తప్పక కాపాడుతారు . వీరికి మంచి కల్పనా శక్తి ఉంటుంది . మనస్సులో పవిత్రాలోచనలు ఉద్భవిస్తాయి . కష్ట సుఖాలలో ఒకే తీరుగా ప్రవర్తిస్తారు . కీర్తి , సంపద , అధికారాలు ఎంత వున్నా సామాన్యునిగా నిరాడంబరంగా వ్యవహరిస్తారు .
         జీవిత ప్రారంబములో ఆర్ధిక విషయమైన ఎత్తుపల్లాలున్నా యవ్వన ప్రాయం నుంచి సంపద చేరుతుంది . అవసరాలకు తగిన డబ్బు వస్తూ ఉంటుంది .తమ వృత్తిలోను , జీవితం లోను ఇతరులు జొరబడడం ఎన్నడు ఇష్టపడరు . స్వేచ్చగా ఉండాలని ఆశిస్తారు .
         ఇతరులు నమస్కరించదగిన వారుగా ఈ అంకెకు చెందినా కొందరు ఉంటారు . పుట్టుకతోనే దివ్య లక్షణాలు కలిగి ఉంటారు . వీరికి సంసార జీవితం మిశ్రమంగా ఉంటుంది .పెరు అనుకూలంగా ఉంటె కుటుంబ జీవితం కూడా సంతోషంగా సాగుతుంది . అదృష్ట నామం లేకపోతె వీరి జీవితం దుక్క మయంగా మారుతుంది .
          ఆద్యాత్మిక జీవితం పూర్ణ ఫలవంతమౌతుంది. ఈ అంకెకు చెందిన స్త్రీ పురుషులు ఇరువురు మంచి కృషి సలిపే వారు . ఎసమయంలోనూ పనులు చేస్తూ ఉంటారు . అనుకూల పరిస్తితులలో ఎంతటి   పనినైనా ముగించ గలరు .
         ప్రఖ్యాత రచయితలు , చిత్రకారులు , ముద్రాపకులు , సంగీత విద్వాంసులు , భావన నిర్మాణ కుశ లురు , సినిమా దర్శకులు , ఛాయాగ్రహకులు , రికార్డింగ్ నిపుణులు , నటినటులు 7 వ అంకెకు జన్మించిన వారే . సినిమా , రాజకీయ , ఆద్యాత్మిక రంగాలలో రాణిస్తారు . కళాత్మకంగా వృత్తిని నిర్వహించి విజయం సాదిస్తారు .
          చట్ట నిపుణులు , ఆర్ధిక శాఖ , న్యాయ శాఖలలో ఉన్నవారు , ద్రవపదార్దాల వ్యాపారం , మందుల తయారి , ఎగుమతి , దిగుమతి వ్యాపారం , ఓడ ప్రయాణం ద్వారా వర్తకం , పెట్రోల్, గ్యాసు  వంటి ఇందనాల వ్యాపారం , ఫైనాన్స్ , రసాయనాల వంటి విషయాలలో ఔన్నత్యం పొంద గలరు .
       వీరి ఇష్టానుసారం విడిచి పెడితే అభినందించ దాగిన పనులు చేస్తారు . జీవితం లో ఏర్పడే సుఖ దుఖాలను సహజంగా స్వీకరించే దృడ చిత్తం కలవారు . దైవానుగ్రహం పొందిన వారు . నూతనత్వాన్ని ఇష్టపడే వీరు స్వేచ్చా ప్రియులు .
        వేరి మైత్రి కోసం ఇతరులు పోటి పడతారు . శత్రువునైనా ఆకర్షించే శక్తీ ఉన్నవారు . చిత్త శుద్దితో చేపట్టిన పనిని నిర్వహిస్తారు . ఇతరులు సాద్యం కాదని విడచి పెట్టిన పనులను ముందుంది నిర్వహిస్తారు .
        ప్రేమానురాగాలకు ప్రాదాన్యతను ఇస్తారు . ఆకర్షనీయమైన రూపం కలిగిన వీరు కళల పట్ల ఆకర్షితులవుతారు . వీరిలోని సుగుణాలే ఉన్నత స్తితికి కారణాలు . సంపద క్రమంగా వృద్ది చెందుతుంది . జ్ఞాన మార్గం లో ఇష్టం ఉంటుంది. ఇతరులను బాగు చేసే పనులను  చేపడతారు .
      7 జ్ఞానాదిక్యతను సూచించే అంకె , ఈజిప్టు వాసుల దేవతలు ఏడుగురు . బైబిలులో 7 ను సూచించే శబ్దం పవిత్రంగా ఎంచ బడుతుంది .
     వైద్య రంగములో ఉన్నవారు దేనినైనా సునాయాసంగా గ్రహించ గలరు . ఎ రంగం లోనైనా తోలి స్తానం లో ఉంటారు . ఎంతటి దుఖమైనా మనస్తైర్యం విదవరు . విదేశ పరిచయాలు ఉంటాయి . ఇతరుల సలహాలను విన్నా , వాటిని సంపూర్ణంగా ఆచరణలో పెట్టరు .
 ఎ పనినైనా తమ స్వంత అభిప్రాయాలను అనుసరించి చేస్తారు . దేనినైనా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు . మెదవిగా కీర్తి గడిస్తారు . తమకంటూ ప్రత్యెక మార్గాన్ని నిర్దేసించుకుంటారు . వీరి స్వభావాన్ని గ్రహించి కుటుంబ సబ్యులు ప్రవర్తిస్తే వీరు సాదించలేని పనులు అంటూ ఏమి లేవు .
        వీరు రచనలు , ఉపన్యాసాల ద్వారా , కళలకు సంబందించిన ఒక వృత్తిని చేపట్టి అభివృద్ధి పొంద గలరు . జీవితాన్ని తాత్విక ద్రిష్టితో చూసే స్వభావం వీరికి వుంటుంది . దూర ప్రాంతాలలో జరుగుతున్న విషయాలను  తెలుసుకుంటారు .
     మార్మిక విద్యలలో ప్రవేశం ఉంటుంది . ఇంద్రియాలకు గోచారం కాని అరుదైన అనేక విషయాలను గ్రహించ గల ప్రతిభావంతులు . సన్యాసిలాగా ప్రవర్తిస్తారు .  తుచ్చ సుఖం , నాగరిక వ్యామోహం లేని వారు . జీవిత ప్రారంబం లోనే అదృష్ట దేవత దృష్టి వీరికి లభిస్తుంది .  పిల్లల మనస్తత్వం ఉన్నవారు .
       ప్రపంచ వ్యవహారాలన్నిటిని తెలుసుకుంటారు . లౌకిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది . స్నేహ భావం కల వారు . స్త్రీ పురుషుల ఇరువురికి మిత్రులు చాలా మంది ఉంటారు . అంతకు పూర్వం ఎ మాత్రం పరిచయం లేని వారితోనైనా స్నేహం పాటించ గలరు .
          ఏ రంగం లోనైనా తమ ప్రత్యేకతను చాటు కుంటారు . ప్రయాణాలు వీరికి ప్రీతి పాత్రమైనవి . ఇంట్లో  కుక్కలు , పిల్లులు , పశువులు , మేకలు , కోళ్ళు , పావురాలు , కుందేళ్ళు వంటి ప్రాణులను పెంచుకుంటారు . వాటిపై అనురాగం చూపుతారు .
        కీర్తి గడిస్తారు . శారీరక సుఖాన్ని త్యజిస్తున్న కొద్ది అనేక మార్గాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి . [ స్వార్ధం కూడదు ] ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది . తలచినవన్ని జరుగుతాయి . న్యాయమైన ఆలోచనలు , ఆదర్శాలు అన్ని సంపూర్ణంగా విజయవంతమౌతాయి . అన్ని పధకాలు కార్య సిద్ధిని పొందుతాయి .
          మంచి కుటుంబం [ పేరు అదృష్టమైనదిగా కలవారికి ] సుఖ సంసార జీవితం , అందమైన , గుణ వంతులైన భాగస్వాములు , తరగని కీర్తి , సంపద , ప్రజల అభినందనలు మొదలైనవన్నీ ఈ అంకె వ్యక్తులకు సిద్దిస్తాయి .
8 వ సంక్యవారి పలితాలు
telugu-number-8
అంకె 8 – శని
                                               ఆజ్ఞాపించే రాజు
        8,17,26,తేదిలలో జన్మించిన వారు , తేది , నెల, సంవత్సరము కలుపగా 8 వచ్చ్చిన వారు 8 ఆదిక్యతతో జన్మించినవారు .
 లక్షణాలు – స్వభావాలు
       అష్ట దిక్కులు , అష్ట సిద్దులు , అష్ట వసువులు , అష్ట ఐశ్వర్యాలు , అష్ట లక్ష్ములు , జ్యోతిష్య శాస్త్రంలో లెక్కించే అష్ట వర్గులు , ఇలా ఎనిమిది అన్న అంకె ప్రాముఖ్యతను  తెలిపే అంశాలు చాలా ఉన్నాయి .
        వీరికి ఇతరులను ఆగ్నాపించే శక్తి ఉంటుంది . అన్ని నేర్చిన సుక్ష్మ బుద్ది వివేకాలు ఉన్నవారు . ఇంద్రియాలను అదుపులో పెట్టగలరు . ఎల్లప్పుడూ ఆలోచనలతో గడుపుతారు .
         పలువురు ఈ అంకె అంటేనే భయపడతారు . కాని భయపడ వలసిన అవసరం లేదు . అంకెలన్నిటిలోను మంచి చేడులున్నాయి . ప్రతి అక్షరంలోనూ , గ్రహాలలోను మంచి చెడులున్నాయి . అవి కలసే స్తనాలను అనుసరించి సత్పలితాలు , దుష్పలితాలు ఏర్పడుతుంటాయి . వీరు తమకు అనుకూలమైన రంగును పొందినట్టే నామ సంక్యలు కుడా తమకు అనుకూలమైన ఇతర అంశాలకు అనుగుణంగా ఫలితాలనిస్తాయి .
         ఈ అంకెకు చెందిన వారు అన్నిటిని పరిశీలించే స్వభావం ఉన్నవారు . వీరు ఎంగంలో అడుగుపెట్టినా తమ ఆదిక్యతను చాటుకుంటారు . వీరు ఇతరుల వలె సునాయాసంగా విజయం సాదించిన వారు కారు . తీవ్ర కృషి పలితంగా విజయం సాదించిన వారు . ఈ అంకె తీవ్రంగా పరీక్షించి అద్బుత కార్యాలను సాదించ గల శక్తిని ప్రసాదించ గలదు .
    నిరంతర క్రుషివలులు . ఎల్లప్పుడూ సమస్యలతో పోరాటం సలుపుతారు . పెద్ద పదవులు నిర్వహిస్తున్నా బాధ్యతలను ఎక్కువగా మోస్తుంటారు . తరచుగా మనస్సులో ఆందోళనలు ఏర్పడి తొలగి పోతాయి . మేదోలక్షణం ఉంటుంది . ఏదో ఒక సమస్య మనస్సులో మెదులుతూ ఉంటుంది . [ చిరు ప్రాయం నుంచి మంచి స్నేహం , మంచి అలవాట్లు కలిగి ఉంటారు , పెద్దల [ గురువుల ] హిత బోదన అనుసరించి సమాజానికి హితం ఆచరిస్తారు] .
        చెడు ఆలోచనలు వీరి మనస్సును ఆకర్షిస్తాయి . ప్రతిభకు తగిన ఫలితాలు రాక దుఃఖం కలుగుతుది . ఉత్తములుగా కీర్తింప  బడతారు . సమర్డులుగా ఉంటారు .
     కొందరు హేతువాద , తర్క రీత్యా  మాట్లాడటం వలన వీరికి చిరకాల మిత్రులు అంటూ ఎవరు ఉండరు . ఒంటరిగా సమస్యలను ఎదుర్కొంటారు . ఎవరిని సులభంగా విస్వసించరు .
         మారుతున్న ఆలోచనలతో మనస్సు ఉద్విగ్నమౌతుంది . పురాకృత ఖర్మ ఫలితాలను వీరిని ఎక్కువగా చుట్టుముడుతాయి . తత్వ రహస్యాలు ఎరిగిన వారఒఉతారు . మానవాతీత శక్తులను గ్రహించ గలరు . దివ్య గుణ సంపన్నులై ఉంటె రాజ సన్మానం లభిస్తుంది .
               మంచి  చెడులను బేరీజు వెయ గల శక్తి ఉంటుంది . జీవితంలో ప్రగతి సాదించాలన్న తపన ఉంటుంది . మనస్సులో ఎప్పుడు మొండితనం ఉంటుంది . దేనినైనా స్పష్టంగా బైట పెట్టగలరు . వ్యతిరేఖత ఉంటుంది . కాని వెనుకంజ వేయరు .
         వీరి మాటలలో, చేతలలో తీవ్రత , ఖచ్చిత దోరణి ఉంటుంది . కార్య సాధకులు . బయటినుంచి చూస్తున్న వారికి దయా దాక్షిణ్యాలు లేని రాక్షసులన్పిస్తారు . కాని వాస్తవంగా  చాలా మంచివారు .
       తమ అర్హతకు మించి ఆశిస్తారు . ఆశను నేర వేర్చుకోవడానికి బృహత్ ప్రయత్నం చేస్తారు . విజయం సాదిస్తారు . ప్రపంచ జ్ఞానం కల వారు . సమయ సందర్బాలను సక్రమంగా ఉపయోగించుకొని లబ్ది పొందుతారు .
        ఇతరుల దుఃఖం చూసి చలిస్తారు . పలు కళలను అద్యయనం  చేస్తారు . కళా ఆరాధకులు . అన్నిటిలోనూ ఒంటరిగానే వ్యవహారం నడుపుతారు .  ఇతరుల సలహాలతో కాక తమకు తాముగా మంచి నిర్ణయం తీసుకోగలరు . వాహన ప్రియులు . వీరు వాహనం నడపడం ఆకర్షనియంగా కన్పిస్తుంది . భయం లేని వారు .
           ప్రేమతో, దయతో ప్రవర్తిస్తారు . ఒక పనికి పూనుకునే ముందు అనేక పర్యాయాలు ఆలోచిస్తారు . ఇతరుల విషయం లో అనవసంగా జోక్యం చేసుకోరు . కాని తమను గురించి ఎవరూ హీనంగా మాట్లాడ కూడదని భావిస్తారు . అలా మాట్లాడితే సహించరు .
        కొన్ని సందర్భాలలో అనవసరంగా డబ్బును ఖర్చు పెడతారు . తర్వాత బాధ పడతారు .  తమకంటూ ప్రత్యెక పద్దతులను అవలంబిస్తారు .సుఖ దుఖాలను తాముగా అనుభవిస్తారు . తమ లోపాలను చెప్పి ఎవరిని సాయం అడగరు . ఇతరులకు సాయం చేయడంలోనూ మంద గుణం ప్రవర్తిస్తారు .
        8- వ అంకె సహజత్వానికి బిన్నమైన ఆలోచనలను , అనుభూతులను , ప్రేరేపించ గల కాంతి – శబ్ద శక్తులను కలది . తక్కిన అంకెలకు చెందిన వారికంటే తప్పుచేసిన వారిని ఎక్కువగా శిక్షించే గుణం ఉన్నవారు . కళల పట్ల ఆసక్తి కల వారు .
         ఉన్నతమైన పవిత్రమైన ఆలోచనలు ఉన్నవారు . ప్రేమ , జ్ఞానం , దయ , వంటి ఉన్నత గుణాలు ఉంటాయి . ఇతరుల దుఃఖాన్ని తొలగిస్తారు . తమ క్రుషిచేత కీర్తి గడిస్తారు . గురువుల విషయం లో భక్తి శ్రద్దలు ప్రదర్శిస్తారు . పేదలపై దయ ఉంటుంది .
      అవినీతి , అక్రమాలను వ్యతిరేకించి వాటిని పార ద్రోలుతారు . తప్పుచేసిన వారు ఎవరైనా ప్రశ్నిస్తారు  .  న్యాయాన్యాయాలను ఎరిగిన వారు . లౌక్యం ఉంటుంది . మనస్సులో ఆలోచనలు నిరంతరం పరిబ్రమిస్తుంటాయి గొప్ప శాస్త్ర  వేత్తగా పరిశోధనా తపరులు గా ఉంటారు . దేహ సౌక్యంలో ఆసక్తి ఉంటుంది .
        శాస్త్రాలు ఎరిగిన వారు . అనేక కళలను . తెలిసిన వారు . అంతర్గత జ్ఞానం కలవారు . కీర్తి కాంక్ష ఉంటుంది . ప్రజల మద్య గౌరవాబిమానాలు పొందగలరు . సంస్కర్తలుగా ప్రజానయకులుగా రాణించా గలరు .
        దైవ భక్తులు . ఆచారాలను అనుసరిస్తారు . వైద్య , తత్వ , జ్యోతిష్య శాస్త్రాలలో రాణిస్తారు . గణిత శాస్త్ర పరిజ్ఞానం ఉంటుంది .
       మంచి సాంకేతిక నిపుణులు యంత్ర నిర్మాణ దక్షులు , సిద్ద వైద్యులు , రసాయన శాస్త్రజ్ఞులు , సైనికులు , శాస్త్ర చికిత్సా నిపుణులు , కొత్త మందులను కనుగొనే వారు , విద్యుత్ కంప్యూటర్ , ఇంజనీరింగ్ మొదలైన వారు 8 – వ అంకెకు చెందిన పవిత్ర  ఆదిక్యతతో జన్మించిన వారు .
        ప్రక్యాతి గాంచిన సినిమా  నటులు , నాట్యకారులు , శాస్త్ర వేత్తలు , రచయితలూ , కవులు , చాయా చిత్రకారులు , దర్శకులు , మేధావులు కూడా  ఈ ఆదిక్యతలో జన్మించిన వారునారు .
        సుశిక్షుతులైన  సైనికుల వలె శ్రమిస్తారు . అలుపెరుగని కృషి వీరికి ప్రకృతి ప్రసాదించిన వరం .
         వీరిని రెండు రకాలుగా విభజించ వచ్చును 1] పవిత్రమైన ఆదిక్యత కల వారు . సమాజానికి కావలసిన వారు . 2] చెడు ఆదిక్యత కల వారు .ఇతరులను వంచించి చట్ట వ్యతిరేఖ కార్య కలాపాలలో పాల్గొని జీవించే వారు .
        వీరిలో 1. ఉన్నత స్తాయి వ్యక్తులు 2. నిమ్న స్తాయి వ్యక్తులని రెండురకాల వారున్నారు .
 ఉన్నత స్తాయి వ్యక్తులు ఉన్నత సంస్కారంతో దాన గుణం కల వారు . ధర్మజ్ఞులు రాజకీయ రంగములో అద్బుత కార్యాలను ఆచరిస్తారు . సహజమైన సంబాషణ ద్వారా అందరిని ఆకర్షిస్తారు . ఆకర్షనీయ రూపంతో సంతోషంగా కన్పిస్తారు .
        జీవితంలో పెద్ద సమస్యలకు లోనై బయట పడతారు . తత్వ శాస్త్రంలో నిష్ణాతులు కొందరు ప్రపంచ సుఖాలను త్యజించి సన్యాసం స్వీకరిస్తారు . మానవాతీత శక్తులను గురించి పరిసోదించే ఆసక్తి గల మనసున్న వారు . దివ్య శక్తులను గురించి గ్రహించిన వారు . . 8-వ అంకెకు ఆద్యాత్మిక మార్పులు , సద్గుణం తోడైతే గొప్ప కీర్తి గల వారౌతారు . మంచి పద్దతిలో సమకూరిన ఆదిక్యతలో జన్మించిన వారికి 8- వ అంకె అదృష్ట కరమైనది
తక్కిన అంకెల కంటే 8-వ అంకె గొప్ప విజయాలను ప్రసాదిస్తుంది .
          శని మిక్కిలి శక్తీ గల అధిపత్యం ఉన్న గ్రాహం బాద్యత గలది . కటినమైనది . హక్కుల కోసం పోరాడే శ్రమ జీవి . ప్రకృతి పరిమాణాలను రక్షించ గలరు .
      వీరు ఎక్కువ బాధ్యతలను , బరువులను కలిగి ఉంటారు . దేనినైనా బేరీజు వేసుకునే గుణం కలిగి ఉంటారు . పక్ష పాత రహితంగా వ్యవహరిస్తారు . పరిసోదనాసక్తులు . ప్రకృతి ఆరాధకులు . పాత కొత్తల మేలుకలైన వీరిని ఆకర్షిస్తుంది . తరచుగా ప్రయాణాలు చేస్తుంటారు . ఆకర్షణకు లోబడి అందులో లయించిపొతారు .
      వీరికి కొన్ని అనుకోని సంగటనలు జీవితంలో ఎదురౌతాయి. సాని ఆదిక్యత వీరిపై ప్రభావం చూపుతుంది . ఎంతటి ప్రతిభావంతులైనా సాని తీవ్రతకు లోనవుతారు . వీరి ఆలోచనలు , పనులు విదికి లోబడి ఉంటాయి . 8,17,26 తేదిలలో జన్మించిన వారు మాత్రమె కాక తేది , నెల , సంవత్సరము కలపగా వచ్చిన మొత్తం సంక్య 8 అయిన వారు కుడా 8- ఆదిక్యతలో జన్మించిన వారౌతారు . వీరు విది  యొక్క ఘోర ప్రభావం నుంచి బయట పడాలంటే అదృష్ట నామం ధరించడం మంచిది .
    వీరు రాగ ద్వేషాలకు అతీతులు . సమదృష్టి కల వారు . మంచి చెడులను సమ దృష్టితో పరిశీలిస్తారు . నిర్వహణా సామర్ద్యం ఎక్కువగా ఉంటుంది . ఆత్మజ్ఞానం ఉన్నవారు .
        కావ్య నిర్మాణ దక్షులు . ఇతరులతో మనస్సు విప్పి మాట్లాడరు . సుఖ దుఖాలను తామే అనుభవిస్తారు . తమ లోపాలను ఇతరులకు చెప్పరు . చిరుప్రాయంలోనే రక్షకుల సాయం నిలిచి పోతుంది .
       నిద్రిస్తున్న జాతిని లేపి  హక్కులు – విప్లవం మొదలైన విషయాలను నేర్పే నాయకులు ఔతారు . లోక జ్ఞానం , శాసన  పరిజ్ఞానం వ్యాపార తంత్రగ్నత , ఐకమత్యం , మొదలైన లక్షణాలతో ప్రజల మద్య గౌరవాభినానలను పొంద గల వారు . చాల తక్కువ మంది వీరినే ఉన్నత స్తాయి ఆదిక్యతలో జన్మించిన వారుగా పెర్కొన్నాం .
        స్తిర స్వభావంతో ప్రవర్తిస్తారు . పారిశ్రామిక రంగాలలో ఆసక్తి ఉంటుంది . ఒంటరితనాన్ని ఇష్ట పడతారు . సంగీతంలో ఆసక్తి ఉంటుంది . చురుకుగా వ్యవహరిస్తారు . ఇతరులకు లోబడక తమకు లోబడే విదంగా చేస్తారు . పరోక్ష శత్రువులు ఉంటారు . వారిని జయించ గలరు . ఒక సమస్య పరిష్కారమైతే మరో సమస్య వీరి జీవితంలో మొదలౌతుంది . క్రమంగా అభివృద్ధి సాదిస్తారు . ప్రతి ముందడుగుకు పూర్వం పెద్ద పోరాటం సలిపి విజయం సాదిస్తారు .
         శారీరక భలం కంటే మనోభాలం ఎక్కువ కల వారు . జన సమూహాన్ని విడచి ఒంటరిగా విహారం సలపాలని అభిలశిస్తారు .
     ఇంజనీరింగ్ , ముద్రణా పరిశ్రమ , ఇనుము కరిగించే పరిశ్రమ , పాత ఇనుము పాత వస్తువుల సంబందమైన వ్యాపారాలలో ఉన్నతి పొంద గలరు .
       ఇతరులతో కలసి పోరు . అసాద్యకార్యాలను ఆచరిస్తారు . తెలివి పెట్టుబడిగా పనులను చేపట్టి పూర్తి చేస్తారు . సుఖం ఉన్నా అనుకూలత ఉండదు .
    దైవం మీద , పెద్దల మీద ఎక్కువ విశ్వాసం కలిగిన వారు . ప్రశాంత జీవనం గడపాలని ఆశిస్తారు . ఉన్నత ఆదర్శాలతో జీవిస్తారు . తమలో స్నేహం చేస్తున్న వారిని శత్రుత్వం నెరపుతున్న వారిని జీవితాంతం మరచిపోరు . ప్రకృతి ఆరాధకులు .
        పొగడ్తకు లోబడే వీరిని ఇతరులు పొగడడం ద్వారా అనేక సహాయాలను పొంద గలరు . పై లక్షణాలన్నీ ఉన్నత స్తాయి ఆదిక్యతతో జన్మించిన వారికి చెందినవి .
9 వ సంక్యవారి పలితాలు :
telugu-number-9
అంకె 9 – కుజుడు
                                               భూపుత్రుడు
         9,18,27 తేదిలలో జన్మించిన వారు . తేది , నెల , సంవత్సరం కలిపిన 9 వచ్చినా 9 అధిక్యత లో జన్మించిన వారు .
స్వభావాలు – లక్షణాలు
           నవధాన్యాలు , నవగ్రహాలు , అంకెలు 1 మొదలు 9 వరకున్నవి తొమ్మిది . నవరసాలు , నవ దాతువులు , నవరత్నాలు , నవ నిధులు , సరిరంలోని నవ రంద్రాలు , ఇలా తొమ్మిదికి సంబందించిన పలు అద్బుత విషయాలు ప్రకృతిలో ఉన్నాయి .
          వీరు దెస రక్షకులు . శక్తీ సంపన్నులు . దేశ భక్తులు , వివేక వంతులు , జ్ఞాన దర్సనం కల వారు .
         మంచికి ప్రేరక శక్తులుగా , చెడుకు వినాస శక్తులుగా రెండు  లక్షణాలు కల వారు . గాంబీర్య లక్షణం ఉన్నవారు . దయాసముద్రులు . పాలనా దక్షులు . ప్రత్యెక తీవ్రవాద లక్షణం ఉన్నవారు .
       భావేసాపరులు, ఇతరులకు లోబడని వారు . తమ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రవర్తించే వారు . ఆదిక్యతా లక్షణం ఉన్నవారు . మానసిక భళా సంపన్నులు . [ కొందరు మనస్సు కోరుకొనే మత్తుపదార్దాలకు , తుచ్చ సుఖాలకు , లోబడి వాటికి బానిసలౌతారు. ] కఠిన స్వభావులు .
         సనస్యలను ఎదుర్కొని పోరాడా గల వారు . ఆలోచనలు మనస్సులో ఎల్లప్పుడూ సమరం సలుపుతుంటాయి . ముఖం శాంతం గాను మనస్సు అల్లకల్లోలంగాను , లౌక్యులు , సమయ సందర్బాలను గమనిస్తూ ఉంటారు . వాదనా నైపుణ్యం ఉన్నవారు .
          ఎత్తుగడలను రహస్యంగా ఉంచుతారు . కొందరు గొడవ పడడం లో  ఎక్కువ ఆసక్తి కల వారు . ఇతరుల మద్య గొడవలు కలిగించి వేడుక చూస్తారు . వీరు శాంతి యుత చర్చలను ఇష్ట పడరు . అనేకుల మైత్రి లభిస్తుంది .
          దేశాభిమానం ఎక్కువగా ఉంటుంది . దేశ రక్షణకై  ఏ త్యాగానికైనా సిద్ద పడతారు . సమాజ సేవను నిర్వహిస్తారు . తమ వర్ణ రక్షణకై ఆసక్తి చూపుతారు . బందం వీరి మనసును బందిస్తుంది .
       ఇతరుల మాటలను వినరు . తమ మాటలను సభ ఆమొదించాలన్నది వేరి కోరిక . వీరి మాటలు అడ్డుతగిలితే గొడవలు వస్తాయి . తమ మాటలను వినని వారిని శపిస్తారు . తమ మాటలకు చిత్తం అన్నవారిని చక్కగా చూసుకుంటారు , వారికి అన్ని సాయాలను చేస్తారు . వీరి తప్పులను ఇతరులు ఎత్తి  చూపడం ద్వారా వీరిచే ఇతరులు ద్వేషింప బడతారు .
       కొన్ని సందర్బాలలో లోపల ఒకటి బయట ఒకటిగా ప్రవర్తించే వంచకులచే మోసగింప బడతారు .
       తెలివి మొగ్గలా ఉద్భవిస్తుంది . ఆలోచనలు , బుద్ది సూక్ష్మత కలిగి వీరి శత్రువుల బలాబలాలను బేరీజు వేసుకుంటారు . తమకంటే బలవంతులైన శత్రువుల వద్ద మైత్రిని బలం తగ్గిన వారి  వద్ద  గొడవలను ఏర్పరచుకుంటారు . తంత్రజ్ఞులు శాంతి కాముకులు గా కన్పిస్తారు . గొడవ పడడంలో ఎక్కువ    ఆసక్తి ఉన్నవారు . తీవ్ర వాద దోరణి ఎక్కువ .  ముఖం ప్రశాంతంగా ఉంటుంది
        సమయానుగుణంగా ప్రవర్తిస్తారు . గొడవలలో నష్టం కలిగితే శాంతికి పూనుకుంటారు . చర్చల ఫలితం వీరికి అనుకూలంగా ఉండాలి . లేకపోతె ఎదుటివారు ఎంత పెద్దవారైనా నిందిస్తారు .
        ఉన్నత ఆలోచనలున్న కుజుని ఆదిక్యత కొరవడితే మూర్కత్వం , రాక్షసత్వం ఘనీభావిస్తాయి .
          బుద్ది మంతులైన వీరు శత్రువును సమయం ఎరిగి బోల్తా కొట్టించగా గలరు . శత్రువును ప్రత్యక్షంగా ఎదుర్కోవడం కాక [ వంచన తో ] శాంతి ప్రదర్శించి జయిస్తారు . తన రహస్యాలను ఎవరి వద్ద బయట పెట్టరు .  రహస్య రక్షకులు , చురుకుదనం లేనివారుగా కన్పించినా మనసు తేనెటీగ లాగా పరిబ్రమిస్తుంది .
         మానసిక అనిశ్చితి లో ఆవేశానికి లోనై తాము మాట్లాడుతున్నది ఏమిటన్నది కూడా గ్రహించ లేక మాట్లాడేస్తారు .
         విజయం లో వివేకం , ఓటమితో వేణు తిరిగని మనస్తత్వం కల వారు . విరామమెరుగని శ్రామికులు . పోరాట పటిమ కల వారు . కొత్త వాటిని కనుగొనడంలో ఆసక్తి ప్రదర్శిస్తారు . తమ ఇష్ట దేవతను ప్రార్దిస్తారు . తమకు తాము నియమ నిబందనలు ఏర్పరచుకొని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు .
      యోగం, ద్యానం , వైద్యం , వశీకరణ విద్యలలో నిష్ణాతులవుతారు . దెస రక్షణకైన సైనిక రంగములో విశిష్టమైన సేవలు చేసి పెద్దల అభినందనలను , దేశ రక్షణ , తమ వర్ణ రక్షణలో ఆసక్తి కల వారు .
        రహస్య కళలను నేర్చి వాటిలో రాణిస్తారు . ప్రపంచ జనులకు మార్గ దర్సులై ఉంటారు . 9- వ అంకె యొక్క మంచి ఆదిక్యతలో జన్మించిన కొందరికి అపూర్వ శక్తులు ఉంటాయి . వీరు కుటుంబాన్ని విడచి ఒంటరి తనాన్ని ఇష్టపడతారు . పరిస్థితులను చక్కగా గ్రహిస్తారు .
        శిల్ప కళలలో నిష్ణాతులు . అడవిని సుక్షేత్రంగా , కొండలను నగరాలుగానూ తీర్చి దిద్దగలరు . క్రొత్త ఊరు, నగరం , దేశాలనే రూపొందించగల భుదేవత ఆశిస్సులు ఉన్నవారు . భవనాలను పలువురు ఆశ్చర్య పడే విదంగా కడతారు .
        9- వ ఆదిక్యత తగ్గినా వారు ఇతరుల ఇళ్ళకు నిప్పు పెట్టడం వంటి నీచ కార్యాలకు పూనుకుంటారు .
       9- ఆదిక్యత కల వారు ఇతరుల దుఃఖాన్ని పోగోడతారు . మాత్రుదేస రక్షణకై శత్రుసైన్యం మీద బాంబులు వేసి , క్షిపణులను ప్రయోగిస్తారు . యుద్ద వీరునుకి కల పోరాట పటిమ ఈ అంకెలో జన్మించిన అందరికి వర్తిస్తుంది . చాలంజ్ ను ఎదుర్కొన గలరు . ఇల్లు, కార్యాలయం, మిత్రులు అందరిలోనూ , అన్నిచోట్ల సంస్కరణ ముద్రలు ప్రతిబింబింప చేస్తారు . తమ ఆదర్శాలను మనస్సులో లోతుగా ముద్రించుకుంటారు .
        జీవితంలో అనేక సమస్యలు వెన్నాడుతాయి . వెంట్రుక వాసిలో ఆపద తప్పించుకోవడానికి సరయిన సాక్ష్యం వీరే . పోరాట పటిమ గల వీరికి కార్య బంగాలు ఏర్పడుతుంటాయి . తీవ్ర కృషితో విజయం సాదిస్తారు . ఈ అంకె ప్రభావం వలన వంచన గల వారితో జీవించ వలసి ఉంటుంది . అయినా విజయం వీరిదే .
       వీరి చుట్టూ దుర్మార్గులు , వంచకులు ఉంటారు . సమయం చూసి వీరిని మత్తు పెట్టాలని యత్నిస్తారు . కాని వీరి బుద్ది సూక్ష్మత కారణంగా తప్పించుకుంటారు . లోక జ్ఞానం ఎక్కువ .
      ప్రవర్తనలో యుద్ద సమయంలోని యుక్తులు కనిపిస్తాయి . సహనంతో  ఉంటె విజయం తద్యం . అవసర పడి గొడవ పడక ప్రశాంతంగా ప్రవర్తించాలి .
   యౌవనం సమస్యల మయ జీవితం కలిగి ఉంటారు . అనేక ఇబ్బందులకు లోనవుతారు . యౌవన  చరమ దశనుంచి అదృష్టం మొదలై , మద్య వయస్సుకు తర్వాత శాస్వత మైన అదృష్టం ఉంటుంది . గెలుపు ఓటముల పట్ల స్తిర మనస్కులు . ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే దృడ చిత్తం ఉన్నవారు . ఆత్మా స్తుతి చేసుకుంటారు . సంగీత, సాహిత్య నాటక రంగాలపై ఆసక్తి ఉంటుంది . దివ్య సంగీత సాహిత్య నాటక రంగాలపై ఆసక్తి , ఆత్మా స్తుతి చేసుకుంటారు . సంగీతంలో లయించి పోతారు . మొండితనం ఉంటుంది . తమ మాట , ప్రవర్తన సరైనవని నిరూపించుకుంటారు .
       వీరి అభిప్రాయాలను ఎవరూ మార్చలేరు . వీరి మనస్సును ద్రవింప జేయడం కష్టం . ఎల్లప్పుడూ మనస్సులో ఉత్సాహం ఉంటుంది . 9 వ అంకెకు చెందిన పలువురు చిరునవ్వుతో కన్పిస్తారు . ఇతరులకు హితవు చెప్పడంలో సిద్ద హస్తులు .
        ధన భలం సైన్య భలం [ అంగ భలం ] వీరికి ఆయా సమయాలలో తగువిదంగా సాయ పడతాయి . వీరి వీరావేశ ఉపన్యాసాలకు పిరికి వాడు సైతం వీరుడిగా  అవతరిస్తాడు . జీవిత ఉత్తర బాగం లో నిరాడంబర రీతిలో దానం చేసృతుంది . పెద్దల స్నేహం , ఉత్తముల ఆశిస్సులు పొందుతారు . పెద్దలను గౌరవిస్తారు . పువ్వులను ఇష్ట పడతారు .
         తమ మనస్సుకు నచ్చిన వారైతే వారి వద్ద ఎక్కువగా ప్రేమాభిమానాలు కలిగి సాయం చేస్తారు . నమ్మకస్తులుగా ఉంటారు .దెసమ్ యొక్క ముక్య బాద్యతలు వీరు చూస్తారు . స్వీయ రక్షణా నైపుణ్యం కల వారు . రహస్యాలు ఎరిగిన వారు . ఆడంబరమైన ఖర్చుల పై ఆసక్తి [ మొత్తం  సంక్య  విరుద్దమైతే పిసిని గొట్టుతనం చాలా ఎక్కువగా ఉంటుంది . ఆహార విషయంలోనూ లోభాత్వం కనిపిస్తుంది .  లొభత్వానికి , పొదుపరి తనానికి తేడా  ఉన్నది . ]
      ఆడంబర వస్తువులపై వ్యామోహం ఎక్కువ . వీరున్న చోటుని    కళాత్మకంగా తీర్చి దిద్దుతారు . భావావేశా పరులు కనుక ప్రమలో పడడం తేలిక. మహాత్ములు, భక్తులుగా  , శిష్యులుగా ,  పెద్దలకు అనుచరులుగా , మహా కళాకారులకు అభిమానులుగా ఉంటారు .
       జ్ఞాన మార్గం కనుగొంటారు . అనేక విదాలుగా కలలు వస్తుంటాయి . వీరిలో దివ్య లక్షణాలు ఉంటాయి .
    రాజ్య పాలనా సమర్ధులు . జనులు కీర్తించే గురువులవుతారు . తమకు అప్పగించిన పనులను బాధ్యతగా నిర్వహిస్తారు . శాంతితో విజయం సాదిస్తారు . అనేక కార్యాలను నిర్వహిస్తారు . సైన్యానికి నాయకత్వం వహించ గలరు . ధన , ధాన్య సంపదలు చేరుతాయి .
       సినిమా , కళలు , నాటక రంగాలలో విజయ పతాకం ఎగుర వేస్తారు . పవిత్రమైన ఊహలు   కల వారు . మనసులో విలక్షణ ఆలోచనా తరంగాలు జనిస్తు ఉంటాయి . ఆట , పాట , కధ , కవిత్వం , చిత్ర  లేఖనం ,  సంగీతం మొదలైన వాటిలో అభిరుచి కల వారు . వాటిలో ప్రవేశం కూడా ఉంటుంది .
         శారీరక ఆరోగ్యాన్ని చక్కగా  చూసుకుంటారు .  వీరి రూపం లో గాంబీర్యం , ఆకర్షణ ఉంటుంది . తమ శత్రువులను ఎక్కువగా దిక్కరిస్తారు . భయం లేకుండా గొడవ పడతారు . [ కుజుడికి పోరాడే గుణం ఉన్నది ] తమ స్వీయ సిద్దాంతాలను ఎప్పటికి విడచి పెట్టరు . వీరికి ప్రత్యక్షంగా కాక . పరోక్షంగా వ్యతిరేకత , శత్రుత్వాలు ఉంటాయి . వీరి సద్గుణాలను ఇతరులు గ్రహించరు .
          న్యాయానికై పోరాడుతారు . నీతి రహితంగా ఎవరైనా ప్రవర్తిస్తే వెంటనే కోపం తో ఊగిపోతారు . అకారణంగా నష్టం వాటిల్లినా పట్టించుకోరు . బాగా శ్రమించి క్రమంగా అభివృద్ధి గాంచి ఉన్నత స్తాయికి చేరుకుంటారు . మానవ సహాయం కంటే దైవానుగ్రహం వీరికి ఎక్కువ ఉంటుంది .
          ప్రేమాభిమానాలకు తల వంచుతారు . ఎరంగములొనైనా రాణిస్తారు . పొగడ్తకు లొంగుతారు . సహనం తో ఎపనినైనా చేపడతారు . శారీరక పటుత్వం ఎల్లప్పుడూ సక్రమంగా ఉంటుంది .
        యౌవనం , వృద్దాప్యం ఒకే విదంగా ఉంటుంది . అంటే వృద్దాప్యం లోను యువకుల్లా  చురుగ్గా వ్యవహరిస్తారు . చేస్తున్న పనిలో సంపూర్ణంగా లోనవుతారు . కొత్తదనం కోసం పాకులాడుతారు . వీరికి ఆదునిక దృక్పదం ఎక్కువ [ వీరు పోరాట పద్దతిని , మొండి పట్టుదలకు సమయానుగుణంగా సవరించుకుంటే సత్పలితం ఉంటుంది ]
     హటాత్తుగా భావావేశానికి లోనవుతారు . తొందర పాటు తనం కొన్ని సందర్బాలలో ప్రతిఫలిస్తుంది . బెదిరింపులతో కాలం గడుపుతారు . ధైర్యస్తులు , భోజన ప్రియులు . తరచుగా విదేశ ప్రయాణాలు చేస్తారు . ఉల్లాస యాత్ర వీరికి సంతోష దాయకం . అడవులు , కొండలు , పచ్చటి భయలలు చూసి పరవసిస్తారు .
        వీరి జీవితం లో అనేక వినోద సంగటనలు జరుగుతాయి . ఎల్లప్పుడూ కొంత మంది వీరి చుట్టూ ఉంటారు . వీరి మాటలకు అందరు లోబడి ప్రవర్తిస్తారు . కళలకు సంబందించిన , అగ్ని, అధికారాలకు సంబందించిన వ్రుత్తి ఉంటుంది .
         దానధర్మాలు చేస్తారు . శక్తీ గల   దైవ భక్తులు . తుచ్చ సుఖాలకి డబ్బును విరివిగా కర్చు పెడతారు . వెళ్ళిన చోట్ల సుఖబోగాలను అనుభవిస్తారు .
     రాజ్య తంత్ర న్యాయ సంబందమైన విషయాలు తెలిసిన వారు రక్షణ పద్దతులు తెలుసు . [ కొందరు మద్యపానం , వ్యభిచారం వంటి చేడుపనుల వైపు మనసు మళ్ళించి సంపదను పోగొట్టుకుంటారు . కుజ బలం తగ్గిన వారి ప్రవర్తన ఇది ] ఒక పనికి పూనుకోవడానికి ముందు పలు పర్యాయాలు ఆలోచిస్తారు . విజయ సాదకులైన వీరు తొందర పాటు తనం తో చేసిన నిర్ణయాలు ఓటమి పాలఒఉతయి
     సైన్య,  రక్షక భట , వ్యవస్తలలొ ఉన్నత పదవులు పొంద గలరు . అగ్ని సంబందమైన పరిశ్రమలు అనుకూలమైనవి . వైద్య రంగములో రాణింపు ఉంటుంది . ఇంజనీరింగ్, రసాయన రంగాలు కూడా మంచివే . పారిశ్రామిక వేత్తగా , పరిశ్రమ జ్ఞానం  కలిగి ఉంటారు .  శాస్త్ర వేత్తలుగా ఉంటారు . ఎగుమతి , దిగుమతి వ్యాపారం చేస్తారు .
     సినిమా , నాటకం , పత్రికలూ , రేడియో , టీవి వంటి రంగాల గురించి అవగాహన ఉంటుంది . సులభంగా ఆకర్షించే మాటలు ముఖ లక్షణాలు ఉండడం వలన జన సంబందమైన వేనినైనా చక్కగా నిర్వహించ గలరు . ప్రశాంతమైన , ఆనందమయమైన జీవితాన్ని ఆశిస్తారు . వృద్దాప్యంలో ఆద్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటారు .
      అందరిని ఆకర్షించే స్వభావం ఉన్న వారు . అనేక రంగాలలో విశిష్టతను గడిస్తారు . కోపం వచ్చినప్పుడు మండిపడతారు . సంతోష సమయంలో శాంతి స్వబావులుగా ఉంటారు .
        ఇతరుల మనస్సు వీరి ఆడినం లో ఉంటుంది . తంత్రాలు, ఎత్తుగడలు , మనసులో దాపరిక వంటివి వీరి ప్రత్యెక గుఆలు , గడించిన  సంపదను ఆత్మా తృప్తికై విపరీతంగా కర్చుపెడతారు . ఆద్యాత్మిక బలం వీరికి తోడుగా ఉంటుంది . దేశ భక్తులు , దాన గుణం ఉన్నవారు . మానవత్వం ఉన్నవారు . జీవితపు ఉత్తర భాగంలో సుఖంగా జీవిస్తారు .

vaastu-వాస్తు

వాస్తు శాస్త్రం : వాస్తు అనగా దేవతలు మానవులు నివాసమునకు అనువైన ప్రదేశం  అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. భారతీయులు, చైనీయులు తమ ఇంటి నిర్మాణాల్లో పాటిస్తారు. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి.

 1. భూమి వాస్తు.
 2. హర్మ్య వాస్తు
 3. శయనాసన వాస్తు.
 4. యాన వాస్తు.

వాస్తు శాస్త్రంలోని నిర్మాణ వ్యవస్థలో ప్రధాన వస్తువులు పంచ భూతాలైన

 • భూమి
 • జలం
 • అగ్ని
 • వాయు
 • ఆకాశం
 • వాస్తు పురుష మండలాలు

  ఎనిమిది దిక్కులకు పరిపాలించే అష్టదిక్పాలకులు ప్రధాన మండలాధిపతులు:

  • ఈశాన్యము – ఈశానుడు
  • తూర్పు – ఇంద్రుడు-
  • ఆగ్నేయము – అగ్ని
  • దక్షిణం – యముడు
  • నైఋతి – పిత్రు/నైరుత్య,
  • పడమర – వరుణుడు
  • వాయువ్యం – వాయు
  • ఉత్తరము – కుబేరుడు
  • కేంద్రము – బ్రహ్మ

   వాస్తు పురుషుని జన్మించు విదానం : 

   వాస్తు శాస్త్ర పురాణం : 

   పూర్వ కాలంలో అంధకాసురడనే రాక్షసుడు ముల్లోకాల వాసులను ముప్పతిప్పలు పెట్టుచుండెను. అప్పుడు లోక సంరక్షణార్థం పరమేశ్వరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశాడు. ఆ సమయంలో శివుని లలాటం నుండి రాలిన ఒక చమట బిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా భూమి, ఆకాశాలను ఆవరించసాగింది. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులయ్యారు. బ్రహ్మదేవుని శరణువేడారు. సమస్త భూతములను సంభవించువాడు, సర్వలోక పితామహుడు అయిన బ్రహ్మ దేవతలను ఊరడించి ‘ఆ భూతమును అధోముఖంగా భూమి యందు పడవేసే విధానం చెప్పాడు. బ్రహ్మ దేవుని ఆనతి ప్రకారం దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా క్రిందకు పడవేశారు.

   ఆ భూతం భూమిపై ఈశాన్య కోణమున శిరస్సు, నైరుతి కోణమున పాదములు, వాయువ్య, ఆగ్నేయ కోనాలందు బాహువుల వుండునట్లు అధోముకంగా భూమిపై పండింది. అది తిరిగి లేవకుండా దేవతలు దానిపై ఈ విధంగా కూర్చున్నారు.

   శిరస్సున – శిఖి(ఈశ)

   దక్షిణ నేత్రమున – సర్జన్య

   వామనేత్రమున – దితి

   దక్షిణ శోత్రమున – జయంతి

   వామ శోత్రమున – జయంతి

   ఉరస్సున (వక్షమున) – ఇంద్ర, అపవత్స, అప, సర్ప

   దక్షిణ స్తనమున – అర్యమా

   వామ స్తనమున – పృధ్వీధర

   దక్షిణ భుజమున – ఆదిత్య

   వామ భుజమున – సోమ

   దక్షిణ బాహువున – సత్య, భృశ, ఆకాశ, అగ్ని, పూషా

   వామ బాహువున – పాప యక్ష, రోగ, నాగ, ముఖ్య, భల్లాట

   దక్షిణ పార్శ్వమున – వితధి, గృహక్షత

   వామ పార్శ్వకామున – అసుర, శేష

   ఉదరమున – వినస్వాన్, మిత్ర

   దక్షిణ ఊరువున – యమ

   వామ ఊరువున – వరుణ

   గుహ్యమున – ఇంద్ర జయ

   దక్షిణ జంఘమున – గంధర్వ

   వామ జంఘమున – పుష్పదంత

   దక్షిణ జానువున – భృంగరాజ

   వామ జానువున – సుగ్రీవ

   దక్షిణ స్పిచి – మృగబు

   వామ స్పిచి – దౌవారిక

   పాదములయందు – పితృగణము

   ఇంతమంది దేవతల తేజస్సముదాయంతో దేదీప్య మానంగా వెలుగొందుతున్న ఆ భూతకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దాన్నే ‘వాస్తు పురుషుడు’గా సృష్టి గావించాడు.

   భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు మంచి ఫలితాలను అందిస్తాయంటే …

   తూర్పు- గృహంలో శాంతి, ఆరోగ్యం, సంపద చేకూరటం,
   పడమర- సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,
   ఉత్తరం- వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,
   దక్షిణం- అదృష్టం, వినోదం, కీర్తి,
   వాయువ్యం- తండ్రికి మంచి అభివృధ్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,
   నైఋతి- తల్లికి సౌఖ్యం,వివాహ సఫలం,
   ఈశాన్యం- వృత్తి పరమైన అభివృద్ధి,
   ఆగ్నేయం-అదృష్టం,

 • వాస్తు ప్రకారం స్థలాన్ని కొనటం ఎలా?

  ఇంటి నిర్మాణంలో స్థల ఎంపిక చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంటి స్థలాన్ని వాస్తురీత్యా ఎంపిక చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు దరిచేరుతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. స్థల ఎంపికలో ఏదేని లోపముండినట్లైతే అశుభ ఫలితాలు, ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టిన యజమానులకు అశాంతి కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయని వారు చెబుతున్నారు.

  ఇకపోతే వాస్తు ప్రకారం ఎటువంటి స్థలాన్ని కొనకూడదని పరిశీలిస్తే… 
  ఈశాన్యము తగ్గిన స్థలములను కొనకూడదు. ఇటువంటి స్థలాల్లో నివసించేవారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వంశావృద్ధి క్షీణిస్తుంది. సమాజ గౌరవాన్ని కోల్పోవటం జరుగుతుంది.

  స్థలానికి తూర్పు, ఉత్తర దిక్కులలో వేరే వారి స్థలాలు ఉంటే వారి స్థలాల నుండి మన స్థలంలోకి పారకుండా విధంగా చూసుకోవాలి. ఇలా ఇతరుల స్థలం మన స్థలంలోకి పారే విధంగా ఉంటే ఇటువంటి స్థలం నివసించటానికి మంచిది కాదు.

  రెండు విశాలమైన స్థలముల మధ్య నున్న ఇరుకైన స్థలాన్ని కొనకూడదు. దీనివలన మనశ్శాంతి ఉండదు. ఎన్నో ఒత్తిడిలకు లోనవుతారు.

  ఇలాంటి స్థలాల్నికొనాలి:
  ఆగ్నేయంగా ఉండి తూర్పు, ఈశాన్యం పెరిగి ఉంటే ఆ స్థలాన్ని కొనటం శుభఫలాన్నిస్తుంది. యజమానికి పేరు ప్రతిష్టలు, సంతానం, మంచి అభివృద్ధిలోకి వస్తారు.

  ఉత్తర- ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కొంటే అన్నీ విధాల మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్ధిని కలుగ జేస్తుంది. ఆ ఇంట స్త్రీలకు సుఖ సంతోషాలకు లోటుండదు. తూర్పు- ఈశాన్యం, ఉత్తరం-ఈశాన్యం పెరిగిన స్థలాలను కొనటం ద్వారా మంచి సంపదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబం సుఖ సంతోషాలతో సాగుతుందని వాస్తు చెబుతోంది.

  వాస్తు ప్రకారం సింహద్వార గేట్ల అమరిక
  ఆగ్నేయ స్థలంలో తూర్పు సింహద్వార గృహం కట్టడం శ్రేయస్కరమని వాస్తు శాస్త్రజ్ఞులు అంటున్నారు. కాబట్టి ప్రహరీ గేట్లు కూడా తూర్పు ఈశాన్యం, తూర్పు ఉచ్ఛంలో పెట్టుకోవడం మంచిదని వారు పేర్కొంటున్నారు. దక్షిణ స్థలంలో గేటు దక్షిణ స్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు ఉన్న స్థలంలో సింహద్వారం ఎదురుగా గేటు పెట్టాలి.

  తూర్పు దిశన రెండు గేట్లు పెట్టాలను కుంటే తూర్పు ఈశాన్యంలో పెద్దగేటు, తూర్పు ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు, ఉత్తరం ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.

  నైరుతి స్థలంలో గేటు నైరుతిస్థలంలో నిర్మించిన గృహంలో దక్షిణ లేదా పశ్చిమ దిశలలో ఏదో ఒక దిశకు మాత్రమే సింహద్వారం, ఇతర వాస్తు విషయాలు దృష్టిలో పెట్టుకుని గేటు పెట్టాలి. దక్షిణం ఉచ్ఛం నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యంలో గేటు పెట్టాలి.

  ఉత్తర దిశను ఉత్తర ఉచ్ఛం ఈశాన్యం వరకు, పశ్చిమ ఉచ్ఛం నుంచి పశ్చిమ వాయువ్యం వరకు ఎక్కడైనా సింహ ద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవాలి. విశాలమైన ఆవరణ కలిగి రెండు గేట్లు పెట్టదలచినపుడు పశ్చిమ వాయువ్యంలో పెద్దగేటు, పశ్చిమ ఉచ్ఛంలో సింహద్వారం ఎదురుగా చిన్న గేటు పెట్టాలి.

  అలాగే.. వాయువ్య స్థలంలో గేటు వాయువ్య స్థలంలో నిర్మించిన గృహంలో అవసరాన్ని, సింహ ద్వారాన్ని బట్టి రెండు వైపులకు లేదా కేవలం ఒకవైపుకు పెట్టుకోవచ్చునని వాస్తు నిపుణులు అంటున్నారు.


వాస్తు ప్రకారం గృహప్రవేశానికి శుభ దినాలు
 
వాస్తు ప్రకారం ఇంటికి నిర్మించిన తర్వాత ఆ ఇంట్లోకి ప్రవేశించే ముందు మంచి సమయం కోసం ఎదురు చూడడం అందరికీ తెలిసిందే. కొత్తగా నిర్మించిన గృహంలోకి ఎప్పుడు ప్రవేశిస్తే మంచిదనే విషయమై వాస్తుశాస్త్రం కొన్ని సూచనలు చేస్తోంది. దీని ప్రకారం సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. అదేసమయంలో కార్తీక, మృగశిర మాసాలు మధ్యస్థ ఫలప్రదమైనవిగా వాస్తుశాస్త్రం చెబుతోంది. అలాగే నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలమని వాస్తుశాస్త్రం ఘోషిస్తోంది.ఇక రిక్త తిథులైన చవితి, నవమి, చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో చంద్రుని పూర్ణ, సప్తమి, అష్టమి, దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ, తదియలు యోగ్యమైనవని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే దక్షిణ సింహద్వారము గల గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. ఉత్తరాయణంలో మాఘమాసం, ఫాల్గుణం, వైశాఖ మాసాలు యోగ్యమైనవి. మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం మంచిది కాదని వాస్తు ఉవాచ.

దక్షిణ సింహద్వారము గల ఇంటికి సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి, షష్టి, ఏకాదశీ తిథులు మంచివి. తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి, దశమి, పూర్ణిమా తిథులు, పశ్చిమ సింహద్వార గృహానికి విదియ, సప్తమి, ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది. సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదమని అదే విధంగా ఆది, మంగళ వారాలలో గృహ ప్రవేశం అశుభప్రదం కనుక ఈ వారాలలో గృహప్రవేశం చేయకూడదని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది.

గృహంపై వీధి పోటు… వాస్తు ప్రభావం
ఇంటికి ఎదురుగా నిలువుగా వుండే వీధి ఇంటి వరకూ వచ్చి ఆగిపోయినా, లేదా అక్కడ నుండి ఏదోవైపుకు తిరిగినా దానిని వీధిపోటుగా గుర్తించాలి. ఇటువంటి వీధిపోటు వల్ల సదరు గృహస్తులకు కొన్ని మంచి ఫలితాలను, కొన్ని చెడు ఫలితాలను కలిగిస్తాయని వాస్తు చెబుతోంది. వాస్తు ప్రకారం వీధి పోటు వల్ల కలిగే ఫలితాలు కింది విధంగా ఉంటాయి.

గృహానికి తూర్పు, ఈశాన్య భాగంలో ఎదురుగా వుండే వీధి వల్ల వీధిపోటు కలుగుతుంది. ఈ రకమైన పోటు వల్ల సదరు గృహంలో నివశించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మ విశ్వాసాన్ని కలిగి వుంటారు. ఏ రంగంలో కాలు పెట్టినా పైచేయి సాధిస్తారు.

నివశించే ఇంటికి ఉత్తర – ఈశాన్య భాగంలో వీధి వున్నప్పుడు కలిగే వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలకు అన్నివిధాలా మేలు కలుగుతుంది. సుఖ సంతోషాలతో పాటు కోర్కెలు తీరి ఆనందంగా వుంటారు. ఇంటి యజమానికి మానసిక ప్రశాంతత, ధన ఆదాయం బాగుగా ఉంటుంది.

ఇంటికి ఉత్తర – వాయువ్య భాగంలో నిలువుగా వీధి వుండుట వీధి పోటు కలుగుతుంది. ఈ తరహా వీధిపోటు వల్ల ఆ ఇంట్లోని స్త్రీలు తీవ్రమైన దుష్ప్రభావానికి లోనవుతారు. పెళ్లి సంబంధాలు కుదరక పోవడం, కుదిరిన సంబంధాలు కూడా చివరివరకు వచ్చి తప్పిపోవడం, ఇంకా అనేక సమస్యలకు, చికాకులకు కలుగుతాయి.

ఇంటికి పశ్చిమ – వాయువ్యంలో వీధి వున్నప్పుడు వీధిపోటు కలుగుతుంది. దీని వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇంటి యజమాని సమాజంలో గౌరవాన్ని, పలుకుబడిని పొందుతాడు. రాజకీయ నాయకులుగా కూడా రాణిస్తారు. ధనాదాయం బాగుంటుంది.

ఇంటికి పశ్చిమ – నైరుతి భాగంలో వున్న వీధి వల్ల వీధిపోటు వస్తుంది. దీనివల్ల సదరు ఇంట్లోని వారికి శ్రమ అధికంగా వుంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదు. చేతికి అందాల్సిన డబ్బు చేజారి పోతుంది. ఆర్థిక కష్ట, నష్టాలు తప్పవు.

ఇంటికి దక్షిణ – నైరుతి భాగంలో వీధి వున్నప్పుడు వచ్చే వీధిపోటు వల్ల అనేక అశుభాలు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. ఏ పని మొదలు పెట్టినా ముందుకు సాగక పూర్తి ఇబ్బందులకు గురవుతారు.

ఇంటికి దక్షిణ – ఆగ్నేయ భాగంలో వున్న వీధి వల్ల కలిగే పోటుతో మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబం అంతా సుఖసంతోషాలతో, మానసిక ప్రశాంతతతో వుంటారు. బంధువుల ఆదరణ, శుభ కార్య నిర్వహణ వంటివి ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

పైన పేర్కొన్నవాటితోపాటు ఇంటికి తూర్పు – ఆగ్నేయంలో వీధి వుండటం కలిగే పోటు వల్ల అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంటారు. ఎన్నిరకాలుగా కష్టపడి సంపాదించినా అంతకు మించిన ఖర్చు ఏదో ఒక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక ఒత్తిడితో శ్రమపడాల్సి వుంటుంది. కుటుంబ కలహాలు మరికొంత వేదనకు గురి చేస్తాయి. ఈ విధంగా గృహానికి కలిగే వీధిపోట్ల వల్ల కొన్ని మంచి ఫలితాలు, మరి కొన్నిసార్లు చెడు ఫలితాలు కలిగే అవకాశముందని వాస్తు నిపుణులు పేర్కొంటున్నారు.
ఇంటి నిర్మాణంలో దిక్కుల ప్రాధాన్యత
ఇంటి నిర్మాణంలో దిక్కులకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాన్ని చేపట్టినప్పుడు దిక్కులను అనుసరించే ఆ ఇంటి నిర్మాణాన్ని రూపొందించడం జరుగుతుంది. ఎందుకంటే మనకున్న ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాన్ని ఒక్కో దేవత పాలిస్తుందన్నది నమ్మకం. దీన్ని అనుసరించి ఎనిమిది దిక్కుల్లో ఒక్కోదాని ప్రభావం గురించి తెలుసుకుందాం.

తూర్పు: తూర్పు దిక్కును ఇంద్రుడు పాలిస్తుంటాడు. ఇంద్రుడు సంతానం, ఐశ్వర్యాలను కలిగిస్తాడని ప్రతీతి. అందుకే తూర్పు భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. అందుకే ఈ దిక్కులోని ఖాళీ స్థలంలో బావులు, బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.

పడమర: పడమర దిక్కునకు అధిష్టాన దేవత వరుణడు. గృహ నిర్మాణ సమయంలో తూర్పు దిక్కుకంటే తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఈ దిశలో ఎత్తు ఉండేలా చేస్తే సర్వ శుభములు కలుగుతాయి. పడమర భాగంలో కూడా మంచి నీటి బావులు, బోరులు ఏర్పరచవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

ఉత్తరం: ఈ దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఉత్తరం ఉండేలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.

దక్షిణం: దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరదిశతో పోల్చినపుడు ఈ దిక్కులో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.

ఈశాన్యం: ఈ దిక్కుకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగాను, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు లేదా బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి, జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.

ఆగ్నేయం: ఈ దిక్కుకు అధి దేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు ఉండడం, ఇతర దిక్కులకంటే ఎక్కువ పల్లంగా ఉండడం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటంలాంటి అపశకునాలు కలుగుతాయి.

వాయవ్యం: వాయువ్యానికి అధిదేవత వాయువు. ఈ దిక్కు నైరుతి, ఆగ్నేయ దిశలకంటే పల్లంగానూ, ఈశాన్యంకంటే ఎత్తుగానూ ఉండాలి. అలాగే ఈ దిశలో నూతులు,గోతులు ఉండకూడదు. ఈ దిశ ఈశాన్యం కంటే హెచ్చుగా పెరిగి ఉండరాదు. ఇలా ఉంటే పుత్ర సంతానానికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.

నైరుతి: ఈ దిక్కుకు అధిదేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్ని దిక్కులకన్నా ఈ దిక్కు తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. అలాగే ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉడడం శుభం. ఈ దిక్కులో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.

పైన చెప్పిన విధంగా ఉన్న ఎనిమిది దిక్కుల అధి దేవతలను బట్టి, అందుకు అనుగుణంగా నిర్మాణాలు చేపడితే ఆ గృహం సకల ఆనందాలకు నెలవవుతుందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది.
ఇంటి కప్పు నిర్మాణంలో వాస్తు నియమాలు
గృహం నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్క అంశాన్ని వాస్తుశాస్త్రం క్షణ్ణంగా వివరించింది. ఇందులో గృహాన్ని నిర్మించే స్థలం నుంచి గృహానికి సంబంధించి ఎలా నిర్మించాలి, ఏ దిశల్లో తలుపులు, కిటికీలు ఏర్పాటు చేయాలిలాంటి ఎన్నో అంశాలను వాస్తుశాస్త్రం వివరించింది.

వీటితోపాటు గృహానికి పైన వేసే కప్పుకు సంబంధించి కూడా వాస్తుశాస్త్రం వివిధ రకాలైన జాగ్రత్తలను సూచించింది. వాస్తుశాస్త్రం ప్రకారం గృహానికి వేసే కప్పు విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆ గృహం అన్ని రకాల సంతోషాలతో విలసిల్లుతుంది. గృహానికి వేసే కప్పుకు సంబంధించి వాస్తుశాస్త్రం ప్రకారం క్రింది జాగ్రత్తలు పాటించాలి.

ఇంటి ముఖద్వారానికి ఎలాంటి గోడలు లేకుండా చూసుకోవడం. అలాగే మన ఇంటికి ఎదురుగా మరో ఇంటి పైకప్పు ఉండటం వంటివి ఉండకుండా చూసుకోవడం మంచిది.అలాగే ఓ ఖాళీ స్థలంలో గృహం నిర్మించినా, నిర్మించక పోయినా తూర్పు గోడను ఆనుకుని తూర్పు భాగంలో ఎలాంటి కట్టడమైనా నిర్మించి, దానిపై కప్పు వేయకూడదు. దీనివల్ల ఆ ఇంటిలో ఉండే పురుష సంతానం వక్ర మార్గంలో నడుచుకుంటారు.

అలాగే పశ్చిమ గోడను ఆనుకుని ఎలాంటి కట్టడం గోడనైనా నిర్మించుకోవచ్చు. ఈ దిశను వరుణ దేవుని స్థానంగా పేర్కొంటారు. అందువల్ల పాడి పంటలకు మేలు చేకూరుతుంది. ముఖ్యంగా ఈ భాగంలో పశువుల పాకను గానీ, ధాన్యపు గదులను గానీ నిర్మించుకోవడంవల్ల కలిసివస్తుంది. దీనివల్ల మంచి ధనాదాయం సమకూరుతుంది. అయితే ఈ కట్టడంపై వేసే కప్పు తూర్పు వాలుగా ఉండేలా జాగ్రత్తవహించాలి. లేకుంటే స్త్రీలకు అనారోగ్య, ఇతర సమస్యలు కలిగే అవకాశముంది.

వీటితోపాటు ఉత్తర భాగంలో ఓ కట్టడాన్ని నిర్మించి దానిపై కప్పు వేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది కుబేర స్థానం కాబట్టి దీనిని కప్పి ఉంచడం వల్ల వచ్చే సిరి సంపదలు కోల్పోతామని వాస్తుశాస్త్రం చెపుతోంది. దీనివల్ల ధనరాబడి తగ్గి అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక దక్షిణభాగంలో ఏదో ఓ కట్టడాన్ని నిర్మించి దానిపై మూత వేసి ఉంచడం మంచిది. ఎందుకంటే ఇది యమధర్మరాజు స్థానంగా పేర్కొంటారు.

దీనివల్ల ఇంటిలో నివశించే వారికి ఆయురారోగ్యాలు కలుగడమే కాకుండా ఆ కుటుంబం సుఖ శాంతులతో వర్థిల్లుతుంది. ఈ కట్టడంపై వేసే కప్పు తప్పనిసరింగా తూర్పు లేదా ఉత్తరం వైపు వాలుగా ఉండే విధంగా చూసుకోవాలి. పైన చెప్పిన విధంగా గృహానికి సంబంధించిన కప్పు విషయంలో జాగ్రత్తలు పాటిస్తే సదరు గృహంలో ఎలాంటి కష్టాలు ఎదురుకాకుండా నిత్యం సంతోషం వెల్లివిరుస్తుంది.
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పునాది వేసే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఇంటిలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించబోయే ముందు స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని త్రవ్వడం మొదలు పెట్టాలి. ఇంటికి పునాదితోనే నిర్మాణం ప్రారంభమవుతుంది… కాబట్టి వాస్తు ప్రకారం పునాది వేయటం మంచిది.

ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవతాయి. అనంతరం నైరుతీ దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్రప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కానిదే పూర్తిస్థాయిలో ఫలితాలు అందవు. ఇళ్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని సూచిస్తున్నారు. మనం నిర్మించుకున్న ఇంటి కంటే ఎత్తుగా తూర్పుదిశలో వేరొకరు ఇంటినిర్మాణం చేపడితే ఆ ఇంటికి సంబంధించిన దోషాలు మనం నిర్మించిన ఇంటిపై ప్రభావం చూపుతాయి.
ఇంటిలో వంటగది ఎక్కడ ఉండాలి?
ఇంటిలోనే వంటగది తప్పనిసరిగా ఉండాలని వాస్తురీత్యా నియమం లేదు. వాస్తుశాస్త్రాల ప్రకారం.. అగ్ని స్థానమైన ఆగ్నేయంలో వంటగది ఉండాలి. విశాలమైన ఆగ్నేయ ఆవరణ ఉన్నవాళ్లు ఉపగృహంలో వంటగది ఏర్పాటు చేసుకోవచ్చు.

ఆగ్నేయ దిశలో వంటగదిని నిర్మించుకుంటే ఆ గృహంలో అష్టైశ్వర్యాలు కొలువుంటాయని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. వంటగదిలో గ్యాస్ పొయ్యికోసం తూర్పు గోడకు వేసే ఫ్లాట్‌ఫామ్ కింద మెట్టు పెట్టకూడదు.

దక్షిణ, పశ్చిమ దిశలలో వేసే ఫ్లాట్‌ఫారం కింద మెట్లు పెట్టుకోవచ్చు. ఫ్లాట్‌ఫాణ్‌తో పాటు పెట్టే నీళ్లు సింకు పొయ్యికి వీలైనంత దూరంలో గదికి ఈశాన్యంలో పెట్టాలి. వంటగదికి రెండు కిటికీలు పెట్టడం మంచిది.
ఇంటి పునాదికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటి పునాది వేసే సమయంలో వాస్తు ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే… ఇంటిలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇల్లు నిర్మించబోయే ముందు స్థలానికి ఈశాన్య భాగంలో పునాదిని త్రవ్వడం మొదలు పెట్టాలి. ఇంటికి పునాదితోనే నిర్మాణం ప్రారంభమవుతుంది… కాబట్టి వాస్తు ప్రకారం పునాది వేయటం మంచిది.

ఈశాన్య భాగంలో పునాది తవ్వకం ప్రారంభిస్తే ఇంటి నిర్మాణ పనులు వేగంగా పూర్తవతాయి. అనంతరం నైరుతీ దిక్కును చదును చేసి పనులు ప్రారంభించుకోవాలి. వాస్తు ప్రకారం ప్రహరి గోడకు చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్రప్రకారం నిర్మించిన ప్రహరీ గోడ అనేక దోషాలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి కానిదే పూర్తిస్థాయిలో ఫలితాలు అందవు. ఇళ్లు ఎక్కువ కాలం ఉండాలంటే ప్రహరీ గోడలు తప్పనిసరిగా నిర్మించాలని సూచిస్తున్నారు. మనం నిర్మించుకున్న ఇంటి కంటే ఎత్తుగా తూర్పుదిశలో వేరొకరు ఇంటినిర్మాణం చేపడితే ఆ ఇంటికి సంబంధించిన దోషాలు మనం నిర్మించిన ఇంటిపై ప్రభావం చూపుతాయి.
చిన్న స్థలాల్లో ఇళ్లు కట్టేవారికి జాగ్రత్తలు ఇరుకైన చిన్న స్థలాల్లో ఇల్లు కట్టే వారు పాటించవలిసిన జాగ్రత్తలను భారతీయ వాస్తు శాస్త్రాలు సూచిస్తున్నాయి. విదిక్కులు తిరిగిన స్థలాలో ముఖ్యంగా తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయవ్యాలలో మెట్లు పెట్టాలనుకునే వాస్తు ప్రకారం జాగ్రత్తలు పాటించాలి. పునాదులు మొదలుపెట్టి గోడలు నిర్మించేటప్పుడు ఎన్ని కిటికీలు పెట్టాలి అన్న విషయం దగ్గర్నుంచి కిటికీలు ద్వారాలకు సరిపోయే విధంగా మార్కు చేశారా, అలమరాలు ఎలా అమరుస్తున్నారన్నదాన్ని తప్పకుండా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి.

మెట్లు మార్కింగ్ చేసేటప్పుడు ఈ విషయాలపై దృష్టి కేంద్రీకరించటం ఎంతైనా అవసరం. అలాగే శ్లాబు వేసే ముందు దాని వాటం ఎలా ఉంది… బాల్కనీలో అది ఎలా ఉందీ అన్న అంశాలను ముందుగా ప్లాన్‌లో వేసుకున్న విధంగా సరిగా ఉన్నాయో లేదో చూసుకోవటం మంచిది. గోడలు నిర్మించి అటకలు కట్టేటప్పుడు, ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ప్లాను ప్రకారం జరుగుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే విధంగా ఫ్లోరింగ్ మొదలైనప్పుడు వాటం సరిగా ఉందా లేదా అనేది చూసుకోవాలి.

ఇంట్లో నిర్మించే సెప్టిక్ ట్యాంకులు, నీళ్ల సంపుల మార్కులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత బయట అరుగులు కట్టే వారైతే వాటి మార్కింగ్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇల్లు పూర్తవుతున్న సమయంలో ప్లాను ప్రకారం అన్ని సరిపోయాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి.

పూజ గది విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 
ఇంటిలో పూజ గది ఎక్కడ ఉండాలనే విషయాన్ని కూడా భారతీయ వాస్తు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. భగవంతుడిని పూజించేందుకు గది ప్రత్యేకంగా ఉండాలా లేదా ఒక అలమరాలో పెట్టుకుంటే సరిపోతుందా అనే విషయాన్ని వారివారి అభిప్రాయాలను బట్టి మారుతుంటుంది. గృహ వైశాల్యం మీద కూడా పూజ గది నిర్మాణం ఆధారపడి ఉంటుంది. ఇల్లు పెద్దదిగా ఉన్నప్పుడు పూజగది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. చిన్నదిగా ఉండి పూజగది నిర్మించటానకి వీలులేనప్పుడు గోడలో అలమరా చేయించి పెట్టుకునే వీలుంది.పూజ చేసే గదిలో పెద్దసైజు రాతి విగ్రహాలు, లోహ విగ్రహాలు పెట్టుకోకూడదు. ఒకవేళ ఇటువంటి విగ్రహాలను పూజలో పెట్టినట్లయితే నిష్టగా పూజ చేయాల్సి ఉంటుంది. అలా చేయలేని వారు ఆ విగ్రహాలను పూజ గదిలో ఉంచుకోకపోవడం మంచిది. పూజలు జరగని విగ్రహాలు కొంతకాలానికి రుణదృవ శక్తి నిలయాలుగా మారి గృహస్తులకు హాని కలుగజేస్తాయి.

ఇదిలా ఉంటే పూజ గది వల్ల ఈశాన్యం మూతపడుకూడదు. మన రాష్ట్రంలో పూజగదులను వాయవ్యంలో నిర్మించే సంప్రదాయం ఉంది. పూజ గదిలో సిమెంటు మెట్లు పెట్టకూడదు. సిమెంటు పలకలు లేదంటే చెక్కతో చేయించిన పలకలమీద తమ ఇష్టదైవం పటాలను పెట్టుకోవాలి. ఒకే ఒక్క గదిలో నివాసం ఉన్నవారైతే గదికి ఈశాన్యంలో దేవుని పటం పెట్టుకుని కర్టెన్ ఏర్పాటు చేయాలి. ప్రార్థన చేసే విషయానికి వస్తే, తూర్పు దిశకు తిరిగి ప్రార్థన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం.

ఇంటి మెట్ల నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఇంటికి మెట్లను నిర్మించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను భారతీయ వాస్తు శాస్త్రాలు వివరించాయి. వాస్తు శాస్త్రాల ప్రకారం మెట్లను మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒకే వరుస మెట్లు అయితే వాటిని, తూర్పు నుండి పడమరకు లేదా ఉత్తరం నుండి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించుకోవాలి.రెండు వరుసలుగా మెట్ల నిర్మాణం చేపట్టేటట్టు అయితే మొదటి వరుస మెట్లను తూర్పు నుండి పడమరకు ఎక్కే విధంగానూ, రెండవ వరుస మెట్లు ఏ దిక్కుకు తిరిగివున్నా పడమర నుండి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి.

రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుసను ఉత్తరం నుండి దక్షిణం వైపు ఎక్కేవిధంగాను, రెండవ వరుసను ఎటు తిరిగినా దక్షిణం నుండి ఉత్తరం ఎక్కేవిధంగానూ నిర్మించుకోవచ్చు. మెట్లను “ఎల్” ఆకారంలో నిర్మించాలనుకునే వారు తూర్పు నుండి పడమరకు లేదా ఉత్తరం నుండి దక్షిణానికి నిర్మించుకోవచ్చు.
స్నానపు గదులకు పాటించాల్సిన వాస్తు సూత్రాలు ఇంటిలో పడకగదులనుబట్టి అటాచ్డ్ బాత్రూమ్స్, లెట్రిన్స్ వాస్తు రీత్యా ఏర్పాటు చేసుకోవాల్సివుంది. వాస్తు రీత్యా కాకుండా ఎలా పడితే అలా నిర్మంచుకోవడం వలన చెడు ఫలితాలు ఉంటాయి. ఇంటినంతా వాస్తు రీత్యా నిర్మించి వీటి విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే చెడు ఫలితాలే కలుగుతాయి. నైరుతీ మూలలో పడక గది, దానికి తూర్పువైపున దక్షిణపు గోడకు ఆనుకొని బాత్రూమ్ ఉండేటట్లుగా నిర్మించుకోవాలని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇందులో లెట్రిన్ పాట్‌ను దక్షిణగోడకు ఆనించి కనీసం ఒక అడుగైనా ఎత్తు ఉండేలా నిర్మించాలి. దక్షిణంవైపు గోడకే వెంటిలేటర్‌ను కూడా అమర్చుకోవాలి. బాత్‌రూమ్ తలుపును బాత్రూమ్ పశ్చిమ లేదా వాయువ్యంలో ఉంచాలి. నైరుతీ మూలన రెండు పడకగదులు, వాటికి ఆనుకొని బాత్రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు… నైరుతిలో ఒక పడక గదిని కట్టి, దాని తూర్పు వైపున రెండు బాత్రూమ్స్ నిర్మించుకోవాలి. రెండోవ బాత్రూమ్‌ను ఆనుకొని తూర్పు వైపున మరొక పడకగదిని నిర్మించుకోవచ్చు.

పడకగది విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
 
ఇళ్లు, అందులో గదుల నిర్మాణానికి వాస్తు సూత్రాలు ఉన్నట్టే, పడక గది విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు పాటించాలని భారతీయు వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. పడక గది విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. పడకగదిలో మంచాన్ని మన ఇష్టం వచ్చినట్లు ఏర్పాటు చేసుకోకూడదు. ఇది శారీరక, మానసిక సమస్యలుకు దారి తీయవచ్చు.పడకగది తలుపుకు ఎదురుగా మంచం ఉండకుండా చూసుకోవాలి. మంచం తలుపులతోపాటు, కిటికీలకు కూడా ఎదురుగా ఉండరాదు. అద్దాన్ని, డ్రెస్సింగ్ టేబుల్‌ మంచానికి తలపైపు లేదా కాళ్లవైపు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాకుండా బెడ్‌రూమ్‌లో అనవసరమైన చెత్త ఉంచకూడదు. పెట్టెలు, పుస్తకాలు, ఉపయోగపడని గృహోపకరణాలను కూడా పడకగదిలో ఉండకుండా చూసుకోవాలి.

ఇంటికి వెలుపలి భాగంలో మెట్లు నిర్మించాలనుకునేవారు ఈశాన్య, వాయవ్య, నైరుతి, ఆగ్నేయాల్లో ఏ భాగంలోనైనా వీటి నిర్మాణం చేపట్టవచ్చు. ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తర- ఈశాన్యాలవైపు నిర్మించుకోవచ్చు. ఈశాన్యంవైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి.
నిద్ర లేవగానే ఎటువైపు నడవాలి? భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం పక్కమీద నుండి దిగగానే తూర్పువైపుకు కొంచెం నడక సాగించటం మంచిది. దీనివలన తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. నిద్రలేవగానే ఉత్తర దిశను చూడటం వలన కుబేర స్థానాన్ని చూసినట్లవుతుంది. దీనివలన ఆదాయార్జన మెరుగుపడుతుంది.

ఇంటిలో తూర్పు దిశగా ఉండే గోడలో దేవుని గూడు ఉండేలా చూసుకోవడం వలన మేలు జరుగుతుంది. ఈశాన్య మూలలో దేవుని మందిరాలు లేకుండా చూసుకోవాలని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటిని ఊడ్చేటప్పుడు ఈశాన్య దిశలో ప్రారంభించి నైరుతీ వైపున చెత్తను ప్రోగు చేయండి. ఈశాన్య దిశలో చెత్త తీసుకురాకూడదు.
దిశల ఆధారంగా గృహ నిర్మాణము ఇంటిని నిర్మించే సమయంలో దిశలు, వాటి ఫలితాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్ర ప్రకారం దిశల ఫలితాలను తెలుసుకుని ఇళ్లను నిర్మిస్తే విజయాలు వెన్నంటే ఉంటాయి. ఏయే దిశలలో ఇళ్లను నిర్మిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.

తూర్పు దిశలో ధ్వజాయమునకు సంబంధించిన ఇళ్లను నిర్మించవచ్చు. అ అక్షరముతో పేర్లు ప్రారంభమయ్యే వారికి ఈ ధ్వజాయము చాలా మంచిది. తూర్పులో సింహద్వారము ఏర్పాటు చేసుకోవడం కూడా శుభప్రదమే. అలాగే ధ్వజాయము కలిగిన ఇళ్లకు దక్షిణ – పశ్చిమ, ఉత్తర దిశలలో తూర్పువైపు సింహద్వారమును ఏర్పాటు చేసుకుని నిర్మించుకోవచ్చు.

ఈ ఆయమునకు పశ్చిమ దిశ శత్రువైనప్పటికీ, దోషము ఉండదని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ధ్వజాయ ఇళ్లలో నివసించే వారికి ఆయువు, ధనము, కీర్తి, వంశవృద్ధి తదితరాలు కలుగుతాయి. అలాగే ఆగ్నేయ దిశలో ఏ ఆయములు కలిగిన ఇళ్లను నిర్మించకూడదు.

క అక్షరముతో పేర్లు ప్రారంభమయ్యే వారు ధ్వజ, గజాయ ఇళ్లను కట్టుకోవడం మంచిది. అలాగే వీళ్లకు తూర్పు, ఉత్తర దిశలు శుభదిశలుగా ఉన్నాయని వాస్తు పరిశీలకులు అంటున్నారు.
గృహ నిర్మాణం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గృహ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను భారతీయ వాస్తు శాస్త్రాలు సవివరంగా తెలియపరుస్తున్నాయి. ఇంటి నిర్మాణ సమయంలో తగు జాగ్రత్తలు పాటిస్తే, నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి అవుతుంది.

తాపీ మేస్త్రి నిర్మాణానికి దిగేముందు మూలమట్టాన్ని ముందుగా నైరుతీ దిశలో ఉంచాలి. ఆ తరువాతే ఇతర దిక్కుల్లో మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులు చేసుకునేటప్పుడు ఇతర మూలల కంటే, ఈశాన్యం కొద్దిగా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఇంటి పునాదులు తీసేటప్పుడు ముందుగా ఈశాన్యం మూల నుంచి ప్రారంభించాలి. అయితే కట్టడాన్ని మాత్రం నైరుతీ దిశ నుంచి ప్రారంభించాలి. హద్దులను బట్టి ముందుగా ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలి. పశ్చిమ-నైరుతీ దిశలో కొంత ఎత్తైన గోడ నిర్మించి, ఆ తరువాత ఇంటి నిర్మాణం మొదలుపెట్టాలి.

ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తు సామాగ్రిని నైరుతీ, పశ్చిమ, దక్షిణ భాగాల్లో మాత్రమే జాగ్రత్త చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య భాగంలో మాత్రం ఉంచకూడదు. గోడల నిర్మాణంలో ఏ రోజుకారోజు దక్షిణ-పశ్చిమ గోడలను తూర్పు, ఉత్తర గోడల కంటే కొంచెం ఎత్తుగా ఉండేటట్లు చూసుకోవాలి.

గృహ నిర్మాణానికి ఎటువంటి స్థలాలు పనికిరావు?
భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం నాలుగు భుజముల్లో హెచ్చుతగ్గులు ఉన్న స్థలాలను ఇంటి నిర్మాణానికి ఎంచుకోకూడదు. నాలుగు భుజాల కంటే ఎక్కువ భుజాలు కలిగివున్న స్థలంలో ఇంటి నిర్మాణం చెపట్టడం వలన అశుభాలు కలుగుతాయని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. చేట ఆకారంలో ఉన్న స్థలాలు కూడా ఇళ్ల నిర్మాణానికి మంచివి కాదు.ఇటువంటి స్థలాల్లో ఇంటి నిర్మాణం వలన ఆర్జించిన సంపద చేతిలో నిలవదు. ఈ పరిస్థితి క్రమంగా దారిద్ర్యానికి దారితీస్తుంది. నిరంతరం మానసిక అశాంతికి గురవుతారు. స్థలం పొడవు ఎక్కువగా ఉండి, భుజములు హెచ్చుతగ్గులుగా ఉండే స్థలం కూడా గృహ నిర్మాణానికి అననుకూలం. ఇటువంటి స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని జరగడంతోపాటు, అనారోగ్యం బారిన పడుతుంటారు.

విసన కర్ర ఆకారం, లాగుడు బండి ఆకారం, డమరుకం, కుంభాకార, మద్దెలు, అర్ధ చంద్రాకారంలో ఉండే స్థలాలు కూడా ఇళ్లు నిర్మాణానికి పనికిరావని వాస్తు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటువంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణం వలన ఆర్థిక పతనం, సుఖశాంతులు లోపించడం, భాగస్వాముల మధ్య వివాదాలు, దోపీడీలు వంటి దుష్పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.

 

వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో చెట్ల పెంపకం సాధారణంగా ఇంటి ఆవరణలో పచ్చదనం, అందం కోసం చెట్లను పెంచుకుంటాం. గృహానికి చెట్లు అందంతో పాటు చల్లని గాలిని కూడా ఇస్తాయి. అయితే వృక్షాలను పెంచే సమయంలో కొన్ని కట్టుబాట్లను పాటిస్తే సంతోషమయ జీవితాన్ని ఆస్వాదించవచ్చు.

గృహానికి తూర్పు వైపున రావిచెట్టు, దక్షిణ దిశలో జువ్వి చెట్టు, పశ్చిమ దిశలో మర్రిచెట్టు, ఉత్తర దిశలో మేడి చెట్లు ఉండకూడదు. అలా ఉన్న పక్షంలో ఆ చెట్ల భారం ఇంటిమీద పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే పైన చెప్పిన విధంగా నాలుగు దిశలలో వరుసగా వేప, మామిడి, అరటి చెట్లు కూడా ఉండరాదని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఇంటికి వాయువ్య దిశలో ముళ్ల చెట్లు, ఈశాన్య దిశలో అరటిచెట్లు ఉండరాదు. అలాగే దక్షిణ దిశలో మందిరాలు, మఠాలు, పశ్చిమ దిశలో జలాశయాలు, ఉత్తర దిశలో పెద్ద చెరువులు ఉండరాదు. ఇవి ఉన్నచో గృహములో ఎల్లప్పుడూ బాధలు, కష్టనష్టాలు ఏర్పడతాయని వాస్తు పరిశీలకులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం గృహములో ద్వారముల నిర్మాణం : 
 
గృహాన్ని నిర్మించే సమయంలో సింహద్వారాన్ని ఏ విధంగా వాస్తు ప్రకారం నిర్మిస్తామో, అదే విధంగా ఇతర ద్వారాలను కూడా నిర్మించాలి. దీనికి సంబంధించిన కొన్ని సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం.గృహానికి ముందు భాగంలో ఉన్న పశ్చిమనైరుతి గదికి పైభాగంలో ద్వారము కలిగి ఉండుట ద్వారా ఆ ఇంట్లో శుభాలు జరుగుతాయి. క్రింద భాగములో ద్వారములను నిర్మించుట ద్వారా రోగము- మరణములు సంభవించును. గృహములోని ముందుభాగములో దక్షిణ ఆగ్నేయ గదికి ఎగువ భాగములో ద్వారం నిర్మించి ఉన్నట్టయితే ఇంట్లోని పిల్లలకు అశుభం.

గృహానికి బైట ఉండే ఉత్తర వాయువ్య గదికి పైభాగమున ద్వారము నిర్మించినచో ఆ ఇంట్లోని వారు చేసే మంచి పనులతో కీర్తి ప్రతిష్టలు లభించును. గృహమునకు ముందుభాగములో తూర్పు- ఈశాన్య గదికి పైభాగములో ద్వారమును నిర్మిస్తే సద్గుణాలు లభించడమే కాక భోగభాగ్యాలు కూడా కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాస్తు ప్రకారం గోడల నిర్మాణం : 
 
కొత్తగా నిర్మించిన గృహములలో దిక్కులు, మూలలను సరిచూసుకోవడంతో బాటు గోడలు వాటి ఆకృతులను కూడా పరీక్షించుకోవాలి. గృహం నిర్మించే క్రమంలో గోడల స్థానములను కూడా పరిగణలోకి తీసుకోవాలి.ఇంటికి సంబంధించిన దక్షిణ దిశయందలి గోడ వెలుపలికి వంగిపోయి ఉంటే వ్యాధులు, మృత్యువు వెన్నంటి ఉంటుంది. అలాగే పై విధంగా పశ్చమదిశలో గోట బయటకు వంగి ఉంటే ధనహాని కలుగుతుంది. తూర్పు గోడ బయటకు వంగి ఉంటే అరెస్టులు తదితర భయాలు ఉంటాయి.

ఇంటిలోని ఆగ్నేయ మూలలో తూర్పు గోడ వెలుపలకు వంగి ఉంటే అగ్నిభయము, దక్షిణమునకు వంగితే ప్రాణభయము సంభవించే అవకాశం ఉంది. వాస్తు శాస్త్ర ప్రకారం గోడలను నిర్మిస్తే గృహంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

వాస్తు ప్రకారం స్టడీ రూమ్ నిర్మాణం : 
 
మన జీవితంలో ముఖ్యమైనది విద్య. ఈ విద్యనభ్యసించడానికి అందరూ ఎంతో కష్టపడుతుంటారు. విజయం లాగానే ఇది అందరినీ వరించదన్న విషయం మనకు కూడా తెలుసు. ఏ దిశలో కూర్చుని చదివితే చదువు బాగా వస్తుంది? ఎటు వైపు స్టడీ టేబుల్‌ను ఏర్పాటు చేయాలో వంటి విషయాల గురించి మనం తెలుసుకుందాం.స్టడీ రూమ్‌లో ముఖాన్ని చూసే అద్దాలు, అక్వారియం వంటి వాటిని పెట్టకూడదు. దీని ద్వారా మనసు వాటిపైకి మళ్లి ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఈ గదిలో సూర్యకాంతి నేరుగా వచ్చి పడేలాగా ఉండకూడదు. ఎందుకంటే అధికంగా సూర్యకాంతి రావడం వల్ల కూడా మనసు ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. దీనితో పాటు మదిలో చికాకులు ఏర్పడతాయి. చదువుకోవడానికి సరిపడినంత కాంతి ఉండేలా చూసుకోవాలి.

తూర్పు వైపు ముఖం పెట్టి చదివితే, చదివిన విషయం మనసులో అలానే హత్తుకుపోతుంది. దీనితో పాటు కాసేపు అలా పచ్చదనాన్ని ఆస్వాదించే విధంగా గదిలో పచ్చని చెట్లను అమర్చుకోవాలి. అలసిన కళ్లను పచ్చదనం సేదదీరుస్తుంది. స్టడీ రూమ్‌ను ఈ తరహాలో రూపొందిస్తే చదివిన ఏ విషయమైనా చక్కగా అర్థమయి చక్కని ఫలితాలు సాధించవచ్చని వాస్తు శాస్త్రజ్ఞులు తెలిపారు.

కిటికీల అమరిక కోసం వాస్తు విజ్ఞానం : 
 
కొత్తగా నిర్మించే గృహంలో బావులు త్రవ్వడం, గదులు నిర్మించడం, ద్వారాలను అమర్చడం తదితర అంశాలతో పాటు కిటికీల అమరిక కూడా ఓ ప్రధానాంశం. ఎందుకంటే కిటికీల ద్వారానే గృహంలోకి గాలి వెలుతురులు ప్రవేశిస్తాయి కాబట్టి. ఈ కిటికీల అమరికలో కూడా వాస్తు పరిజ్ఞానం చాలా అవసరం.వాస్తు రీత్యా కిటికీలను ఎలా అమర్చాలో తెలుసుకుందాం. ఉత్తరం వైపు ముఖం ఈశాన్య ద్వారం ఉన్నట్టైతే, దానికి పడమర దిశగా కిటికీలను అమర్చాలి. అలాగే గృహంలో తూర్పు వైపు ముఖం ఉన్న ఈశాన్య ద్వారమో, పడమర వైపు ముఖం ఉన్న వాయువ్య ద్వారమో ఉన్నట్లైతే వాటికి దక్షిణం వైపు కిటికీలను అమర్చాలి.

అలాగే దక్షిణం వైపు ముఖం ఉన్న ఆగ్నేయ ద్వారం ఉన్నట్లైతే కూడా ఆ ద్వారానికి దక్షిణం వైపున కిటికీలను అమర్చుకోవాలని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు.

ఇంటి నిర్మాణంలో బావి త్రవ్వకం : 
 
ప్రస్తుత ఉరుకుల, పరుగుల కాలంలో బావితో కూడిన ఇళ్లు వెతికి చూసినా కరువే. అయితే ఇంటి నిర్మాణంలో బావులు ఓ ముఖ్యాంశం. గృహంలో బావి త్రవ్వించే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకుంటే సుఖసంతోషాలు మీ సొంతమవుతాయి.మీ గృహం నిర్మించే స్థలములో బావిని ముందుగానే త్రవ్వుకోవాలి. ఎందుకంటే గృహ నిర్మాణానికి కావలసిన నీటిని ఇందులోంచే వాడుకోవచ్చు. అలాగే ఎక్కడంటే అక్కడ కాకుండా ఈశాన్యంలో బావి ఉండడం చాలా మంచిదని వాస్తు విజ్ఞానులు చెప్తున్నారు. మీ స్థలములో తూర్పు-ఈశాన్యములో బావిని త్రవ్వడంచే గృహంలో సకల శుభాలు కలుగుతాయి.

అలాగే ఉత్తర-ఈశాన్యంలో బావిని త్రవ్వడం ద్వారా ధనాదాయం బాగా ఉంటుంది. కుటుంబంలో ఎటువంటి చికాకులు ఉండవు. సుఖసంతోషాలతో పాటు పిల్లలు కూడా ప్రయోజకులవుతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు మెరుగుపడతాయి. కనుక ప్రస్తుత కాలంలో బావులతో కూడిన ఇళ్లు నిర్మించడం కష్టమైనప్పటికీ, వీలైనంత వరకు బావులను త్రవ్వించేందుకు ప్రయత్నించాలి.

దుకాణాలకు వాస్తు విజ్ఞానం : 
 
ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు, గదులు వాస్తు రీత్యా ఉన్నాయా లేవా అన్నది ముఖ్యం. ఎందుకంటే వాస్తు రీత్యా నిర్మించిన దుకాణాలలో వ్యాపారం బాగా జరిగి లాభాలు వస్తాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు.ఈ ప్రకారంగా చూస్తే తూర్పు వైపు ముఖం ఉన్న దుకాణంలో నేలమట్టం పడమర వైపు కాస్త ఎక్కువగానూ, తూర్పు వైపు కాస్త తక్కువగానూ ఉండాలి. అలాగే గల్లా పెట్టె వద్ద కూర్చునే వారు ఆగ్నేయ దిశలో ఉత్తరం వైపు కూర్చోవాలి. ఆ వ్యక్తి ఎడమ చేతి వైపున గల్లా పెట్టే ఉండేటట్టు చూసుకోవాలి.

అలాగే ఆగ్నేయ దిశలో గల్లా పెట్టె వద్ద కూర్చునే వారు తూర్పు వైపు ముఖం పెట్టి కూర్చునట్లైతే, పెట్టెను ఆ వ్యక్తి కుడివైపుగా ఉండేటట్టు చూసుకోవాలి. పైన చెప్పిన దిశలలో దుకాణాల్లోని వ్యక్తులు కూర్చునట్లైతే ఆ వ్యాపారం వాడీవేడీగా సాగుతుందని, చక్కని లాభాలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
ఉత్తర దిశ నిద్రతో పీడకలలు ప్రతి ఒక్కరికి నిద్ర ఎంతో ముఖ్యమైన అవసరం. ఎందుకంటే ఒక్కరోజు నిద్ర కరువైనా మనిషి శారీరకంగా, మానసికంగా ఎంత చికాకుకు గురవుతాడో అందరికి అనుభవమే. అందుకే సుఖమైన నిద్రకు అనువైన ప్రదేశం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అదేసమయంలో నిద్రపోతున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు రాకూడదని కూడా అందురూ కోరుకునేదే.

అయితే కొన్ని దిశల్లో తలపెట్టి పడుకుంటే మంచి నిద్ర మాట అటుంచి చెడ్డ కలలు వచ్చే అవకాశముందని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. వాస్తుశాస్త్రం వద్దని చెప్పే దిశల్లో ఉత్తరదిశ ముఖ్యమైనది. ఉత్తరదిశలో తల పెట్టి నిద్రిస్తే పీడకలలు వస్తాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.

వాస్తుశాస్త్రం ఇంకా ఏం చెబుతోందంటే ఉత్తరదిశలో తలపెట్టి నిద్రిస్తే రోగాలు భాదించే అవకాశముందని కూడా చెబుతోంది. అలాగే మనస్సులోని నిమ్మతి, నమ్మకం లాంటివి పోయి వాటి స్థానంలో భయం, అభద్రతాబావం చోటు చేసుకుంటుందని వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. కాబట్టి ఉత్తరదిశలో తలపెట్టి నిద్రించే అలవాటుకు స్వస్తి చెప్పాలని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు

తూర్పు దిశలో నిద్ర జ్ఞానానికి మార్గం : 
ఇంటి నిర్మాణంలో గదుల నిర్మాణాన్ని ఏ దిక్కులో నిర్మించాలో తెలిపే వాస్తు శాస్త్రం పడకగదిని ఏ దిశలో నిర్మించాలో కూడా చెప్పిన విషయం గురించి తెలుసుకున్నాం. అయితే ఆయా గదుల్లో నిద్రించే సమయంలో ఏ వైపుగా తలపెట్టి నిద్రించాలో కూడా వాస్తు శాస్త్రం చేబుతోంది.వాస్తు శాస్త్రం ప్రకారం నిర్ధేశిత దిశల్లో నిద్రించడం ద్వారా సుఖప్రదమైన నిద్ర లభిస్తుంది. అలాగే జీవితంలో కొన్ని అధ్బుత సంఘటనలు సైతం జరిగే అవకాశమున్నట్టు వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. వీరి సలహా ప్రకారం గదిలోని తూర్పు దిశగా తలపెట్టి నిద్రిస్తే అట్టి వారిలో జ్ఞానసంపద వికసిస్తుందని తెలుస్తోంది.

అలాగే వీరిలో ఆధ్యాత్మిక చింతన సైతం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తూర్పు దిశగా తలపెట్టి నిద్రించడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరిగుతుందని వారు అంటున్నారు. ఇట్టి పిల్లలు వారి చదువులో అందరికన్నా ముందుండడం జరుగుతుందని కూడా వారు చెబుతున్నారు.

తూర్పు దిశగా తలపెట్టి నిద్రించే వారికి ఆరోగ్య సమస్యలు సైతం దరిచేరవని వాస్తు విజ్ఞానుల ఉవాచ. తద్వారా వీరు మంచి ఆరోగ్యంతో కులాసాగా ఉంటారని వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

సుఖశాంతులను దరిచేర్చే దక్షిణ దిశ నిద్ర : 
నివశించే గృహంలోని వివిధ గదులు ఉండాల్సిన దిక్కులు గురించి వాస్తు నిపుణులు అనేక రకాల జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు. అలాగే మనం నిద్రించే గదిలో ఏ దిక్కులో పడుకుంటే శుభప్రదంగా ఉంటుందో కూడా వాస్తు శాస్త్రం వివరిస్తోందని వారు చెబుతున్నారు.వాస్తు శాస్త్ర రీత్యా మనం నిద్రకు ఉపక్రమించే సమయంలో మన తల దక్షిణ దిశగా ఉండాలని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. ఎందుకంటే మిగిలిన దిశల కన్నా దక్షిణ దిశలో తల ఉంచి నిద్రించడం వల్ల అనేక రకాలుగా మనకు మంచి జరుగుతుందని వారు విశ్వసిస్తున్నారు.

దక్షిణ దిశగా నిద్రించడం వల్ల ఆ వ్యక్తి జీవితంలో సంతోషకరమైన సంఘటనలు ఒకదాని వెంట ఒకటి జరిగి అతని జీవితం సంతోషమయంగా ఉంటుదని వారు చెబుతున్నారు. అలాగే దక్షిణ దిశగా నిద్రించడం వల్ల ఆ వ్యక్తి ఆరోగ్యం సైతం చక్కగా ఉండి ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవని కూడా వారు స్పష్టం చేస్తున్నారు.

దక్షిణ దిశగా నిద్రించడం వల్ల అనేక లాభాలు చేకూరడమే గాక చక్కటి నిద్ర సైతం మనకు లభిస్తుందని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు.

తూర్పు దిశలో నిద్రిస్తే ధనలక్ష్మి దూరమైనట్టే…..!
ఇంటి నిర్మాణంలో గదులు నిర్మించేటప్పుడు వాస్తు శాస్త్ర రీత్యా నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఆ ఇంటిలో నివశించే వారికి అన్ని రకాల సౌఖ్యాలతో ఆ కుటుంబం వర్ధిల్లుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.అలా కాక మన ఇష్టం వచ్చినట్టు నిర్మాణాన్ని చేపట్టడం, అలాంటి ఇంటిలో గదులను వాస్తు నిపుణులు ఆలోచన లేకుండా ఉపయోగించడం వల్ల కష్టాలను కోరి తెచ్చుకున్నట్టేనని వాస్తులో తల పండిన వారు చెబుతున్నారు.

వీరి సలహా ప్రకారం నివశించే ఇంటిలో పడకగదిని కొన్ని దిశల్లో ఏర్పాటు చేయరాదని చెబుతున్నారు. అందులో ముఖ్యమైనది తూర్పు దిశ. ఈ దిశలో ఏర్పాటు చేసిన పడకగదిలో నిద్రిస్తే ఆ కుటుంబంలో వారి ఆర్ధిక పరిస్థితి క్రమేపీ క్షీణిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

అలాగే కుటుంబ యజమాని ఆరోగ్యం సైతం దెబ్బతినే అవకాశముందని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు. అందువల్ల తూర్పు దిశలో ఉన్న గదులను పడకగదులుగా ఉపయోగించకపోవడమే మేలని వాస్తు విజ్ఞానులు పేర్కొంటున్నారు.

గృహ ఆవరణలో మరుగుదొడ్లు నిర్మాణం : 
 
గృహ ఆవరణలో మరుగుదొడ్లు పైకప్పు శ్లాబుతో లేదా వేరే విధంగా అంటే సిమ్మెంటు రేకులు వంటి వాటిని ఉపయోగించి వాలుగా కూడా వేసుకోవచ్చు. శ్లాబు వేసినట్లయితే, నైరుతి నుంచి ఈశాన్యానికి వాటంవచ్చేటట్లు పెట్టాలి. వాలుపైకప్పు వేసినట్లయితే తూర్పు లేదా ఉత్తరం దిశన వాలు వచ్చేటట్లు వేయాలి.టాయ్‌లెట్ పైకప్పు ప్రధాన గృహానికి కానీ, మెట్లకు గానీ తగలకూడదు. లెట్రిన్, బాత్‌రూము కలిపి ఒక గదిలో పెట్టవలసి వచ్చినట్లయితే, ఆ గదిలో లెట్రిన్‌బేసిన్‌ను పశ్చిమ లేదా దక్షిణానికి ఉంచి, తూర్పు లేదా ఉత్తరంలో బాత్‌రూం కట్టాలి.

టాయ్‌లెట్‌కి ద్వారాలు పైభాగంలో వచ్చేటట్లు బిగించాలి. గృహానికి ద్వారాలు, కిటికీలు పెట్టటానికి పాటించే నియమాలే ఇక్కడ కూడా పాటించాలి. లెట్రిన్‌బేసిన్‌ను ఉత్తర లేదా దక్షిణ ముఖం వచ్చే విధంగా అమర్చుకోవాలి. లెట్రిన్‌ నుంచి గొట్టాల సాయంతో సెప్టిక్ ట్యాంకుకు కలపాలి.

చిక్కులు తెచ్చి పెట్టే వాయువ్యంలో పడకగది : 
 
ప్రతి ఇంటికి పడకగది ఎంతో ప్రధానమైంది. ఎందుకంటే అలిసిన మనిషికి సేదతీర్చే ప్రదేశం అదే కాబట్టి. కానీ పడకగదిని వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోకపోతే చిక్కులు కొనితెచ్చుకున్నట్టేనని వాస్తుశాస్త్ర ప్రముఖులు చెబుతున్నారు.ముఖ్యంగా కొన్ని దిక్కుల్లో పడకగదిని ఏర్పాటు చేయరాదని వాస్తు శాస్త్రం ఘోషిస్తోంది. ఇందులో వాయువ్య దిశ అతి ముఖ్యమైనది. ఈ దిశలో నిద్రిస్తే అనవసరమైన చిక్కులు కొనితెచ్చుకునే ప్రమాదముందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

వాయువ్యంలో ఏర్పాటు చేసిన పడకగదిలో కుటుంబంలోని దంపతులు నిద్రించినట్టయితే వారి మధ్య లేనిపోని గొడవలు వచ్చి చేరుతాయని వాస్తు విజ్ఞానులు చెబుతున్నారు.

ఒకవేళ వాయువ్యంలో పడకగది ఉన్నట్టైతే దానిని పిల్లల కోసం ఉపయోగించడమో లేక గెస్ట్ రూంగా ఉపయోగించడమో మంచిదని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు.

నివశించే గృహంలో తలుపుల సంఖ్య: సంభవించే ఫలితాలు :
 
 
మనం నివశించే గృహంలో తలుపులు ప్రధానమైనవి. తలుపులన్నవి కేవలం గదులకు రక్షణ ఇచ్చేవి మాత్రమే కాదని, గృహంలో నివశించే వారి వివిధ స్థితిగతులు తలుపుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని వాస్తు శాస్త్రం తెలుపుతోంది.నివాసముంటున్న గృహానికి కనీసం రెండు తలుపులుంటే అట్టి ఇంటిలో నివశించే వారికి అన్ని రకాలుగాను మంచి ఫలితాలు సంభవించగలదని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది. అలాగే నాలుగు తలుపులు ఉన్న ఇంటిలో నివశించే కుటుంబంలోని సభ్యలకు ఆయుష్షు పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

కానీ మూడు తలుపులున్న ఇంటిలో మాత్రం ఎప్పుడూ గొడవలు సాగుతూ కొత్త శత్రువులు ఏర్పడే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం తెలుపుతోంది. ఐదు తలుపులున్న ఇంటిలో ఉండేవారు నిత్యం ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమౌతుంటారని వాస్తు నిపుణులు అంటున్నారు.

ఇక ఆరు తలుపులున్న ఇంటిలో కాపురముండే వారికి సంతాన సాఫల్యం ఎక్కువగా ఉంటుందని వాస్తు శాస్త్రం వివరిస్తోంది. ఏడు తలుపులున్న ఇంటివారికి అపాయాలు వెతుక్కుంటూ వస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎనిమిది తలుపులున్న ఇంటివారికి పట్టిందల్లా బంగారమేనట, వీరికి సౌభాగ్యం వెతుక్కుంటూ వస్తుందని వాస్తు శాస్త్రం పేర్కొంటోంది.

తొమ్మిది తలుపులుంటే రోగాలు పీడిస్తాయని, పది తలుపులుంటే ఇంటిలో దొంగలు పడే అవకాశముందని వాస్తు శాస్త్రం స్పష్టం చేస్తోంది.

గృహ ఆవరణలో మట్టి నింపవచ్చా : 
 
గృహం బయట, కాంపౌండు లోపల గల భాగాన్ని గృహావరణం అంటాం. గృహ ఆవరణలో మట్టి నింపేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. నింపే మట్టి లేదా కంకరు శ్రేష్టమైనదై ఉండాలి. పాడుమట్టి, పాత ఇళ్ళ మట్టి, డెబ్రనిస్ వేయకూడదు.గృహ ఆవరణలో మట్టి నైరుతి నుంచి ఆగ్నేయం వరకు మరియు నైరుతి నుంచి వాయువ్యం వరకు నింపి ఆ తర్వాత ఆగ్నేయం నుంచి ఈశాన్యం వరకు, వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు నింపి, ఆ తర్వాత బాగా నీరు పెట్టి నైరుతిలో మొదలుపెట్టి ఇదే క్రమంలో గలాయింపు చేయవలెను. మట్టి లూజు లేకుండా బాగా దిగటం, గట్టి పడటం వాస్తురీత్యా చాలా మంచిది.

గృహ నిర్మాణ పర్యవేక్షణలో జాగ్రతలు : 
 
నూతన గృహ నిర్మాణ సమయంలో పర్యవేక్షణ తప్పనిసరి. ఎందుకంటే కాంట్రాక్టర్ మనకు బాగా కావలసినతను అయినప్పటికీ సూపర్‌వైరజర్, తాపీ మేస్త్రీ, పని చేసే కూలీలు తెలిసో, తెలియకో కొన్ని అవకతవకలకు పాల్పడవచ్చు. వీటి నుంచి నష్టపోకుండా జాగ్రతలు పాటించడం ఎంతైనా అవసరం. అయితే ఈ విధంగా పర్యవేక్షించదలచిన యజమాని కొన్ని జాగ్రత్తలు పాటిండం మంచిది.గృహ నిర్మణ సమయంలో అక్కడ జరుగుతున్న పనిని బట్టి యజమాని కొన్ని నిమిషాల నుంచి రోజంతా ఆ స్థలంలో గడపవలసి వస్తుంది. గృహపర్యవేక్షణకు సంబంధించి రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. అందులో మొదటిది ఎక్కడ ఉండాలి రెండవది ఎటు చూస్తూ ఉండాలి.

గృహ నిర్మాణ స్థలం ఏ సింహద్వారం అయినా, ఎటుప్రక్క రోడ్డు ఉన్నా, గృహ నిర్మాణ స్థలానికి దక్షిణం, నైరుతి, పశ్చిమం ఈ మూడు దిశలలో అక్కడ అవసరాన్ని బట్టి ఏదో ఒక దిశన ఉంటూ తూర్పు, ఈశాన్యం, ఉత్తరం ఈ మూడింటిలో ఏదో ఒక దిశను చూస్తూ పర్యవేక్షించాలి.

గృహ నిర్మాణం: భూమి పూజ ప్రాముఖ్యం : 
 
గృహ నిర్మాణం సమయంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటి భూమి పూజ. దీనినే కొందరు శంకుస్థాపన అని కూడా అంటారు. మన పంచభూతాల సమన్వయంతో నిర్మించ తలపెట్టిన గృహ నిర్మాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చిరకాలం ఈ భూమిపై నిలవాలనే ఆకాంక్షతో భూదేవిని ప్రార్థిస్తూ చేసే పూజే భూమి పూజ.ఈ గృహారంభ పూజా కార్యక్రమం జరపటానికి ముందుగా ఈశాన్యం దిశలో గుంతని త్రవ్వించాలి. శంఖుస్థాపన సమయంలో మనం ఉపయోగించే పూజా ద్రవ్యాలు, నవధాన్యాలు వగైరా గృహం లోపలకు వచ్చే విధంగా చూడాలి.

అంటే ఆ తీసిన గుంత మధ్యలో లేదా ఇంకొంచెం లోపలకు ఉండే విధంగా పాతి పెట్టాలి. గృహారంభం ఈశాన్యంలోనే చెయ్యాలని, వేరే చోట్ల చెయ్యకూడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

గృహ నిర్మాణం సమయంలో వాయిదా వేయరాని పనులు : 
 
ఇల్లు కట్టిచూడు… పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ఎంతటి ధనవంతుడైనా ఇల్లు కట్టే సమయంలో ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కాదు. అన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఇంటి నిర్మాణాన్ని సవ్యంగా సాగించినా. చివరికి కొన్ని పనులను అలానే వెనుకబడిపోతాయి. దీంతో కొన్ని పనులను వాయిదా వేస్తాము. అలా కాక ఎటువంటి పనులకు వాయిదా వేయవచ్చు, ఏఏ పనులను వాయిదా వేయకూడదు అనే విషయం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. అందుకు కొన్ని చిట్కాలు…గృహం నిర్మించి కాంపౌండు గోడలు కట్టకుండా ఆపకూడదు. గృహ ఆవరణలో మట్టి నింపేపని అసంపూర్ణముగా వదలరాదు. గృహం లోపల ఉన్న టాయిలెట్లు వాడకంలో ఉన్నపుడు తప్పనిసరిగా తలుపులు ఉండాలి. గృహ నిర్మాణం పూర్తి అయిన తరువాత గృహ ఆవరణలో ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశలలో ఉన్న పెద్ద వృక్షాలను పూర్తిగా తొలగించ కూడదు. గృహ నిర్మాణం పూర్తి అయిన తరువాత గృహ ప్రవేశం చెయ్యకుండా ఉంచకూడదు. ఎత్తుపల్లాలుగా తాత్కాలిక గచ్చులువేసి ఫ్లోరింగువాయిదా వేయకూడదు.

మేడ మీద మరియు మెట్లకు పిట్టగోడలు కట్టకుండా ఆపకూడదు. గృహం లోపల గోడలకు కనీసం ఒక కోటింగు తెల్లసున్నం లేదా తెల్ల సిమ్మెంటు వేయించాలి. బయట గోడలకు ఆపవచ్చు. బయట ద్వారాలకు అలుపులు పెట్టకుండా ఆపకూడదు. శ్లాబు వాస్తు రీత్యా వాటం సరిగా లేనపుడు శ్లాబుపై ప్లాస్టరింగులు/ఫినిషింగులు తప్పనిసరిగా చేయాలి.

ఇళ్లు కట్టుకునే స్థలానికి ఏ దిశలో నివాసం ఉండాలి : 
చాలా మంది ఇంటి స్థలం కొన్న తర్వాత ఎప్పటికైనా ఇల్లు కట్టిస్తాం కదా అని స్థలం దగ్గరలో అద్దె ఇల్లు తీసుకొంటారు. కొంత మంది గృహ నిర్మాణానికి ముందుగా ఆ స్థలం దగ్గరలో అద్దె ఇల్లు తీసుకొని అక్కడికి నివాసం మార్చడం చేస్తుంటారు. అటువంటివారు వాస్తురీత్యా కొన్ని సూచనలు పాటించవలసిన అవసరం ఉంది.అద్దెకు తీసుకొన్న ఇల్లు మన స్థలానికి నైరుతి, పశ్చిమం, దక్షిణాల్లో ఏదో ఒక దిక్కున ఉండాలి. ఇక్కడ నైరుతి అంటే స్థలం పక్కనే నైరుతిలోనే గృహం ఉండాలని కాదు, కొంచెం దూరం అయినా పర్వాలేదు.

మనం అద్దెకు ఉన్న ఇంట్లో నుంచి కట్టబోయే ఇల్లు ఈశాన్యం, తూర్పు, ఉత్తర దిశలలో ఏదో ఒక దిశకు ఉండాలి. దానివల్ల గృహ నిర్మాణం సకాలంలో పూర్తి కాగలదు. వాస్తులో ఇది సామాన్య విషయం. గృహం రిపేర్లు చేయించేవారు, మార్పులు చేయించేవారు ఇల్లు మారదలచినవారు కూడా ఈ విధంగా జాగ్రత్త పడడం మంచిది.

కుటుంబ సభ్యులు నిద్రించే అనువైన దిశలు : 
 
మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోవడం వలన గలిగే శారీరక, మానసిక సమస్యలను గురించి అందరికీ తెలిసిందే. సరైన నిద్రకు అనువైన ప్రదేశం చాలా అవసరం. వాస్తు రీత్యా కుంటుంబ సభ్యులు నిర్ణీత దిశల్లో నిద్రించడం వలన అనేక లాభాలు చేకూరుతాయి.వాస్తు ప్రకారం కుంటుంబంలోని వయస్సులో పెద్దవారు నైరుతి గదిలో పడుకోవాలి. మిగిలిన వారు వయస్సుల ప్రకారం వరుసగా దక్షిణ, పశ్చిమ, వాయువ్య గదుల్లో అవకాశాన్నిబట్టి నిద్రించడం మంచిది.

అలాగే ఒకే గదిలో కుటుంబ సభ్యులు అందరూ పడుకోవాల్సి వస్తే ఇంటికి పెద్దవారు నైరుతి దిశలోనే పడుకోవాలి. ఒక వేళ ఇంటికి పెద్దవారు క్రియాశీలక పాత్ర పోషించని వారుగా ఉన్నప్పుడు వారు నైరుతి దిశలో పడుకోవాల్సిన అవసరం లేదు.

అటువంటి వారి చిన్న పిల్లలతో సమానం కాబట్టి వారు వేరే గదుల్లో పడుకోవచ్చు. ఉమ్మడి కుంటుబం అయినపుడు పెద్దవారు నైరుతి గదిలోను, ఆ తర్వాత వారు పశ్చిమ, వాయవ్య లేదా దక్షిణ గదుల్లో నిద్రించడం శ్రేయస్కరమని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఇంటిలో ఏ గదులు ఎక్కడ ఉండాలి : 
 
ఇంటిలో పడక గది నైరుతి లేదా నైరుతికి దగ్గరగా దక్షిణ పశ్చిమాల్లో ఉండవచ్చు. పిల్లల పడక గది అయితే వాయవ్య, పశ్చిమం, దక్షిణాల్లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది ఆగ్నేయంలో ఉండటం శ్రేయస్కరం. హాలు ఇంటి మధ్యలో ఉంటూ ఉత్తరం, తూర్పుకు పెంచుకోవచ్చు. అయితే పూజ గది మాత్రం ప్రత్యేకంగానో లేక ఒక అలమారగా పెట్టుకుంటే సరిపోతుందా అనే విషయం గృహ యజమానుల ఇష్టాన్ని బట్టి మరియు గృహ వైశాల్యం మీద ఆధారపడి ఉంటుంది.విద్యార్థులకు సూచనలు:
తూర్పును చూస్తూ చదువుకోవటం లేదా వ్రాసుకోవడం చెయ్యాలి. ఇలా కుదరని పక్షంలో ఉత్తరం వైపు చూస్తూ చదువుకోవచ్చు. అలాఅని ఉత్తరం చూస్తూ అదేవైపు తల దించుకుని చదవకూడదు. దక్షిణ దిక్కు, నైరుతీని చూడడం మంచిది కాదు.
వివిధ గృహాలు, వాటి అమరికలు : 
 
గృహ ఆవరణలో మరో పోర్షన్లను కట్టుకోవచ్చు. కాని ఒక భవంతి వెనకాల ఇంకో భవంతిని కట్టకూడదు. ఉదాహరణకు ప్రధాన భవనంకు పశ్చిమం, దక్షిణంలో ఇంకో భవనం కట్టినపుడు అది గిడ్డంగిగానో లేక స్టోర్ రూంగానో వాడవచ్చును. కానీ కుటుంబ నివాసానికి పనికిరాదు.పశ్చిమంలో ఉన్న భవంతికి తూర్పులో ఉన్న భవంతి భారమౌతుంది. కాబట్టి పశ్చిమంలో ఉన్న భవనం నివాసానికి పనికిరాదు. అదేవిధంగా దక్షిణంలో ఉన్న భవనానికి ఉత్తరంలో ఉన్న భవనం భారమౌతుంది కాబట్టి దక్షిణం భవనంలో నివాసాం కూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

రెండు భవనాల మధ్య కాంపౌండ్ గోడ కట్టి విడదీసినట్లైతే రెండు భవనాలను కూడా నివాస యోగ్యం అవుతాయి. విశాలమైన స్థలంలో దక్షిణ, పశ్చిమాల్లో రెండు ప్రధాన గృహాలను కట్టుకోవచ్చు. తూర్పున ఖాళీ ఉంచి మిగిలిన మూడు దిశల్లోను కట్టుకోవచ్చు. ఉత్తరం ఖాళీ ఉంచి మిగిలిన మూడు దిశల్లో గృహాలను ఏర్పాటు చేసుకోవచ్చు.

గృహంలో మంచం వేసుకోవలసిన పద్దతి :
గృహంలో మంచం మీద నిద్రించే అలవాటు ఉన్నవారు మంచాన్ని ఎక్కడ పడితే అక్కడ వేసుకోరాదు. తద్వారా నిద్రను కోల్పోవడమే కాకుండా అనవసర ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది.మంచం ఏ రూములో వేసినప్పటికీ మంచం చుట్టూ కనీసం మనిషి తిరగ గలిగినంత ఖాళీ స్థలం ఉంచడం మంచిది. మంచం కొలత, రూము కొలతలను బట్టి మంచం చుట్టూ ఉంచే ఖాళీని నిర్ణయించాలి.

మంచానికి తూర్పు, ఉత్తరాలలో ఎక్కువ ఖాళీ, దక్షిణ పశ్చిమలలో తక్కువఖాళీ ఉండేలా చూసుకోవాలి. మంచాన్ని గోడకు అంటించి గదిలో మూలకు వేయకూడదు.

మరీ చిన్న గదుల్లో ఉండేవారు ఎంతో కొంత ఖాళీ పెట్టడానికి ప్రయత్నించాలి. గదిలో అటకలు, బీములు ఉన్నట్లయితే మంచం వాటి కిందకు రాకుండా చూసుకోవడం అవసరం. పిల్లర్లకు మరీ దగ్గరగా మంచం వేయకూడదు. ఎందుకంటే పిల్లర్లలోని ఇనుము రాత్రిల్లో అయస్కాంత శక్తిగా పని చేసి నిద్రపట్టకుండా చేసే అవకాశం ఉంది.

అంతేకాకుండా గదిలో అద్దం ఎదురుగా మంచం ఉండకూడదు. కుట్టుమిషన్లు, టీవీలు, కంప్యూటర్లు వగైరా మంచానికి మరీ దగ్గరగా ఉండరాదు. గుమ్మం ఎదురుగా మంచం వేయకపోవడం మంచిది. ఫ్యాన్ హుక్ సరిగ్గా అమరక పక్కకు జరిగినవారు సరైన విధంగా ఫ్యాన్ హుక్ వేయించుకోవాలి.

అద్దె ఇంటిలో చేరేవారు గమనికలు
సాధారణంగా సొంతఇల్లయినా, అద్దె ఇల్లయినా వాస్తురీత్యా ఉండాలి. సొంత ఇల్లు కలనెరవేరాలంటే అప్పటి వరకు అద్దెకుండే ఇల్లు కూడా వాస్తురీత్యా బాగుండాలి. మీరు ఉండే ఇల్లు గ్రామంలో అయినా, నగరంలో అయినా సరే వాస్తురీత్యా ఉండటం చాలా ముఖ్యం. అందుచేతనే అద్దె ఇంటిలో చేరేవారు ఆచితూచి అడుగు వేయడం మంచిది. అద్దె ఇంటిలో చేరేముందు గమనికల్లో ముఖ్యమైంది నైరుతి, దక్షిణ, పశ్చిమాలలో మాస్టర్ బెడ్‌రూమ్ ఉందోలేదో చూసుకోవాలి.

ఆగ్నేయంలో వంట గది ఉండాలి. ఈశాన్యంలో ద్వారం, గృహం మధ్యన ఖాళీ ఉండటం అవసరం. నైరుతిలో బాల్కనీ ఉండరాదు. ఇల్లు దిక్కులకు సరిగా ఉండాలి. ప్రతి పోర్షన్ చదరంగా లేదా దీర్ఘ చతురస్త్ర ఆకారంలో ఉండడం మంచింది. వృత్తాకారంలో మాత్రం ఉండకూడదు. అదేవిధంగా నైరుతి గదికి నైరుతిలో ద్వారం ఉండకూడదు.

ఇంటి ఆవరణలో నూతులు, గోతులు వాస్తుకు అనుగుణంగా ఉండాలి. చెడు వీధిపోట్లు, చీకటిగా ఉండి గాలి, వెలుతురు రానివి, రోడ్డు నుంచి బాగా పల్లంగా ఉన్న ఇళ్ళు మంచివికావు. టాయ్‌లెట్లు దక్షిణ, పశ్చిమాల్లో ఉండటం మంచిది.

ఇవి మాత్రమే కాక ఆ పోర్షన్ ఇంతకుముందు నుంచి అద్దెకు ఇస్తున్నదైతే ఇంతకుముందు అద్దెకున్న వారికి ఎలా ఉండేది, కలిసి వచ్చిందా లేక ఏవైనా ఇబ్బందులు పడ్డారా అన్నవిషయం తెలుసుకొని దాన్నిబట్టి అద్దెకు దిగాలి. పైకి బాగానే కనిపించినా గతంలో అద్దెకు ఉన్నవారికి తీవ్ర అనారోగ్య సమస్యలు, నానా విధములైన ఇబ్బందులు కలిగించిన పోర్షనులు, తరచూ ఖాళీ అయ్యే పోర్షనులు మంచివికావని తెలుసుకోవాలి.

ప్రమాదాలు, అకాల మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు జరిగిన పోర్షనులు మంచివి కావని తెలుసుకోవాలి. అసలు వాస్తు బాగున్న ఇళ్ళు తరచూ ఖాళీ అవ్వవన్న విషయాన్ని గుర్తించడం ఎంతైనా అవసరమని వాస్తు శాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి.

ఇంటిలో వాహన పార్కింగ్ ఎక్కడ చేయాలి :
ఇంటిలో ఎక్కడపడితే అక్కడ కారు, బైక్, సైకిల్ వంటి వాహనాలను పార్కింగ్ చేయలేము. దానికంటూ కొంత స్థలం కేటాయించి అక్కడ పార్కింగ్ చేస్తాము. అయితే ఆ స్థలం ఎక్కడ కేటాయించాలనే విషయమై వాస్తు శాస్త్రం కొన్ని సూచనలిస్తోంది.ఇంటిబయట, ఉత్తరం, తూర్పు దిశలలో వాహనాలను పార్కింగ్ చేయరాదు. దీనిని అనుసరించనట్లైతే వాహనాలకు అప్పుడప్పుడు మరమ్మతులు చేయాల్సి వస్తుంది. వాహన పార్కింగ్ స్థలాన్ని వాయవ్య దిశగా (ఉత్తర ప్రహరీ గోడను తాకని విధంగా) కేటాయించవచ్చు.

ఇంటికి బయట నైరుతి దిశలో కూడా వాహన పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయించవచ్చు. తద్వారా వాహన ప్రమాదాలను నివారించవచ్చని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

మంచి, చెడు శకునాలు : 
మీకు శకునం చూసే అలవాటు ఉందా? అయితే మంచి శకునం ఎలాచూడాలనే విషయాన్ని తెలుసుకోండి. అకస్మాతుగా ఎదురయ్యే శకునమే మంచి శకునం. మీరు ఇంటి నుంచి బయటకు ఎక్కడికైనా బయలుదేరే సమయంలో పసుపు, కుంకుమలతో, జడవేసుకుని కలకళలాడే ముత్తైదువు ఎదురైనట్లైతే అంతా శుభమే జరుగుతుంది. ఆ ముత్తైదువే వెంట్రుకలను విప్పుకుని రుద్రతాండవం వలే ఎదురైనట్టైతే కచ్చితంగా కీడే ఎదుర్కోవాల్సి వస్తుంది.నీళ్ళ బిందె, పాల బిందె, పెరుగు బిందె, అన్నం వంటి వాటిని మోసుకున్నవారు, బట్టలు పులిమే చాకలి వాడు, చెఱకు కట్టలు మోసుకున్న వాడు, జత బ్రాహ్మణులు ఎదురైనట్లైతే మంచి శకునంగా భావించవచ్చు. ఇలా కాక ఒకే ఒక బ్రాహ్మణుడు ఎదురురావడం మంచిదికాదు.

ఇతర జీవరాశుల్లో నెమలి, కోడి, చిలుక, కొంగ, కుందేలు, నక్క, గాడిద, ఆవు, జింక, ఉడత వంటివి ఎడమ నుంచి కుడికి వెళ్ళినట్టైతే వాటిని కూడా మంచి శకునంగానే భావించవచ్చని వాస్తుశాస్త్ర గ్రంధాలు చెబుతున్నాయి

జన జీవనానికి వాస్తు ఉపయోగాలు : 
ఆది నుంచి వెలుగు చూస్తున్న శాస్త్రాల ప్రకారం మానవుడి కర్మఫలాల పరిశీలన మేరకే ఆయా రుతువుల ప్రకారం వాస్తును జీవనాన్ని విశదీకరించటం జరుగుతుందని ప్రతీక. హైందవ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. దానికి అనుగుణంగానే గృహం, వివాహం, సంతానం, ఉద్యోగం, ధనం, జీవితం అంటూ మానవుడికి పలు విధాలుగా శాస్త్రాల ఫలితాలను అందించటం జరుగుతుంది.ఆయా జన్మ నక్షత్రాల మేరకు రాజు శనిగా, మంత్రి గురువుగా ఆర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు తదితర విభాగాల ద్వారా ఫలితాలను విశదీకరిస్తుంటారు. ప్రధానంగా జన్మ ఫలాలు, నక్షత్రాలు, జాతక చక్రాలకు అనుగుణంగానే జీవనం సాగుతుందని భారతీయుల నమ్మకం. ఇందులో భాగంగానే పురాణ పండితులు అనాదిగా చూపుతున్న శాస్త్రాలను పరిగణలోకి తీసుకుని, తమ జీవితాలకు తగ్గట్టుగానే నడుచుకుంటున్నారు.

ఇందులో గృహం, వాహనంజీవనం అనే వాస్తు జీవిత గమనాన్ని కూడా మమేకం చేస్తూ ఆయా జన్మ నక్షత్రాల ప్రకారం ఫలితాలను అందిస్తుంటాయి. ప్రధానంగా గృహాల నిర్మాణం ద్వారానే జీవన గమనంలో పెను మార్పులు సంభవిస్తాయని శాస్త్రాలు వెల్లడించటంతో భారతీయులు అధికంగా వాటినే అనుసరిస్తున్నారు.

గృహాలు – వీధి పోట్లు :
గృహానికి ఎదురుగా, నిలువుగా వుండే వీధి ఇంటి వరకూ వచ్చి ఆగిపోయినా – లేదా అక్కడ నుంచి ఏదో వైపుకు తిరిగినా, దానిని వీధిపోటుగా గుర్తించాలి. ఇటువంటి వీధిపోట్లు కొన్ని మంచి ఫలితాలను, కొన్ని చెడుఫలితాలను కలిగిస్తాయి.తూర్పు – ఈశాన్య వీధి పోటు
గృహానికి తూర్పు ఈశాన్య భాగంలో ఎదురుగా వుండే వీధి. దీనివలన పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. వీరు మంచి ఆత్మవిశ్వాసాన్ని కలిగి వుంటారు. ఏరంగంలో కాలు పెట్టినా పైచేయిగా వుంటారు.

ఉత్తర – ఈశాన్య వీధి పోటు
గృహానికి ఉత్తర ఈశాన్యభాగంలో వీధి వున్నది. దీని వలన స్త్రీలకు అన్నివిధాలా మేలు కలుగుతుంది. సుఖ సంతోషాలతో వారికోర్కెలు తీర్చుకుంటూ ఆనందంగా వుంటారు. ఇంటియజమానికి మానసిక ప్రశాంతత, ధనాదాయం బావుంటుంది.

ఉత్తర – వాయవ్యవీధి పోటు
ఉత్తర – వాయవ్య భాగములో నిలువుగా వీధి వుండుట గమనించగలరు. ఈ వీధిపోటు వలన స్త్రీలు తీవ్రమైన దుష్ర్పభావానికి లోనవుతారు. పెండ్లి సంబంధాలు కుదరకపోవడం, కుదిరిన సంబంధాలు కూడా చివరిలో తప్పి పోవడం, ఇంకా అనేక సమస్యలను, చికాకులను కలిగిస్తాయి.

పశ్చిమ వాయవ్య వీధిపోటు : 
పశ్చిమ – వాయవ్యానికి ఎదురుగా వీధిని గమనిచగలరు. ఈ వీధి పోటు మంచి ఫలితాలను కలిగిస్తుంది. యజమాని సమాజ గౌరవాన్ని, పలుకుబడిని పొందుతాడు. రాజకీయనాయకులుగా కూడా రాణించగలరు. ధనాదాయం బాగుంటుంది.

పశ్చిమ – నైరుతి వీధిపోటు:
గృహానికి పశ్చిమ నైరుతిభాగంలో ఎదురుగా వీధిని గమనించగలరు. దీని వలన శ్రమ అధికంగా వుంటుంది. ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదు. చేతికి అందవలసిన డబ్బు కూడా చేజారిపోతుంది. ఆర్థిక కష్ట నష్టాలు తప్పవు.

దక్షిణ నైరుతి వీధిపోటు :
గృహానికి దక్షిణ నైరుతిలో వీధిని గమనించగలరు. దీనివలన అనేక అశుభములు కలుగుతాయి. తరచుగా భార్య – భర్తల మధ్యన గొడవలతో సఖ్యతలేకుడా పోతుంది. ఆ ఇంట స్త్రీలకు అనారోగ్యాలు కలుగుతాయి. ఏకార్యం ప్రారంభించినా అవి ముందుకు సాగవు.

దక్షిణ – ఆగ్నేయ వీధిపోటు : 
గృహానికి దక్షిణ ఆగ్నేయంలో ఎదురుగా వీధిని గమనించగలరు. దీని వలన మంచి ఫలితములు కలుగుతాయి. కుటుంబ సుఖసంతోషాలతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. బంధువుల ఆదరణ, శుభకార్య నిర్వహణలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

తూర్పు – ఆగ్నేయ వీధిపోటు
గృహానికి దక్షిణ – ఆగ్నేయములో ఎదురుగా వీధి వుండటాన్ని గమనించగలరు. దీనివలన అనేక కష్ట – నష్టాలు కలుగుతాయి. ఎన్ని రకాలుగా, ఎంత కష్టపడి సంపాదించినా అంతకుమించిన ఖర్చు ఏదోక రూపేణా వచ్చిపడుతుంది. ఎప్పుడూ మానసిక వత్తిడితో శ్రమపడవలసి వుంటుంది. కుటుంబకలహాలు మరికొంత ఆవేదనకు గురిచేస్తాయి.

గృహ స్థలాలు- కలసి వచ్చే దిక్కులు :
 
గృహ స్థలాలు, అది అమరిన దిశలకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇళ్లు కడుతున్న వారు ఏ వృత్తిలోనో లేక వ్యాపారంలో ఉంటారో దానికి తగ్గట్టు దిక్కులలో అమరిన ఇంటి స్థలాలను ఎంచుకోవడం గమనార్హం.కొత్తగా మనం ఇళ్లు కట్టాలనుకుంటే అది అమరిన దిశనే పరిగణలోకి తొలుత తీసుకోవాలి. ఊరిలో ఆ స్థలం ఏ దిశగా ఉంటుందో దానినే ఆ సంథలం దిశగా పరిగణించాల్సి ఉంటుంది.

ఊరి దక్షిణ దిశ నుంచి ఉత్తర ముఖం చూసేలా ఉండే ఇంటి స్థలాన్నివిద్య, కళా రంగానికి చెందిన వారు కొంటే చాలా చక్కగా కలసి వస్తుంది. అలాగే తూర్పు వైపు పొడవుగా, పడమటి దిశ కొంత తగ్గినట్టు ఉన్న స్థలాల్లో ప్రభుత్వ శాఖల్లో ఉన్నత పదవుల్లో ఉన్న వారు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు ఇళ్లు నిర్మించవచ్చు.

అలాగే ఊరికి ఉత్తర దిశలో ఉన్న ఇంటి స్థలాన్ని వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు కొనవచ్చు. ఆ స్థలం దక్షిణ దిశలో కొంత పొడవుగా ఉండే పక్షంలో మరింత మంచిది.

దక్షిణ దిశ అన్నిటికన్నా ఉత్తమం :
 
ఇంటి వాస్తు ఎలా ఉండాలనే అంశంపై మన పూర్వీకులు ఎన్నో సూచనలు అందించినప్పటికీ, వాటన్నిటినీ మనం వెంటనే అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అయితే అందువల్ల వెంటనే మనకు ఎటువంటి ప్రమాదం ఏర్పడకపోయినప్పటికీ, దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా కొన్ని మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ప్రధానంగా దక్షిణ దిశకున్న ప్రాముఖ్యతను తప్పనిసరిగా గుర్తించాలి.వందలాది సంవత్సరాలకు మునుపే దక్షిణ దిశ ప్రాశస్త్యం గురించి తాళ పత్ర గ్రంథాల ద్వారా మన పూర్వీకులు తెలిపి ఉన్నారు. ఇల్లు, భవనం, భవంతి, అంతఃపురంలలో దక్షిణ దిక్కును కొంత ఎత్తు చేసి, పెట్టుకోవాలి. దక్షిణ ముఖంగా ఇంటిలోకి వెళ్లే ప్రవేశ ద్వారం ఉంటే మరింత అదృష్టం అందుకోవచ్చు.

ఇంటిలో దక్షిణం వైపున బావి తవ్వడం అంత మంచిది కాదు. దక్షిణం వైపు లోతుగా ఉండే పక్షంలో ఓ అడుగు మేర దాని ఎత్తు పెంచుకుంటే సరిపోతుంది. దక్షిణ భాగంలో బావి ఉంటే దానిని మూసివేసి, ఉత్తరం వైపుగా బోర్ వెల్ ఏర్పాటు చేసుకోవచ్చు.

అలా చేయలేని పక్షంలో దక్షిణం వైపు ఉన్న బావిలో నీటిని నేరుగా వాడుకోక దానిని ఈశాన్యం లేక తూర్పు వైపుగా మోటార్ ద్వారా తీసుకువచ్చి ఉపయోగించవచ్చు.

ఇంటి ఎత్తు ఎంత ఉండాలి : 
 
ఇంటి నిర్మాణం చేసేవారిలో చాలామందికి తమ ఇల్లును ఎంత ఎత్తులో నిర్మించాలన్న సందేహాలు కలుగుతుంటాయి. ఇంటి ఎత్తు దాని వెడల్పులో పదహారో భాగానికి నాలుగు హస్తాలు కలిపితే ఎంత ఉంటుందో అంత ఉండాలని వాస్తు శాస్త్రం చెపుతోంది.అంటే పైఅంతస్థులకు కింది అంతస్థు ఎత్తులో పన్నెండో వంతు తగ్గుతూ వస్తుంది. ఈ కొలత ప్రస్తుత కొలతలతో పోల్చి చూస్తే సుమారు 12 నుంచి 14 అడుగుల వరకూ వెడల్పును బట్టి ఉంటుంది.

ఇక ఇంటి ఎత్తును బట్టి ఇంటిలోపల ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. భవనానికి సంబంధించిన సీలింగ్ ఎత్తు 8 నుంచి 11 అడుగుల మధ్య ఎంత ఉన్నప్పటికీ గది ఉష్ణోగ్రతలో ఎటువంటి మార్పు ఉండదు.

ఆ తరువాత ప్రతి ఒక అడుగు ఎత్తుకీ దాదాపు 0.3 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుతం భవన నిర్మాలు చేసే వారు ఇంటి ఎత్తును 10 అడుగులు ఉండే విధంగా చేయటం వల్ల అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.

ఇక బహుళ అంతుస్థుల భవనాల విషయానికి వస్తే ప్రతి ఒక్క అంతస్థు ఎత్తుల్లో కొందరు తేడాలు కల్పించటం వల్ల అనవసర ఖర్చు పెరుగుతుంటుంది.

సహజంగా నివాసానికి ఉపయోగించే గృహాల ఎత్తు పది అడుగులు ఉండేవిధంగానూ, ఆఫీసులకు వినియోగించే భవనాల ఎత్తును పన్నెండు అడుగులు ఉండేటట్లు చూసుకోవాలి. దీనివల్ల అన్నివిధాలా సౌకర్యంగా ఉంటాయి.

భవనాల వయసు తెలిపే వాస్తు : 
భవన నిర్మాణ శాస్త్రం ప్రకారం…మనం నిర్మించుకునే మన ఇల్లు ఎంత కాలం వరకు ఉంటుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ఆ శాస్త్రంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు స్పష్టమైన రీతిలో అందుబాటులో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రాతిపదికన ఈ వివరాలను నిర్ణయించడంతో అవి చాలామందికి నమ్మకంగా ఉంటోంది.ఇంటి యజమాని జన్మ లగ్నానికి నాలుగో పాదంలో చంద్రుడు, పదకొండో పాదంలో గురు, అంగారకుడు, శని ఉన్న సమయంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ఆ భవనం వందేళ్ల పాటు స్థిరంగా ఉంటుంది. అలాగే గురు ఏడో స్థానంలో ఉంటూ, పదిలో చంద్రుడు ఉన్న సమయంలో నిర్మాణం ప్రారంభించే భవనం వెయ్యేళ్లు కూడా అలాగే చెక్కు చెదరకుండా ఉండగలదు.

లగ్నంలో లేక పదో పాదంలో శుక్రుడు, మూడో పాదంలో బుధుడు ఉన్న సమయంలో గృహనిర్మాణం చేపడితే ఆ ఇళ్లు రెండు వందల ఏళ్ల పాటు నిలకడగా ఉంటుంది. జన్మ లగ్నంలో చంద్రుడు, నాలుగో స్థానంలో బుధుడు ఉండే సమయంలో ముహూర్తం నిర్ణయిస్తే ఆ ఇళ్లు వందేళ్లకు పైగా స్థిరంగా ఉంటుంది.

శుక్రుడు 4, 7 పాదాలలో, సూర్యుడు ఆరో పాదంలో, గురువు మూడో పాదంలో ఉన్న సమయంలో పెద్ద పెద్ద మంటపాలు, భవంతులు, గోపురాలు వంటి వాటిని నిర్మిస్తే అవి వెయ్యేళ్ల వరకు వాటి స్థిరత్వాన్ని కోల్పోకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

గృహాలంకరణలో వాస్తు పాత్ర
గృహప్రవేశమైన తర్వాత ఇంట్లో ఎన్నో పనులు మిగిలి ఉంటాయి. వాటిలోనిదే ఇంటికి సున్నం వేయించడం. గృహప్రవేశానికి ముందు రంగు వేయించినా తర్వాత మళ్లీ సరిగ్గా వేయించుకుంటాం కొందరు ముందే సరిగా వేయిస్తారు. కొందరికి ఆ సమయం కూడా ఉండదు.ఇలాంటి సమయాల్లో మళ్లీ సున్నం వేయాలి కనుక కొన్ని జాగ్రత్తలతో వేస్తే సరిపోతుంది. ఇంటికి తెల్ల సున్నం వేయించుటలో తప్పులేదు. కాని ఇంటి పెద్ద జాతక రీత్యా లగ్నాధిపతి ఏ గ్రహముతో కలసి ఉంటాడో చూసుకుని రంగు వేయించడం మంచిది.

తూర్పు వైపు గృహమునకు తెల్ల రంగు, దక్షిణ వైపున అయితే ఎరుపు రంగు, పశ్చిమ వైపున అయితే నీలి రంగు, ఉత్తరం వైపు ఆకుపచ్చని రంగులు వేస్తే మంచిది. ఇంటికి ఇష్ట దైవం పేరు పెట్టుకోవచ్చు. పేరు పక్కనపెట్టే భవనము అంటే బాలురు గలదని, నిలయము అంటే నిధులు కలదని అర్థము.

ఉత్తరమున తల పెట్టి పడుకోకూడదు. ముఖ ద్వారానికి ఎదురుగాను, దూలానికి వెన్ను కింద భాగంలోనూ తలపెట్టి పడుకోరాదు. తూర్పు వైపు తిరిగి భుజించే విధంగా డైనింగ్ టేబుల్ ఉండాలి. ఇంట్లో ప్రతి గదిలోనూ ఈశాన్యం మూల ఖాళీగా ఉంచాలి.

ఏ వస్తువు అక్కడ పెట్టకూడదు, తగిలించకూడదు. ఇంటి ఆవరణలో చెట్లు పెంచేటట్టయితే వాటి నీడ ఇంటి మీద పడకుండా ఉండేట్టు చూడాలి.

ఇంటి స్థలం కోసం వెళ్లే సమయంలో శకునాల జాగ్రత్తలు
ఇంటిలో గది నిర్మాణాల విషయంలోనే కాక నిర్మాణ పనులు ప్రారంభించే ముందు కూడా వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటి స్థలం చూసేందుకు వెళ్లే సమయంలో ఎదురుగా వచ్చే శకునం కుడా ఆ ఇంటిలో మనకు ఎదురయ్యే అనుభవాలకు కారణంగా నిలుస్తుంది.తాపీ మేస్త్రీని ఇంటి నిర్మాణ స్థలానికి తీసుకుని వెళ్లే సమయంలో నుదుట కుంకుమ తిలకం, జడ నిండా పువ్వులు, మెడలో మాంగల్య సూత్రం కలిగిన ఓ నిండు సుమంగళి ఎదురుగా వస్తే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

ఈ రకమైన శకునంతో పనులు ప్రారంభిస్తే ఆ ఇంటిలో నివసించే వారు సకల సౌభాగ్యాలతో కలకాలం విలసిల్లతారని శాస్త్రంలో చెబుతున్నారు. అలాగే కొత్త ఇంటికి శంకు స్థాపన చేసే సమయంలో నీళ్లు లేక పాలతో నిండిన కుండ, అలాగే పెరుగు కుండను మోసుకొచ్చే మహిళలు (వాటిని తీసుకొచ్చే వాహనాలైనా సరే) కూడా మంచి శకునాలు కావచ్చు.

గృహంలో పెంచతగ్గ చెట్లు, మొక్కలు
గృహ నిర్మాణానికే కాకుండా, గృహంలో చెట్లను పెంచేందుకు కూడా శాస్త్రం చూడక తప్పదు. హిందూ వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లలో కొన్ని చెట్లను మాత్రమే పెంచుకోవచ్చు.శాస్త్రీయంగా చూస్తే మునగ, ఉసిరి, చింత, నేరేడు, పనస వంటి చెట్లు, మిరియాలు వంటి మొక్కలను ఇంటిలో పెంచడం వలన ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడుతుంది.

అలాగే అరటి, కొబ్బరి, మామిడి, వేప, ధానిమ్మ, నిమ్మ, ద్రాక్ష వంటి చెట్లను ఇళ్లలో పెంచినట్లైతే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని హిందూ సంప్రదాయ వాస్తు శాస్త్రం ద్వారా తెలుస్తోంది.

Hora : హోరా

మన దేశ  కాలమానంలో హోరా అనగా ఒక గంట అని అర్థం. దీని నుండి పుట్టినదే ఆంగ్లం లో HOUR . ఒక రోజుకు 24 హోరాలుంటాయి. ఆ హోరా లకు (గంట) ఏడింటికి ఏడు పేర్లున్నాయి. ఆవి……. వరుసగా… (ఈ వరుసలోనే) శని…గురువు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి. ఉదాహరణకు:…. ఆది వారము రవి హోరాతో  సూర్యోదయ సమయం లో ప్రారంభమయినచో మూడు ఆవర్తనాలు పూర్తికాగా అనగా 21 హోరాలు పూర్తి కాగ 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది. 23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది. 24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది. ఆతర్వాత హోరా 25వ హోరా… అనగా రేపటి దినం  మొదటి హోరా దానిపేరు చంద్ర హోరా. అనగా సోమవారము. అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది. ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది. రవి  హోరాతో ప్రారంభమైనది గాన అది ఆదివారం  వారము. ఈ విధంగానే మిదిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన ఏర్పడతాయి. ఇంత నిర్థిష్టమైన పద్ధతిలో వారమునకు పేర్లు పెట్టారు గనుకనే భారత దేశ సంప్రదాయాన్ని ప్రపంచ మంతా అనుసరిస్తున్నది.

 

పగటి సమయం సుర్యోదయం నుండి సూర్యస్తమమం వరుకు 
Weekday 1st hour 2nd hour 3rd hour 4th hour 5th hour 6th hour 7th hour 8th hour 9th hour 10th hour 11th hour 12th hour
ఆదివారం  Sun Ven Mer Moon Sat Jup Mars Sun Ven Mer Moon Sat
సోమవారం Moon Sat Jup Mars Sun Ven Mer Moon Sat Jup Mars Sun
మంగళవారం Mars Sun Ven Mer Moon Sat Jup Mars Sun Ven Mer Moon
బుధవారం Mer Moon Sat Jup Mars Sun Ven Mer Moon Sat Jup Mars
గురువారం  Jup Mars Sun Ven Mer Moon Sat Jup Mars Sun Ven Mer
శుక్రవారం Ven Mer Moon Sat Jup Mars Sun Ven Mer Moon Sat Jup
శనివారం  Sat Jup Mars Sun Ven Mer Moon Sat Jup Mars Sun Ven
రాత్రిసమయం : సూర్యస్తమమం నుండి సుర్యోదయం వరుకు 
ఆదివారం  Jup Mars Sun Ven Mer Moon Sat Jup Mars Sun Ven Mer
సోమవారం Ven Mer Moon Sat Jup Mars Sun Ven Mer Moon Sat Jup
మంగళవారం Sat Jup Mars Sun Ven Mer Moon Sat Jup Mars Sun Ven
బుధవారం Sun Ven Mer Moon Sat Jup Mars Sun Ven Mer Moon Sat
గురువారం Moon Sat Jup Mars Sun Ven Mer Moon Sat Jup Mars Sun
శుక్రవారం Mars Sun Ven Mer Moon Sat Jup Mars Sun Ven Mer Moon
శనివారం Mer Moon Sat Jup Mars Sun Ven Mer Moon Sat Jup Mars

astrology/ జ్యోతిష్యం

జ్యోతిష్యం అంటే గురువువలె చీకటి లో వున్నా మనజివతములకువెలుగును చూపించును.  జ్యోతిష్యం అనే దాని లో జ్యోతి అనే పదానికి వెలుగు లేదా కాంతి అని అర్థం..

జ్యోతిష్య శాస్త్రం

  శ్లో;       యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ! ప్రణమామిత మాదిత్యం బహిరంతస్తమోపహమ్ !!

  శ్లో;        ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ ! గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః !!

 

సరే ఈ కాంతి ఎలాంటిది అని చూస్తే అంతరిక్షం లో ఉండే కాంతి గోళాలైన నక్షత్రాలు, గ్రహాలు, సూర్య, చంద్రులు ఇవి భూ వాతావరణంపై, ప్రాణులపై చూపించే ప్రభావాలను, మానవ జీవితంతో వాటికున్న సంబంధాలను అధ్యయనం చేసేదే జ్యోతిష్య శాస్త్రం.కాబట్టి జ్యోతిష్యశాస్త్ర ముఖ్య లక్ష్యం భవిష్యత్తును గూర్చి తెలుసుకోవడమే కాక మానవుల ఆధ్యాత్మిక పరిణామం కోసమని కూడా తెలుస్తున్నది.అందుకే జ్యోతిష్య శాస్త్రాన్ని ‘వేద చక్షువు’ అంటారు. అంటే జ్ఞాన నేత్రం అని అర్థం. ఇంత ముఖ్య శాస్త్రం కాబట్టే వేదం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి 6 శాస్త్రాలలో నిష్ణాతుడై ఉండాలి. వాటిలో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి.
(మిగిలిన 5 శాస్త్రాలు శీక్ష, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, కల్పం).ప్రతి మానవుడు తన జీవితం లో భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుంటారు. అయితే భవిష్యత్తు తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి. అవి హస్త సాముద్రిక శాస్త్రం, సంఖ్యా శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం. అన్నిటి కంటే హేతుభద్దమయినది కష్టమయినది శాస్త్రీయమయినది జ్యోతిష్య శాస్త్రం. ఫలితములు చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవి అన్నియు కూడా మహర్షులు సూచించినవే. ఫలితములు చెప్పడం అనేది జ్యోతిష్కుడు మీద ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంను ఎక్కువ గా అధ్యయనం చేసే కొలది ఎన్నెన్నో విషయములు విపులంగా చెప్పగలరు. అలా ఫలితములు చెప్పాలంటే జాతకుడు/జాతకురాలు పూర్తి వివరములు కావలయును. అవి జన్మించిన తేదీ, జన్మించిన సమయం, జన్మించిన ప్రదేశం 3 వివరములు ఇచ్చినచో మీ జాతక ఫలితములు చెప్పవచ్చును. జన్మించిన సమయమును సరిగ్గా గుర్తించాలి. ప్రస్తుత కాలం లో ఆపరేషన్ ద్వారా జన్మించిడం జరుగుతుంది. కావున సరియాయిన సమయాన్ని గుర్తించాలి. ప్రదేశమును బట్టి అక్షాంశ, రేఖాంశములు(longitude and latitude)మారును. కావున సరిఅయిన తేదీ, సంవత్సరం, సమయం వివరములు గుర్తించవలయును.

27 నక్షిత్రముల వాళ్ళు జీవితంలో చక్కగా రాణిoచుటకు చెయ్యవలిసిన విధి విధానం :

 

 

              contact us అనే పేజి లో మా వివరములు లభించును,మీకు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణలో ఏ సందేహం ఉన్నా మాకు సంప్రదించినచో మీ జాతకమును సంపూర్తి గా వివరించి,తగిన  నివారణోపాయములు తెలియచేయబడును. ముఖ్యం గా విద్య, వృత్తి, వ్యాపార లావా దేవీలు, వాహన యోగం, వివాహం, ప్రభుత్వ ఉద్యోగ అవకాశములు, ఉద్యోగ స్టిరత్వం, దాంపత్యఅన్యోన్యత తెలుపబడి గ్రహ దోష నివారణము మరియు మంచి రత్నం సూచించి ఏయే గ్రహములు దోషములు ఉన్నాయో తెలియ చేసి జపహోమదానాదులు మాచేత నిర్వహించబడును.